తెలంగాణ‌లో ఆయ‌న కోసం అమిత్‌షా స్కెచ్‌..!

October 11, 2018 at 12:08 pm

తెలంగాణ‌లో రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. తాజా ప‌రిణామాల‌తో స‌రికొత్త స‌మీక‌ర‌ణాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్ టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐల‌తో మ‌హాకూట‌మి ఏర్పాటు చేసే దిశ‌గా పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కావ‌డం.. స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డం… అయినా.. సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో క్లారిటీ రాక‌పోవ‌డంతో మ‌హాకూట‌మి ఏర్పాటుపై అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఈ వాతావ‌ర‌ణాన్నే బీజేపీ త‌న‌కు అనుకూలంగా మల‌చుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ముఖ్యంగా ఈ కూట‌మిలో తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత ప్రొఫెస‌ర్ కోదండ‌రాం క‌ల‌కుండా ఉండేందుకు.. త‌మ‌తో క‌లుపుకునేందుకు పావులు క‌దుపుతోంది. ఈమేర‌కు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షానే ఏకంగా రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

news8873

అయితే.. ఇక్క‌డ తెలంగాణ జ‌న‌స‌మితి అధినేత కోదండ‌రాం చేసిన వ్యాఖ్య‌లు కూడా కూట‌మి ఏర్పాటుపై అనేక సందేహాల‌ను క‌లిగిస్తున్నాయి. అదే స‌మ‌యంలో క‌మ‌లంతో కోదండ‌రాం క‌లిసే అవ‌కాశాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయ‌నే విష‌యాన్ని కూడా చెబుతున్నాయి. సీట్ల విష‌యం తొంద‌ర‌గా తేల్చాల‌ని.. లేనిప‌క్షంలో త‌మ‌దారి తాము చూసుకుంటామ‌ని కోదండ‌రాం కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది..? ఆయ‌న మాట‌ల్లోని ఆంత‌ర్యం ఏమిట‌న్న‌దానిపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. కోదండ‌రాం వ్యూహాత్మ‌కంగానే ఈ వ్యాఖ్య‌లు చేశార‌నీ.. ఆయ‌న క‌మ‌లంతో క‌లిసిన‌డిచేందుకే ఇలా అల్టిమేటం ఇచ్చార‌నే వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తోంది. ఆయ‌న ఇలా మ‌ట్లాడ‌డానికి మ‌రో కార‌ణంగా కూడా ఉందని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

మ‌హాకూట‌మిలో టీడీపీని క‌లుపుకోవ‌డం కోదండ‌రాంకు ఇష్టం లేద‌నీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడుగ‌డుగునా అడ్డుప‌డిన ఆ పార్టీతో క‌లిసి వెళ్తే ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌నే భావ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి.. ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ కూడా ఇదే విష‌యాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్తున్నారు. తెలంగాణను నాశ‌నం చేసిన టీడీపీతో పొత్తుపెట్టుకుంటారా..? అంటూ ఆయ‌న నిప్పులు చెరుగుతున్నారు. ప‌రిణామాల నేప‌థ్యంలో కోదండ‌రాం మ‌న‌సుమార్చుకుని క‌మ‌లం వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక జేఏసీ చైర్మ‌న్‌గా బ‌ల‌మైన ముద్ర వేసిన కోదండరాం బీజేపీతో క‌లిసి న‌డిస్తే.. ఇక త‌మ‌కు తిరుగే ఉండద‌ని క‌మ‌లం నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ను బీజేపీవైపు తిప్పేందుకు అమిత్‌షానే రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఏమేరకు ఫ‌లిస్తాయో చూద్దాం.

తెలంగాణ‌లో ఆయ‌న కోసం అమిత్‌షా స్కెచ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share