కర్నూల్ రాజకీయాల్లో లోకేష్ చిచ్చు..టీజీ షాకింగ్ డెసిషన్

July 11, 2018 at 9:17 am
Lokesh, Kurnool, Ticket announcement, Shaking decision TG venkatesh

ప్రత్యర్థి పార్టీ అధినేతలపై మంత్రి నారా లోకేష్ విమర్శల దాడి పెంచారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ది పుత్రుడు చంద్రబాబు అయితే అవినీతి పుత్రుడు జగన్ అని…ప్రధాని మోడీ దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ గూడూరు మండలం నాగలాపురం పొలాల్లో పంట కుంటలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మంత్రి లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. కర్నూలు జిల్లా పర్యటనలో నారా లోకేష్ ప్రసంగాల్లో దూకుడు టిడిపి చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. లోకేష్ కర్నూలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌రెడ్డి.. ఎంపీగా బుట్టా రేణుకల్ని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ లోకేష్ ప్రజల్ని కోరారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో అదే వేదికపైనే ఉన్న టీజీ వెంకటేష్ ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వెంకటేష్ ఎస్వీ మోహన్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎస్వీ టీడీపీ గూటికి చేరారు. తర్వాత టీజీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. దీంతో అతడి కుమారుడు భరత్ నియోజకవర్గంలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆయన కూడా కర్నూలు అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు.

కొద్ది రోజుల క్రితం ఈ టిక్కెట్‌ వ్యవహారంపై ఎమ్మెల్యే ఎస్వీ-భరత్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. ఎవరు గెలుస్తారో.. వారికే చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని.. సర్వేలు చేయించుకుని.. నిర్ణయం తీసుకుంటారని.. టీజీ వర్గీయులు చెబుతూ వస్తున్నారు. రెండు వర్గాలు తమకే టిక్కెటన్న నమ్మకంతో ఉన్నాయి. లోకేష్ రాక సందర్బంగా రెండు వర్గాలు బలప్రదర్శన కూడా చేశాయి. బైక్‌ ర్యాలీలు నిర్వహించాయి.

అయితే మంత్రి లోకేష్‌ అభ్యర్థులను బహి రంగంగా ప్రకటించడంతో టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది. లోకేష్ నిర్ణయంతో టీజీ వెంకటేష్ అసంతృప్తికి గురయ్యారు. టీజీ వెంకటేశ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు..? అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు టీజీ భరత్‌ను వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు ఆ పార్టీ రాష్ట్ర ముఖ్యనాయకులు ఇప్పటికే రాజ్యసభ సభ్యు డు టీజీ వెంకటేశ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు కర్నూలు లో ప్రచారం ఊపందుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తన తనయుడు టీజీ భరత్‌ను రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయించాలనే పట్టుదలతో టీజీ వెంకటేష్ ఉన్నారు.

కర్నూల్ రాజకీయాల్లో లోకేష్ చిచ్చు..టీజీ షాకింగ్ డెసిషన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share