వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆ వైసీపీ ఎమ్మెల్యేకు తిరుగులేదా..!

June 6, 2018 at 9:19 am
kona raghupathi, YSRCP, MLA, Bapatla Constituency, 2019 Elections

ఆయ‌న ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి నిధులూ తీసుకురాలేని నిస్స‌హాయ‌త‌. అభివృద్ధి ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉండిపోయింది. అయినా కూడా ప్ర‌జ‌లు మ‌ళ్లీ ఆయ‌నే మాకు కావాలి! అని నినాదాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఈ ప‌రిణామం.. గుంటూరు జిల్లా బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపిస్తోంది. ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న ప్ర‌తి ఒక్క‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. మ‌రి విష‌యంలోకి వెళ్తే.. 2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన కోన ర‌ఘుప‌తి బ‌రిలో దిగారు.

అప్ప‌టి ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ప్ర‌జ‌లు కోన‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. వాస్త‌వానికి అధికారంలోకి వ‌స్తుంద‌నుకున్న వైసీపీ రాక‌పోవ‌డంతో ఒకింత కోన ఇబ్బంది ప‌డ్డారు. ఎమ్మెల్యే నిధులు వ‌స్తాయ‌ని, అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.
అయితే, అది కూడా సాధ్యం కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లోకి నేరుగా వెళ్లి .. అధికార పార్టీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఆయ‌న ఎండ‌గ‌డుతున్నారు. అస‌లు ఏం జ‌రుగుతోంందో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు క‌ళ్ల‌కుక‌ట్టిన‌ట్టు వివ‌రిస్తున్నారు. దీంతో ఆయ‌పై వ్య‌తిరేక‌త లేకుండా చూసుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యార‌నే టాక్ వినిపిస్తోంది.

అయితే, ఇలా ఊరుకోకుండా సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ.. వారి యోగ‌క్షేమాల‌ను తెలుసుకుంటూ సాయం చేస్తున్నార‌ని అంటున్నారు స్థానికులు. సూర్యలంక సముద్రతీరంలో ఆక్రమణలు తొలిగించడమేకాకుండా సొంత నిధులు వెచ్చించి దుకాణాలు నిర్మించి గ్రామపంచాయతీకి అప్పగించారు. దీంతో పర్యాటకకేంద్రంలో కావాల్సినంత ఖాళీస్థలం వచ్చి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పట్టణంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన క్షీర భావన్నారాయణస్వామి దేవాలయం గాలిగోపురం పునర్నిర్మాణ పను లను వేగవంతం చేయించారు.

బాపట్ల ఏరియా వైద్యశాల అభివృద్ధి క‌మిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఎమ్మెల్యే రఘుపతి ఆసుపత్రిని ప్రభుత్వ నిధులతోపాటు సొంత నిధులు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దారు. ఆసుపత్రికి ఆదాయం వచ్చేవిధంగా క్యాంటీన్‌, సైకిల్‌ స్టాండ్‌ రైల్వేస్టేషన్‌వైపు ఏర్పాటు చేశారు. దీనికి సొంత నిధులు వెచ్చించారు. నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆపదలో ఉన్న రోగులకు సాయం చేస్తున్నారు.

గడియారస్తంభం నిర్మాణ కోసం తనతోపాటు తన కుటుంబ సభ్యులు దాతల నుంచి సుమారు 8 లక్షల రూపాయలు సమకూర్చి పురపాలక సంఘానికి అందజేశారు. ఇలా.. సాధ్య‌మైనంత వ‌ర‌కు కొంత అభివృద్ధి చేసి.. త‌నపై వ్య‌తిరేక భావం ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌డంలో కోన ర‌ఘుప‌తి స‌క్సెస్ సాధించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఆయ‌న‌కు కాస్త ఎడ్జ్ ఉన్న‌ట్టు బాప‌ట్ల పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం చెపుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Ycp-Mla-Kona-Raghupathi-At-Andhra-Assembly-1511413850-1791

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆ వైసీపీ ఎమ్మెల్యేకు తిరుగులేదా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share