పెను సంక్షోభంలో కొండ‌పి టీడీపీ రాజ‌కీయం… స్వామి వ‌ద్దే వ‌ద్దు..!

October 12, 2018 at 2:21 pm

ప్ర‌కాశం జిల్లాలోని కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో అధికార టీడీపీ పార్టీలో పెను సంక్షోభం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం సిక్కోలును తిత‌లీ తుఫాను కుదిపేస్తున్న తీరుగా.. ఇక్క‌డి టీడీపీని నాయకుల మ‌ధ్య ఏర్ప‌డిన విభేదాలు తీవ్ర‌స్థాయిలో కుదిపేస్తు న్నాయి. దీంతో కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారిపోయింది. వాస్త‌వానికి కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి బ‌ల‌మైన, ప‌ట్టున్న స్తానం. ఇక్క‌డ అభ్య‌ర్థిని క‌ళ్లుమూసుకుని గెలిపించుకునే ప‌రిస్థితి ఉంది. 1994, 1999లో దామ‌చ‌ర్ల ఆంజ‌నేయులు ఇక్క‌డ వరుస విజ‌యాలు సాధించారు. అంతేకాదు, ప్ర‌జ‌లకు అంకిత భావ‌మైన నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. నిత్యం వారికి అందుబాటులో ఉంటూ.. వారి స‌మ‌స్య‌ల ప‌రి ష్కారానికి కృషి చేశారు.

అదేవిధంగా పార్టీలోనూ త‌న‌కంటూ గుర్తింపు సాధించారు. దీంతో ఆయ‌న‌ను మంత్రిగా కూడా తీసుకున్నారు. పెద్దాయ‌న‌.. పెద్దాయ‌న.. అంటూ ఎంతో గౌర‌వంగా ఆయ‌న‌ను సంబోధించేవారు. అయితే, 2004 ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. అయితే, ఈ ఓట‌మికి ఆంజ‌నేయులుపై క‌త్తిక‌ట్టిన సొంత పార్టీ నాయ‌కుడే కార‌ణం కావ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా ఉండే చిన్న‌పాటి అసంతృప్తిని ఎగ‌దోసి ఆంజ‌నేయులుకు వ్య‌తిరేకంగా రాజ‌కీయం చేశారు. దీంతో ఆయ‌న విజ‌యానికి దూర‌మ య్యారు. ఇక‌, ఇదే ప‌రిస్థితి టీడీపీకి మ‌రోసారి కూడా శాపంగా మారింది. 2009లోనూ ఇక్క‌డ పార్టీ ఓడిపోయింది. అయితే, ప‌దేళ్ల త‌ర్వాత 2014లో ఇక్క‌డ పార్టీ క‌ష్ట‌ప‌డి అధికారంలోకి వ‌చ్చింది. డాక్ట‌ర్ డోలా శ్రీబాల వీరాంజ‌నేయ స్వామి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ పాత ప‌రిస్థితులే పున‌రావృతం అవుతున్నాయి. అయితే, అప్ప‌టికి ఇప్ప‌టికి ప‌రిస్థితు ల్లో తేడా మాత్రం క‌నిపిస్తోంది. గ‌తంలో ఇక్కడ సంక్షోభం త‌లెత్తినా.. నాయ‌కులు రోడ్లెక్క‌లేదు. కానీ, ఇప్పుడు మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా పై మాత్రం తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో నియోజ‌కవ‌ర్గంలోని ప్ర‌తి మండ‌లంలోనూ గ్రూపులు త‌యార‌య్యాయి. ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ప్ర‌తి ఒక్క‌రూ రోడ్డెక్కుతున్నారు. అంతేకాదు, పార్టీని ర‌క్షించుకోవాలి. ఎమ్మెల్యే పార్టీని నాశ‌నం చేస్తున్నాడు.. అనే కోణంలో అంద‌రూ రోడ్డెక్కారు. దీంతో ఇక్క‌డ పార్టీలో తీవ్ర సంక్షోభం నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే కొండ‌పి టీడీపీ ప‌రిర‌క్ష‌ణ సమితి- పేరుతో ఇటీవ‌ల స‌మావేశం కూడా నిర్వ‌హించి ఎమ్మెల్యే తీరును ఎండ‌గ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే డిసెంబ‌రులో మ‌రో భారీ కార్య‌క్ర‌మానికి సైతం రూప‌క‌ల్ప‌న చేశారు.

కొండ‌పి టీడీపీ ప‌రిర‌క్ష‌ణ సమితి నేత‌ల డిమాండ్ ఒక్క‌టే.. ఇప్పుడున్న సిట్టింగును మార్చి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే. ఈయ‌న‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఈ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. అలాగ‌ని వీరు ఇక్క‌డ గ‌తంలో పోటీ చేసిన నాయ‌కుల‌కు కూడా స‌పోర్ట్ చేసే ప‌రిస్థితి లేదు. వివాదాల‌కు తావులేని వ్య‌క్తి వస్తే తామంతా త‌ల తాక‌ట్టు పెట్టి గెలిపించుకుంటామ‌ని వీరు ప్ర‌తిజ్ఞ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ వివాదాలు తార‌స్థాయికి చేరిపోవడంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. మ‌రి ఇప్ప‌టికైనా టీడీపీ అధిష్టానం ఈ స‌మ‌స్య‌పై దృష్టి పెట్టి ప‌రిష్క‌రించ‌క‌పోతే…. ఈ ప‌రిణామాల‌తో ఇక్క‌డ టీడీపీ చిత్తుగా ఓడ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ వాళ్లే వ్యాఖ్యానిస్తున్నారు.

పెను సంక్షోభంలో కొండ‌పి టీడీపీ రాజ‌కీయం… స్వామి వ‌ద్దే వ‌ద్దు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share