ప‌వ‌న్‌పై లోకేశ్ తిరుగుబాటు

March 20, 2018 at 6:02 pm
lokesh, fire, on pawan kalyan, rankings, comments, interview

సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేశ్‌కు ప‌ట్ట‌రాని ఆగ్ర‌హం వ‌చ్చేసింది. మీరా మాకు మార్కులు వేసేది! అంటూ ఊగిపోయారు. మేం ఎలా క‌ష్ట‌ప‌డుతున్నామో మీకు క‌నిపించ‌డం లేదా? అని క‌డిగి పారేశారు. మొత్తంగా గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, టీడీపీకి మ‌ధ్య జ‌రుగుతున్న వార్ ఇప్పుడు పీక్ స్టేజ్‌కు చేరిపోయింది. ఈ క్ర‌మం లోనే నిన్న ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్‌.. ప‌నితీరు ఆధారంగా ఏపీ, తెలంగాణ  సీఎంల‌కు మార్కులు వేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప‌ది మార్కుల‌కు తాను ఆరు మార్కులు ఇస్తాన‌ని, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేవ‌లం రెండు న్నర మార్కులు మాత్ర‌మే ఇస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప‌రిణామం ఏపీలోని అధికార పార్టీ టీడీపీలో అగ్గిరాజేసింది. ప‌వ‌న్‌పై త‌మ్ముళ్లు రెచ్చిపోయారు. త‌మ అధినేత ఎంత‌లా క‌ష్ట‌ప‌డుతున్నారో ప‌వ‌న్‌కు క‌నిపించ‌డం లేదా? అని నిల‌దీశారు. 

 

ఈ క్ర‌మంలోనే తాజాగా స్పందించి సీఎం త‌న‌యుడు, మంత్రి లోకేశ్‌.. ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. చెన్నైకి చెందిన శేఖ‌ర్ రెడ్డి అవినీతిలో లోకేశ్ పేరు కూడా వినిపిస్తోంద‌ని ఇటీవ‌ల గుంటూరులో నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌ద‌స్సులో ప‌వ‌న్ వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన లోకేశ్‌.. నాపై ప‌వ‌న్ దుమ్మెత్తి పోస్తే.. నేను దులుపుకోవాలా? అని ఎదురు ప్ర‌శ్నించారు. నిరాధార ఆరోప‌ణ‌ల‌కు స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అంతేకాదు, నాపై ఆరోప‌ణ‌లు చేసిన మ‌ర్నాడే మాట‌లు మార్చార‌ని, నేను అవినీతి వ్య‌క్తుల‌తో అంట‌కాగిన‌ట్టు ఆధారాలుంటే ఎందుకు మాట మార్చార‌ని లోకేశ్ సూటిగా ప్ర‌శ్నించారు. తాత ఎన్టీఆర్‌కు చెడ్డ పేరు తెస్తున్నాన‌ని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు త‌న‌ను తీవ్రంగా బాధించాయ‌ని లోకేశ్ చెప్పుకొచ్చారు. 

 

తాను పుట్టేనాటికే తాత ఎన్టీఆర్ సీఎంగా ఉన్నార‌ని చెప్పారు. ఇక‌, త‌న ఆస్తుల విష‌యంపై మాట్లాడుతూ… తాను ఏటా త‌న ఆస్తుల‌ను ప్ర‌క‌టిస్తున్నాన‌ని లోకేశ్ చెప్పారు. అవినీతి ఆరోప‌ణలు వ‌స్తే.. నేరుగా నాతోనే ప‌వ‌న్ ఫోన్ చేసి మాట్లాడి ఉండా ల్సింది అన్నారు. ప్లానింగ్ బోర్డు స‌భ్యుడు పెద్ది రామారావు ఫొటోను శేఖ‌ర్‌రెడ్డి ఫొటోగా ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు.  అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతూ.. రాష్ట్రం కోసం కృషి చేస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ప‌వ‌న్ మార్కులు నిర్ణ‌యి స్తాడా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎలాంటిఆధారాలూ లేకుండా ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల త‌న‌ప‌రువు క‌న్నా కూడా ప‌వ‌న్ ప‌రువే పోతుంద‌ని చెప్పుకొచ్చారు. మొత్తంగా లోకేశ్‌.. ప‌వ‌ర్ స్టార్‌పై తీవ్ర‌స్థాయిలో ఫైరైపోవ‌డం వెనుక రెండు పార్టీల మ‌ధ్య దెబ్బ‌తిన్న రాజ‌కీయ కార‌ణాలే క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 

 

ప‌వ‌న్‌పై లోకేశ్ తిరుగుబాటు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share