మోదీజీ దీనిని మీరేమంటారు?

October 15, 2018 at 6:46 pm
Modi, BJP, M J Akbar, Mee Too issue, Allegations

ఎలాంటినిర్ణయాలైనా… పార్టీలోని ఎవరికి కష్టం కలగించినా… చలించకుండా పార్టీ అధిష్టానం సదరు నిర్ణయాలను తీసుకుంటే పార్టీ మనుగడ మరింతకాలం కొనసాగుతుంది. ఏపార్టీ బలంగా ఉండాలన్నా ఆ పార్టీ బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాకానిపక్షంలో పార్టీ సంక్షోభంలో పడుతుంది. ప్రస్తుతం బిజెపి కూడా అలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇప్పుడు భాజపా అలాంటి సంక్షోభం కూడలిలోనే ఉంది.

అసభ్యకర ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎం.జె.అక్బర్ ని రాజీనామా చేయాల్సిందిగా కాంగ్రెస్ తదితర పార్టీలు డిమాండ్ చేస్తుండగా మరోవైపు ప్రజలు కూడా ఈ విషయంలో మోదీ ఎలాంటి స్పందన లేకుండా మిన్నకుండడం సరికాదంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మంత్రిని రాజీనామా చేయమని మోదీ సూచిస్తే బాగుండేదని… ఫలితంగా దేశవ్యాప్తంగా బిజెపికి ఉన్న అభిమానం మరింత ఇనుమడించేదని కొందరు భావిస్తుండగా… మరికొందరు కేవలం ప్రచార పర్వంలోనే మహిళలను గౌరవిస్తే చాలదని… దేశంలో ఎక్కడ మహిళలకు ఎలాంటి అవమానం జరిగినా దానిపై వెంటనే స్పందించి, సదరు నిందితులను శిక్షిస్తే బాగుంటుందని మరికొందరు భావిస్తున్నారు.

ప్రచారంలో బేటీ బచావో అని చెప్పుకోవడం… భారతమాత అని భరతమాతకు పూజలు చేసుకుంటేచాలదని… భరతమాత అంటే కేవలం పార్టీ రూపొందించుకున్న చిత్రం మాత్రమే కాకుండా… భారతదేశంలోని ప్రతి మహిళలోనూ భారతమాతను చూసి… వారికి అన్యాయం, అవమానం జరిగినపుడు సక్రమంగా, సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకుంటేనే అది నిజంగా దేశమాతను గౌరవించినట్లవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఎంజె అక్బర్ తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వారి మీద పరువు నష్టం దావా వేస్తున్నారు. కానీ, ఇలాంటి చర్యల వల్ల.. కేవలం తాత్కాలికంగా ప్రజల దృష్టి మళ్లించగలరు. అంతే తప్ప.. ఆరోపణల బారినుంచి శాశ్వతంగా విముక్తి లభిస్తుందని అనుకుంటే పొరబాటే. మోడీ సర్కారు కూడా ఆయన మీద తక్షణ చర్యలు తీసుకోకుండా.. ఉపేక్షిస్తే అది వారికి ఆత్మహత్యా సదృశం అవుతుంది.

మోదీజీ దీనిని మీరేమంటారు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share