టీడీపీ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టిన లేడీ వైసీపీ ఎంట్రీ

May 18, 2018 at 3:51 pm
maddala sunitha, YSRCP, Entry, Gopala Puram, West Godavari, EX MLA

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో ఇత‌ర పార్టీల నుంచే కాకుండా ప‌లువురు మాజీ ప్రజాప్ర‌తినిధులు, గ‌తంలో ఎమ్మెల్యేలుగా చేసి స్త‌బ్దుగా ఉన్న వారు జ‌గ‌న్ చెంత‌కు చేరిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే కృష్ణా జిల్లాలో అయితే ఇత‌ర పార్టీల నుంచి భారీ ఎత్తున వ‌ల‌స‌లు కంటిన్యూ అయ్యాయి. ఇక జ‌గ‌న్ ఇప్పుడు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాద‌యాత్ర‌లో ఉండ‌గా ఓ మాజీ ఎమ్మెల్యే శుక్ర‌వారం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. 

 

జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గ మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాల సునీత జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతోపాటు వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. తాను వైసీపీ బలోపేతం కోసం పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా అన్నారు. 

 

ఇక మ‌ద్దాల సునీత గ‌తంలో వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ఆమె గోపాల‌పురంలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భ‌వించాక ఇక్క‌డ ఎప్పుడూ ఆ పార్టీయే గెలుస్తూ వ‌స్తోంది. ఒక్క గోపాల‌పురంలో సునీత మాత్ర‌మే తొలి టీడీపీయేత‌ర ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. నాడు బ‌లంగా వీచిన వైఎస్ గాలిలో సునీత ఈ రికార్డు క్రియేట్ చేశారు. 2004లో గెలిచిన ఆమె 2009లో పోటీ చేయ‌కుండా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు.

 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గోపాల‌పురం టీడీపీ కంచుకోట‌లో వైసీపీ జెండా ఎగ‌ర‌వేయాల‌ని జ‌గ‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. మ‌రి ఈ క్ర‌మంలో మ‌ద్దాల సునీత లాంటి మాజీ లేడీ ఎమ్మెల్యేలు పార్టీలో చేర‌డం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేదే. ఇక జ‌గ‌న్ ఈ రోజు పాద‌యాత్ర ద్వారకాతిరుల మండ‌లంలోని పాముల‌వారిగూడెం నుంచి ప్రారంభ‌మై రాజుపాలెం మీదుగా దూబ‌చ‌ర్ల వ‌ర‌కు కంటిన్యూ కానుంది.

ys-jagan-padayatra

 

టీడీపీ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టిన లేడీ వైసీపీ ఎంట్రీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share