”చాయ్ వాలా ” నుంచి ”డిష్ వాషర్” దాకా…

September 11, 2018 at 12:41 pm

ఎంతో వ్యూహరచనా ధురంధరులైన సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా సిల్లీ పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అలాంటి సిల్లీ పొరపాట్లే ఆ పార్టీకి ఉండగల విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తుంటాయి. అలాగే ప్రత్యర్థి పార్టీలకు అపారమైన సంపదను అందిస్తూ ఉంటాయి.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎన్నికల తరువాత ఖాళీ అవుతాడని, ఆ పిమ్మట తమ పార్టీ సమావేశాలు జరిగే వేదిక వద్దకు వచ్చినట్లయితే అక్కడ చాయ్ అమ్ముకోవడానికి తాము అవకాశం ఇస్తామని ఒక మాట అనడం ద్వారా గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఎంతటి దుమారం సృష్టించారు అందరికీ తెలుసు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మణిశంకర్ అయ్యర్ అలా నోరు జారిన, ఆ మాటలను జాగ్రత్తగా అందిపుచ్చుకుని అవును నేను చాయ్ అనే వాడినే అంటూ ప్రధాని నరేంద్రమోడి ప్రచారంలో విజృంభించారు. మణిశంకర్ అయ్యర్ నోరు జారిన పొరపాటును గుర్తించి రాహుల్ గాంధీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే లోగానే ప్రధాని మోడీ మైలేజీ సాధించేశారు.

670986-rahulgandhi1

ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ తరఫున అలాంటి పొరపాటే జరిగినట్లు గా కనిపిస్తోంది. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ స్వదేశానికి రాకముందు అమెరికాలో అంట్లు తోముతున్న బతికే వారంటూ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెరాస అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. ఈ డిష్ వాషర్ కామెంట్లను కేటీఆర్ చాలా సమర్థంగా తన ఇమేజ్ పెంచుకోవడానికి వాడుకుంటున్నారు. కేటీఆర్ అభిమానులంతా ఎడాపెడా తమ ఇళ్లలో అంట్లు తోముతూ… ఆ ఫోటోలను ట్వీట్ చేస్తూ తమ నాయకుడు కేటీఆర్ కు మద్దతు తెలియజేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ కూడా అచ్చంగా ప్రధాని నరేంద్ర మోడీ లాగానే.. తనను ఉద్దేశించి చేసిన దూషణలను తన అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. మొత్తానికి చాయ్ వాలా అనే పదం నుంచి… డిష్ వాషర్ అనే పదం వరకు … కాంగ్రెస్ నాయకులు నోరు జారి మాట్లాడే మాటలు ఆ పార్టీకి విపరీతమైన నష్టాన్ని కలిగించే లాగా మారుతున్నాయి.
పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నాడు కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వేటు రాకపోవచ్చు. కానీ ఆయన ఈ నష్టాన్ని ఎలా పూడుస్తారో మనం వేచి చూడాలి .

Rahul-Gandhi-will-be-PM-in-2019-says-TPCC-cheif-Uttam-Kumar-Reddy-620x320

”చాయ్ వాలా ” నుంచి ”డిష్ వాషర్” దాకా…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share