కేటీఆర్‌ కౌంటర్: నేను మీ పప్పులా కాదు

September 8, 2018 at 1:44 pm

ఇప్పుడు యావత్ భారత దేశంలో చూపు తెలంగాణ వైపు ఉంది..ఎందుకంటే తొమ్మిది నెలల కాల వ్యవధి ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కి పోతున్నాయి. ప్రస్తుతం నాయకులు ఒకరిపై ఒకరు కౌంటర్లు, విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ కాంగ్రెస్ నాయకులపై తెగ విమర్శలు గుప్పించారు. దాంతో కాంగ్రెస్ నేతలు సైతం టీఆర్ఎస్ ముఖ్య నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు.

KTR-Controversial-Comments-on-Opposition-Party-Leaders-1530335365-1408

ఈ నేపథ్యంలో టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై పలు విమర్శలు చేశారు. తాజాగా టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. డియర్ ఉత్తమ్ అని సంబోధిస్తూ అమెరికాలో తన ఇంట్లో తాను తన అంట్లు తోముకుని ఉంటాటనని, తమ సొంత ఇళ్లలో ప్రతి భారతీయుడి మాదిరిగానే తాను కూడా చేశానని కేటిఆర్ ట్వీట్ చేశారు.

‘ఉత్తమ్ గారు..! నేను అమెరికాలో నిజంగానే గిన్నెలు కడిగాను. నేనే కాదు..అక్కడ ఉండే భారతీయులంతా ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. నేను చేసిన పని పట్ల గర్వపడుతున్నా. నా పని చేసుకొని గౌరవంగా బతికా… సంపాదించా… కానీ ఎప్పుడూ మీ పప్పు (రాహుల్ గాంధీ)లా జీవించలేదు’అంటూ ఘాటుగా విమర్శించారు.

1477211916-1759_0 (1)

తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు అమెరికాలో కేటీఆర్‌ అంట్లూ తోమాడని ఉత్తమ్‌, రేవంత్‌ రెడ్డిలు ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో ఏకంగా రూ.2.5 కోట్లు నగదు కాలిపోవడం వివాదాస్పదమైంది. ఓటర్లు పంచేందుకు ఆ డబ్బును తీసుకెళ్లారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. అదే విషయాన్ని ఇప్పుడు మరోసారి ప్రస్తావించారు కేటీఆర్. కాగా, కొంత కాలంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

కేటీఆర్‌ కౌంటర్: నేను మీ పప్పులా కాదు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share