ఉప్పూ-నిప్పూ క‌లిశాయి.. మోడీకి ఇక చుక్క‌లే!

August 2, 2018 at 4:00 pm
mamata banerjee and sonia gandhi, met, Modi, Against BJP Government

దేశ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో.. ప్ర‌తిప‌క్షాలన్నీ ఏక‌తాటిపైకి వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో `కాంగ్రెస్ హ‌ఠావో.. దేశ్ బ‌చావో` నినాదంతో మోదీ ప్ర‌చారం చేయ‌గా.. ఇప్పుడు మోదీని గ‌ద్దె దించేందుకు ప్ర‌తిప‌క్షాల‌న్నీ సిద్ధ‌మ‌వుతున్నాయి. విభేదాలు పక్క‌న‌పెట్టి.. అధికారంలోకి వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు. మోదీ లాంటి శ‌క్తిమంత‌మైన నేత‌ను ఎదుర్కోవాలంటే.. ఒక్కొక్క‌రుగా ఎదుర్కోవ‌డం సాధ్యం కాదని గ్ర‌హించిన వీరు.. ఐక్య‌తా రాగం ఆల‌పిస్తున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో ప‌శ్చిమ‌బంగ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జి భేటీ అవ‌డం.. జాతీయ రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారింది. అంతేగాక మ‌రికొన్ని అంశాల‌పైనా స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఎవ‌రుంటార‌నే విష‌యం ప‌క్క‌న పెట్టి.. మోదీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు.

TH16MODINATION

కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం.. వీగిపోవ‌డంపై ప్ర‌ధాని మోదీ విసిరిన వ్యంగ్యాస్త్రాలు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌తిప‌క్షాన్ని ముందుండి న‌డిపించే నేత‌లెవ‌రూ లేక‌పోవ‌డం, ఐక‌మ‌త్యం లోపించ‌డం, త‌న‌ను ఢీ కొట్టేంత స్థాయిలో బ‌ల‌మైన నేత‌లెవ‌రూ ప్ర‌తిప‌క్షాల్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌లో ఆత్మ‌విశ్వాసం మ‌రింత‌గా పెరిగిపోయింది. శ‌త్రువు బ‌ల‌హీన‌త కూడా ఒక్కోసారి ప్ర‌త్యర్థుల‌కు అంతులేని బ‌లాన్ని ఇస్తుంది. ఇదే సూత్రం మోదీ విష‌యంలో నూటికి నూరుపాళ్లు నిజ‌మ‌ని తేలింది. అంద‌రి ల‌క్ష్యం ఒక్క‌టే అయినా ఇన్నాళ్లూ విడివిడిగా పోరాడిన నేత‌లు..త‌మ త‌ప్పు తెలుసుకున్నారు. ఇప్ప‌టికి జ్ఞానోద‌యం కావ‌డంతో అంతా ఒకే గొడుగు కింద‌కు చేరుతున్నారు. జాతీయ స్ధాయిలో అన్ని పార్టీలదీ ఒకటే నినాదం… రాష్ట్రాల్లోనూ ఒక్కటే కోరిక. అదే.. అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించడం. ఇన్నాళ్లూ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మోదీని ప్ర‌ధాని పదవి నుంచి తప్పించాలి. అందరి ఏకైక ఫార్మలాగా మారింది.

నిన్నటి వరకూ ఉప్పూ-నిప్పుగా ఉన్న వారు, భూమి-ఆకాశం అంత దూరంగా మెలిగిన వారు ఇప్పుడు ఏకం అవుతున్నారు. ఇందుకు ఆ పార్టీ ఈ పార్టీ అని మినహాయింపు లేదు. జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అని సంబంధం లేదు. ఇందుకోసం వారి మధ్య ఇన్నాళ్లుగా ఉన్న వైరాన్ని పక్కన పెడుతున్నారు. కాంగ్రెస్‌లో అందునా జాతీయ స్ధాయిలో ఆ పార్టీకి తలలో నాలికలా మెలిగిన దీదీ మమతా బెనర్జీ అలిగి ఆ పార్టీని వీడారు. కొత్తపార్టీ పెట్టి పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్‌కి వ్యతిరేకంగానే పని చేస్తున్నారు. ఇప్పుడు సీన్ మారింది. తాజాగా దీదీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. చాలా సేపు మంతనాలు జరిపారు. దీని అర్ధం.. పరమార్ధం ఒక్కటే.

aa-Cover-7bi7poc8g7l3u3gavo7icloil4-20170517010208.Medi

బీజేపీని గద్దె దించడమే. ఇందుకోసం ప్రధాని పదవిని కూడా పక్కన పెడదాం అంటూ త్యాగానికి సిద్ధపడ్డారు. అంతకు ముందే రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని పక్కన పెట్టారు. ప్రధాని ఎవరూ అనేది ముఖ్య అంశం కాదని, మోదీని గద్దె దించడమే లక్ష్యమని చెప్పారు. వామపక్షాలు కూడా ఇదే వైఖరిని ప్రకటించాయి. టీడీపీ, బహుజన సమాజ్ పార్టీ, డీఎంకే, జనతాదళ్, శివసేన, ఎంఐఎం వంటి ప్రాంతీయ‌ పార్టీలు కూడా ఈ త్యాగాలకు సై అంటున్నాయి. నియంతలా మారుతున్న నరేంద్ర మోదీని అధికారం నుంచి తప్పించడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించుకున్నాయి. మ‌రి ఎన్నిక‌ల‌కు ఏడాది ఉండ‌గా.. ఎంత‌మంది ఒక్క‌ట‌వుతారో.. ఎంత‌మంది విడిపోతారో వేచిచూడాల్సిందే!

ఉప్పూ-నిప్పూ క‌లిశాయి.. మోడీకి ఇక చుక్క‌లే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share