గుంటూరు వెస్ట్ సీటు ‘ కిలారి ‘ కేనా..!

August 13, 2018 at 9:47 am
Kilaru Rosayya, Guntur west, YSRCP, Ticket, Ummareddy venkateswarulu

ఏపీలో గుంటూరు జిల్లాలో విప‌క్ష వైసీపీ సీట్ల కోసం కీల‌క నాయ‌కుల మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. గుంటూరు న‌గ‌రంలో గుంటూరు ప‌శ్చిమ సీటు రేసులో ఓ సీనియ‌ర్ నేత పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఒక‌ప్ప‌టి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అల్లుడు రాష్ట్ర వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కిలారి రోశ‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే పార్టీకి చేస్తోన్న సేవ‌ల‌ను గుర్తించి పార్టీ అధినాయ‌క‌త్వం సామాజిక స‌మీక‌ర‌ణల నేప‌థ్యంలో ఆయ‌న్ను గుంటూరు వెస్ట్ నుంచి బ‌రిలోకి దింపే ఆలోచ‌న చేస్తోంది.

ప్ర‌స్తుతం కిలారి పార్టీలో కీల‌క‌మైన రాష్ట్ర క‌మిటిలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. రోశ‌య్య గ‌త ఎన్నిక‌ల్లోనే అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉంది. ఆ ఎన్నిక‌ల‌కు ముందు రోశ‌య్య‌ను తెనాలి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. అయితే చివ‌ర్లో స‌మీక‌ర‌ణ‌లు మార‌వ‌డంతో తెనాలి సీటు రోశ‌య్య‌కు తృటిలో మిస్ అయ్యింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు వెస్ట్ నుంచి రోశ‌య్య‌ను పోటీ చేయించే ఆలోచ‌న‌లో పార్టీ అధినేత ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే రోశ‌య్య‌ను ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై కాన్‌సంట్రేష‌న్ చేయాల‌ని చెప్పిన‌ట్టు టాక్‌.

2018-08-12

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 1.92 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉన్నారు. వీరిలో కిలారి వ‌ర్గ‌మైన కాపు సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు 32 వేల వ‌ర‌కు ఉన్నారు. మిగిలిన వ‌ర్గాల్లో కమ్మ 25 వేల‌కు పైగా, రెడ్డి 11 వేలు, వైశ్య 14 వేలు, బీసీ 33 వేలు, మాల 20 వేలు, మాదిగ 18 వేలు, మైనారిటీ 23 వేలు ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి కిలారు కుటుంబానికి లింక్ ఉంది. రోశ‌య్య తండ్రి కిలారి కోటేశ్వ‌ర‌రావు 1989లో టీడీపీ నుంచి పోటీ చేయ‌గా అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న ఓడిపోయారు. వారి కుటుంబానికి నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు, బంధురికం, అన్ని సామాజిక‌వ‌ర్గాల‌తో స్నేహ‌బంధం వారికి క‌లిసొచ్చిన అంశం.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుత గుంటూరు ప‌శ్చిమ ఇన్‌చార్జ్ లేళ్ల అప్పిరెడ్డిని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని కూడా జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. స‌త్తెన‌న‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నాడు య‌ర్రం వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి 2004, 09లో గెలిచారు. రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి స‌త్తెన‌ప‌ల్లికి కంచుకోట లాంటిద‌ని ఆ సీటు అప్పిరెడ్డి గెలిచేందుకు సులువుగా ఉంటుంద‌ని కూడా పార్టీ భావిస్తోంద‌ని తెలుస్తోంది. అప్పిరెడ్డి పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంటుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వెస్ట్ సీటులో కాపులు బ‌లంగా ఉన్న నేప‌థ్యంలో ఇక్కడ నుంచి కిలారిను పోటీ చేయించాల‌ని అధిష్టానం భావిస్తోంది. అయితే జిల్లాలో టీడీపీ, వైసీపీలో ఇద్ద‌రు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లు మార్పు కోరుకుంటున్నారు. మ‌రి ఎన్నిక‌ల వేళ ఈ స‌మీక‌ర‌ణ‌లు ఎలా మార‌తాయో ? చూడాలి.

గుంటూరు వెస్ట్ సీటు ‘ కిలారి ‘ కేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share