కోడెల గెలుపు గండికొట్టేలా.. జగన్ మార్క్ స్కెచ్!

July 4, 2018 at 9:38 am
Kodela siva Prasad, TDP, Speaker, YS jagan plans, ysrcp

రాజ‌ధాని అమ‌రావ‌తికి ఆనుకుని ఉన్న గుంటూరు జిల్లాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు వైసీపీ ఇప్ప‌టి నుంచే ప‌క్కా స్కెచ్ వేస్తోంది. ఈ జిల్లాలో ఎక్కువ స్థానాల‌ను గెలుచుకోవ‌డం అటు అధికార టీడీపీకి, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి కీల‌క‌మే. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో కొద్దిపాటి తేడాతో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని వైసీపీ చేజార్చుకుంది. ఈసారి మాత్రం ఆ అవ‌కాశం ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇవ్వొద్ద‌నీ, ఇక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ను ఎలాగైనా ఓడించాల‌న్న‌ప‌ట్టుద‌ల‌తో ఉంది.

గ‌త ఎన్నిక‌ల్లో కోడెల‌పై వైసీపీ నేత అంబ‌టి రాంబాబు వంద‌ల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైతే అభ్య‌ర్థిని మార్చే ఆలోచ‌న‌లో కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేగాకుండా.. స్పీక‌ర్ కోడెల‌ను ఓడించేందుకు తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల అంటున్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి టీడీపీని విమ‌ర్శించ‌డంలో ఆళ్ల ముందు వ‌రుస‌లో ఉంటున్నారు. అంబ‌టి రాంబాబు బ‌రిలోకి దిగినా ఈసారి గెలిచే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

స్పీక‌ర్ కోడెల త‌న‌యుల తీరుతో పార్టీకి న‌ష్టం వాటిల్లుతోంద‌నీ, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. దీనిని త‌మ‌కు అనుకూలంగా మ‌లచుకుని గెల‌వ‌డానికి వైసీపీ ఇప్ప‌టి నుంచే ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తోంది. ఈ క్ర‌మంలోనే కోడెల‌ను ఢీకొట్టే గెలుపు గుర్రం కోసం జ‌గ‌న్ వెతుకుతున్న‌ట్లు స‌మాచారం.
అయితే… రాజ‌ధానికి ఆనుకుని ఉన్న కీల‌క నియోజ‌క‌వ‌ర్గం మంగ‌ళ‌గిరిలో అభ్య‌ర్థిని మార్చ‌డానికి జ‌గ‌న్ సిద్ధ‌ప‌డుతారా..? అన్న‌ది అనుమాన‌మే.

మ‌రోవైపు అంబ‌టి రాంబాబు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి కాకుండా.. విజ‌య‌వాడ‌ప‌రిధిలోని మ‌రో స్థానాన్ని కోరుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ కోడెల‌ను ఓడించేంద‌కు వీరిలో ఎవ‌రిని బ‌రిలోకి దించుతార‌న్న ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండ‌గా.. జిల్లాలోని గుంటూరు, న‌ర‌సారావుపేట ఎంపీ స్థానాల‌కు కూడా ఎలాగైనా కైవసం చేసుకుకోవాల‌ని జ‌గ‌న్ చూస్తున్నార‌ట‌. ఈ జిల్లాల‌లో ప‌ట్టు సాధిస్తే రాజ‌ధానిలో ఇక తిరుగుఉండ‌ద‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కోడెల గెలుపు గండికొట్టేలా.. జగన్ మార్క్ స్కెచ్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share