జ‌గ‌న్‌కు స‌మాధానం చెప్ప‌లేకే.. మోడీ వెర‌పు!

July 21, 2018 at 11:49 am
Modi, YS Jagan, not mentioned, in No confidence motion, Speech

తెలివి గ‌ల వాడు.. తాను న‌డుస్తూ.. ప‌క్క‌వారిని కూడా న‌డిపిస్తాడు. తెలివి త‌క్కువ వాడు.. త‌న‌కు తెలియ‌క పోతే.. క‌నీసం ప‌క్క‌వారిని అడిగైనా.. ఓ మంచి మార్గాన్ని చూసుకుంటాడు. కానీ, అతి తెలివి.. అహంకారంతో తెచ్చిపెట్టుకున్న తెలివి ఉన్న వారు.. మాత్రం ప‌క్క‌వారిని కూడా మురికి కూపంలోకి లాగేయాల‌ని కోరుకుంటారు! అచ్చు ఇలానే ఉంది ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి! ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు వంటి కీల‌క అంశాల్లో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన ద్వంద్వ ప్ర‌మాణాలు నేడు ఏపీని ఛిద్రం చేస్తున్నాయి. అతి తెలివి. త‌న‌కు మాత్ర‌మే క్రెడిట్ ద‌క్కాల‌న్న రాజ‌కీయ దుగ్ధ‌.. వంటివి చంద్ర‌బాబును దారి మ‌ళ్లించి ఏపీకి తీర‌ని అన్యాయం చేశాయి. విప‌క్ష నేత జ‌గ‌న్ రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు ఉన్నంత అనుభ‌వం లేక‌పోవ‌చ్చు.

YSR-Congress-to-move-no-confidence-motion-against-Andhra-Speaker-1024x700
కానీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వంటి వారు సైతం రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను వేలెత్తి చూపించే ప‌రిస్థితి లేదు. యూట‌ర్న్ తీసుకు న్నారంటూ.. చంద్ర‌బాబును పార్ల‌మెంటు వేదిక‌గా క‌డిగేసిన మోడీ.. జ‌గ‌న్‌ను కానీ, వైసీపీ ఎంపీల‌ను కానీ ఎక్క‌డా టార్గెట్ చేయ‌లేక పోయారు. అంటే, ఏపీ విష‌యంలో వైసీపీ కానీ, జ‌గ‌న్ కానీ, ఆయ‌న పార్టీ ఎంపీలు కానీ స‌రైన మార్గంలోనే వెళ్లా రు. బ‌హుశ‌.. జ‌గ‌న్‌కు స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టే.. గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల్లో వైసీపీ ఎంపీలు ప్ర‌వేశ పెట్టి న అవిశ్వాసంపై మోడీ క‌నీసం చ‌ర్చ కూడా చేప‌ట్ట‌కుండా దాట‌వేశార‌ని ఇప్పుడు స్ప‌ష్ట మ‌వుతోంది. ఇక‌, ఇప్ప‌టికిప్పు డు చంద్ర‌బాబు ఎంపీలు ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసంపై మోడీ హుటాహుటిన నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌ధాన కార‌ణం… చంద్రబాబు అనుస‌రించిన రాజ‌కీయ వైఖ‌రేన‌న్న‌ది సుస్ప‌ష్టం.

2018_7img18_Jul_2018_PTI7_18_2018_000059B-e1531906103230

రాజ‌కీయాల్లో న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఉండి బాబు సాధించిందేంటి? జాతీయ స్థాయిలో పార్టీల‌ను కూడ‌గ‌ట్టాన‌ని, లెక్క‌కు మిక్కిలి నేత‌లు త‌న‌కు అండగా ఉన్నార‌ని మైకులు ద‌ద్ద‌రిల్లేలా చేసిన ప్ర‌సంగాల తాలూకు ఊసు లేకుండా పోయంది. పార్ల‌మెంటులో టీడీపీ ప‌క్షాన ఆప్ ఎంపీలు త‌ప్ప మాట్లాడింది ఎవ‌రైనా ఉన్నారా? అంటే దుర్బుణీ వేసి వెతికినా క‌నిపించ లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోవ‌డ‌మే. ఏపీలో చెబుతున్న మాట‌ల‌కు పార్ల‌మెంటులో చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌కు సంబంధం లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబును మోడీ చుల‌క‌న చేసేశారు. మొత్తానికి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌క త‌ప్పిదాలు అన్ని విధాలా ఆయ‌న‌ను, ఏపీని కూడా స‌ర్వ‌నాశ‌నం చేశాయ‌నేది వాస్త‌వం అంటున్నారు రాజ‌కీయ నిపుణులు.

జ‌గ‌న్‌కు స‌మాధానం చెప్ప‌లేకే.. మోడీ వెర‌పు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share