ఆ లేడీ లీడర్ వైసీపీ ఎంట్రీకి జగన్ బ్రేక్

July 13, 2018 at 1:14 pm
Killi Kruparani, srikakulam, YSRCP, Entry, YS jagan, Praja samkalpa yatra

శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ ఎంట్రీకి జ‌గ‌న్ నో సిగ్న‌ల్ ఇచ్చారా..? అంటే తాజా ప‌రిస్థితులు అవున‌నే చెబుతున్నాయి.. కిల్లి కృపారాణి అడిగేది ఒక నియోజ‌క‌వ‌ర్గం అయితే.. జ‌గ‌న్ చెప్పేది మ‌రో నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో.. చేరిక‌పై ఇంకా సందిగ్ధ‌త కొన‌సాతూనే ఉంది.. నిజానికి చాలా రోజులుగా కిల్లి కృపారాణి వైసీపీలోకి వెళ్తున్నార‌నీ.. ఈమేర‌కు రంగం సిద్ధ‌మైంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. అయితే.. ఆమె అడిగిన టెక్కెలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం సీటు ఇచ్చేందుకు జ‌గ‌న్ సుముఖంగా లేక‌పోవ‌డంతో చేరిక ఖ‌రారు కాన‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మయంలో ఆమె పార్టీ వీడ‌కుండా ఉండేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు కూడా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

నిజానికి.. శ్రీ‌కాకుళం జిల్లాలో డాక్ట‌ర్‌గా కిల్లి కృపారాణికి మంచి పేరుంది. ఆమె 2009 ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచి కేంద్ర స‌హాయ మంత్రిగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆమె సొంత సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆమెకు రాజ‌కీయ ప‌రిణామాలు క‌లిసొచ్చాయి. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన 2014ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎంపీగా బ‌రిలోకి దిగిన ఆమె ఓట‌మిపాల‌య్యారు. ఇక అప్ప‌టి నుంచి పార్టీలోనే కొన‌సాగుతున్నా.. కార్య‌క్ర‌మాల్లో మాత్రం అంత చురుగ్గా ఉండడం లేదు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌గా.. ఆమె పార్టీ మారుతున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఈమేర‌కు ఆమె వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో కూడా సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

Killi-Krupa-Rani

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టెక్కెలి అసెంబ్లీ సీటు ఇవ్వాల‌ని కిల్లి కృపారాణి జ‌గ‌న్‌ను అడిగిన‌ట్లు స‌మాచారం. అయితే.. శ్రీ‌కాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడిపై పోటీకి దింపాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. జిల్లాలో జ‌గ‌న్ రాజ‌కీయ స‌ల‌హాదారుడు ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ జ‌రిపిన స‌ర్వేలో కిల్లి కృపారాణిపై సానుకూల స్పంద‌నే వ‌చ్చింద‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఆమె ఎంపీగా బ‌రిలోకి దింపేందుకు జ‌గ‌న్ మెగ్గుచూప‌గా.. అందుకు ఆమె ఒప్పుకోన‌ట్లు తెలుస్తోంది. త‌నకు టెక్కెలి అసెంబ్లీ సీటు ఇస్తేనే పార్టీలో చేరుతాన్న ష‌ర‌తు విధించార‌ట‌. అయితే.. ఇందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే క‌నిపిస్తోంది. టెక్కెలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డ‌మే. అయితే.. టెక్కెలిలో పార్టీ కోసం మొద‌టి నుంచి క‌ష్ట‌ప‌డిన వారిని కాద‌ని కిల్లి కృపారాణికి టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ సిద్ధంగా లేన‌ట్లు స‌మాచారం. అయితే.. జ‌గ‌న్ చేప‌ట్టిన‌ పాదయాత్ర సిక్కోలుకు చేరిన‌ప్పుడు ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఆ లేడీ లీడర్ వైసీపీ ఎంట్రీకి జగన్ బ్రేక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share