అవిశ్వాసం ఎఫెక్ట్: మోడీ గ్రాఫ్ పెంచిన బాబు!

July 21, 2018 at 4:30 pm
Modi, Chandra babu, No Confidence Motion, Parliament

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌క‌ద్రోహం చేసిన ప్ర‌ధాని మోడీ గ్రాఫ్‌ను టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పెంచారా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి.. ఆఖ‌రి అస్త్రంగా కేంద్రంపై ఆయ‌న‌ సంధించిన అవిశ్వాస తీర్మానం తిర‌గ‌బ‌డింది.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాని మోడీ ప్ర‌భ మ‌స‌క‌బారుతోంద‌నీ, ఆయ‌న ప్ర‌జాక‌ర్ష‌క‌శ‌క్తి రోజురోజుకూ త‌గ్గిపోతోంద‌ని నెల‌రోజుల కింద‌ట ప‌లు సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వ‌ల్లో తేలిన విష‌యం తెలిసిందే.. అంతేగాకుండా.. ఎన్డీయేలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయ‌ని, ఇక ప‌లు మిత్ర ప‌క్షాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఎన్డీయేలో కొన‌సాగుతున్న శివ‌సేన‌, జేడీయూ త‌దిత‌ర ప‌క్షాలు త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని చంద్ర‌బాబు అనుకున్నారు.. కానీ, ఆ పార్టీలు బాబుగారిని న‌మ్మ‌లేద‌ని తేలింది. ఆఖ‌రికి ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కాని బీజేడీ కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Modi4-kqK--621x414@LiveMint

అయితే, కేంద్రంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఒక‌రకంగా బీజేపీకే బాగా క‌లిసొచ్చింద‌నే చెబుతున్నారు ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు. అవిశ్వాసం తీర్మానంపై చ‌ర్చ అనంత‌రం జరిగిన ఓంటింగ్‌తో ఇప్ప‌టికీ ఎన్డీయే ఎంత బ‌లంగా ఉందో ప్ర‌తిప‌క్షాల‌కు తెలిసివ‌చ్చింది. అదే స‌మ‌యంలో బీజేపీలోనూ కొంద‌రు ఎంపీలు ఆ పార్టీకి వ్య‌తిరేకంగా ఉన్నారంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తేలిపోయింది. అంతేగాకుండా.. ఎన్డీయేలో కొన‌సాగుతూనే కేంద్రంపై, మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డే శివ‌సేన ఓటింగ్‌కు దూరంగా ఉన్నా.. ఎన్డీయేకి వ‌చ్చే న‌ష్టమేమీ లేద‌ని కూడా నిన్న‌టితో అంద‌రికీ తెలిసింది. ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా 325ఓట్లు, వ్య‌తిరేకంగా 125ఓట్లు ప‌డ్డాయంటేనే టీడీపీ ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం ఏస్థాయిలో వీగిపోయిందో అర్థ‌మ‌వుతుంది.

N-Chandrababu-Naidu-770x433

నిజానికి.. ఎన్డీయే నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఎన్డీయేలో లుక‌లుక‌లు ఎక్కువ‌య్యానీ, ప్ర‌ధాని మోడీ ప్ర‌భ మ‌స‌క‌బార‌డం మ‌రింత వేగం పుంజుకుంద‌ని ప‌లు స‌ర్వ‌ల్లే తేలింది. ఇప్పుడు అదే చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాసంతో మోడీ బ‌లాన్ని దేశ‌వ్యాప్తంగా తెలిసింద‌నీ, ఇప్పుడున్న బ‌లంతో మోడీని ఓడించ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు అంత సులువుకాద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. అనుకున్న‌దొక్క‌టి.. అయ్యిందొక్క‌టి.. అన్న చందంగా చంద్ర‌బాబా ప‌రిస్థితి త‌యారైంద‌ని చెబుతున్నారు. ఇక ఏపీలో ఆయ‌న ఇర‌కాటంలో ప‌డిపోయార‌నీ, వైసీపీలు, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌లు మ‌రింత రెచ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ఈ నెల 24న రాష్ట్ర బంద్‌కు జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ముందుముందు ఏం చేస్తారో చూడాలి మ‌రి.

అవిశ్వాసం ఎఫెక్ట్: మోడీ గ్రాఫ్ పెంచిన బాబు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share