మ‌హాకూట‌మిలో కోదండ‌రాం క‌ల‌క‌లం..

October 13, 2018 at 12:29 pm

తెలంగాణ‌లో కాంగ్రెస్ నేత‌`త్వంలో టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐల‌తో మ‌హాకూట‌మి ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ కొన‌సాగుతోంది. సీట్ల స‌ర్దుబాటు కొలిక్కిరాక‌పోవ‌డంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇందులో తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీ అధినేత కోదండ‌రాం కాంగ్రెస్ పార్టీకి పెట్టిన డెడ్‌లైన్ ముగిసింది. అయినా.. ఎలాంటి స్పంద‌న‌మాత్రం రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఏం చేయ‌బోతున్నార‌న్న‌దానిపైనే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. కోదండ‌రాం నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. మ‌హాకూట‌మిలో ఆయ‌న ఎన్ని సీట్లు కోరుతున్నార‌న్న విష‌యం కూడా స్పష్టంగా తెలియ‌డం లేదు.

అయితే.. మ‌హాకూట‌మి సీట్ల స‌ర్దుబాటు విష‌యం కోదండ‌రాం వ‌ల్లే ఆగుతున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేత‌లు టీజేఎస్‌కు 8 నుంచి 9 సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కానీ.. కోదండ‌రాం మాత్రం ప్ర‌తీ పార్ల‌మెంటు స్థానానికి ఒక సీటు చొప్పున 17 సీట్లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. దీనివ‌ల్లే కూట‌మి సీట్ల‌స‌ర్దుబాటు ఆగింద‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. కోదండ‌రాం మాత్రం త‌న ప‌ట్టువీడేందుకు సిద్ధంగా లేన‌ట్లు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా బ‌రిలోకి దిగాల‌నే ఆలోచ‌న‌లో కూడా ఆయ‌న ఉన్నార‌ని ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కోదండ‌రాంను ఒప్పించేందుకు ఏకంగా ఏఐసీసీ నుంచి ఓ ప్ర‌తినిధి కూడా రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ర‌హ‌స్యంగా ఆయ‌న కోదండ‌రాంతో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అయినా.. సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో కోదండ‌రాం వెన‌క్కిత‌గ్గ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రో వాద‌న వినిపిస్తోంది. మ‌హాకూట‌మి మినిమం కామ్ ప్రోగ్రామ్ చైర్మ‌న్‌గా కోదండ‌రాంకు అవ‌కాశం క‌ల్పిస్తున్నందున సీట్లు విష‌యంలో ఆయ‌న కొంచెం త‌గ్గితే బాగుంటుంద‌నే టాక్ కూట‌మిప‌క్షాల్లో వినిపిస్తోంది. ఇలాంటి సంక్లిష్ట స‌మ‌యంలో ఆయ‌న ఇలా బెట్టుపెట్టుకుని కూర్చోవ‌డం స‌రికాద‌ని ప‌లువురు నాయ‌కులు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

ఇదిలా ఉండ‌గా.. మ‌హాకూట‌మి ఏర్పాటు, ఆయా పార్టీల నేత‌ల క‌ద‌లిక‌ల‌పై అధికార టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ నిరంత‌రం ప‌రిశీలిస్తున్నారు. కూట‌మి ఏర్పాటులో ఏం కొంచెం అటు ఇటు అయినా.. త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఇందులో కోదండ‌రాంపై మ‌రింత ద‌`ష్టి కేంద్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేగాకుండా.. కోదండ‌రాం తీరుపై కాంగ్రెస్ నేత‌ల్లో కొంద‌రు తీవ్ర అసంత‌`ప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో కోదండ‌రాం ఏం చేయ‌బోతున్నారు..? ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు..? సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో వెన‌క్కిత‌గ్గి కూట‌మిలో క‌లిసిపోతారా..? లేక త‌న‌దారి తాను చూసుకుంటారా..? అన్న‌ది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి.

మ‌హాకూట‌మిలో కోదండ‌రాం క‌ల‌క‌లం..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share