గాయ‌త్రి సినిమాలో చంద్ర‌బాబుపై మోహ‌న్‌బాబు పంచ్‌లు

February 9, 2018 at 8:26 pm
gayatri

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ముక్కుసూటిత‌నానికి మారు పేరు అని మ‌రోసారి రుజువైంది. ఆయ‌న ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంలో ఎవ్వ‌రిని లెక్క‌చేయ‌ర‌ని మ‌రోసారి స్ప‌ష్ట‌మైంది. ఇక చంద్ర‌బాబుతో ఆయ‌న‌కు విబేధాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కూడా చంద్ర‌బాబు త‌న‌కు ఒక‌ప్పుడు బంధువు అని, ఒక‌ప్పుడు ఫ్రెండ్ అని చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి హీరోగా న‌టించిన గాయ‌త్రి సినిమాలో మోహ‌న్‌బాబు ప‌దే ప‌దే పంచ్‌లు పేల్చారు. ఇవ‌న్నీ చంద్ర‌బాబును, టీడీపీని, చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌ను టార్గెట్‌గా చేసుకున్న‌ట్టే ఉన్నాయి. దీంతో ఇవి ఇప్పుడు రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి.

 

పాత్ర కధకు పెద్ద సంబంధం లేని పొలిటికల్ డైలాగ్స్ విసిరారు. అమ‌రావ‌తి భూసేక‌ర‌ణ ఉద్దేశించి రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే భూసేక‌ర‌ణ అన్న కోణంలో ఓ డైలాగ్‌, చంద్రబాబు ఒకప్పుడు నేను వేసిన రోడ్ల మీద తిరిగేవాళ్లు నాకు ఓట్లు వేయరా అన్న డైలాగ్‌ను కూడా ప్ర‌స్తావించారు. ఈ డైలాగ్ ఆయ‌న గ‌తంలో చెప్పిందే. ఇక ఏపీకి ప్ర‌త్యేక హోదాపై వేసిన సెటైర్ సెన్సార్ క‌ట్ బీప్‌లో వెళ్లిపోయింది. 

 

ఇక నారా లోకేష్ మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్పుడు సార్వ‌భౌమాధికారం ప‌దం ప‌ల‌క‌డంలో చాలా ఇబ్బంది ప‌డింది కూడా గాయ‌త్రి సినిమాలో డైలాగ్‌గా ఉంది. ఇక పార్టీ మారిన జంపింగ్ ఎమ్మెల్యేల‌తో పాటు కేబినెట్ మినిస్ట‌ర్‌కు రాష్ట్ర ప‌క్షి ఎవ‌రో తెలియ‌ద‌న్న ప్ర‌స్తావ‌న ఉంటుంది. ఇక బీకాంలో ఫిజిక్స్ చ‌దివిన ఎమ్మెల్యే ప్ర‌స్తావ‌న కూడా ఉంది. ఇది వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వ‌చ్చిన విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌ను ఉద్దేశించిందే అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  

 

పై డైలాగులు చూస్తే మోహ‌న్‌బాబు చంద్ర‌బాబు, లోకేష్‌, టీడీపీని ఎంత‌లా డేర్‌గా ఆడేసుకున్నాడో అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న స‌మకాలీన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మోహ‌న్‌బాబు వేసిన ఈ పొలిటిక‌ల్ పంచ్ డైలాగుల‌కు థియేట‌ర్ల‌లో విజిల్స్ ఓ రేంజ్‌లో ప‌డుతున్నాయి.

 

గాయ‌త్రి సినిమాలో చంద్ర‌బాబుపై మోహ‌న్‌బాబు పంచ్‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share