బాబుకు మ‌రోషాక్‌.. టీడీపీకి నామా గుడ్‌బై..!?

March 15, 2019 at 10:28 am

ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబుకు ఎదురు దెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి. త‌ల‌కు మించిన స‌మ‌స్య‌ల‌తో బాబు స‌త‌మ‌త‌మ‌వుతూనే ఉన్నారు. ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ త‌గ్గి గెలుపు క‌ష్టంగా భావిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో పార్టీ వీడుతున్న సీనియ‌ర్ లీడ‌ర్ల‌తో మ‌రింత డైలమాలో ప‌డుతున్నారు. సీట్ల పంప‌కంలో అంస‌త్రుప్తుల‌ను బుజ్జ‌గించే ప‌ర్వం చేస్తున్నా కొంద‌రు స‌సేమిరా అంటున్నారు. ఓ వైపు జ‌గ‌న్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తున్నారు. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌కు బాబు ఉక్కిరిబిక్క‌రి అవుతున్నారు. ఇన్ని గంద‌ర‌గోళాల న‌డుమ పార్టీ వీడుతున్న వారితో మ‌రింత బ‌క్క‌ప‌లుచ‌న‌వుతున్నారు.

ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీని వీడారు. అదే కోవాలోకి ఇప్పుడు టీడీపీ సీనియ‌ర్ నేత‌, పొలిట్ బ్యూరో స‌భ్యుడు నామా నాగేశ్వ‌ర్‌రావు కూడా చేర‌బోతున్నాడు. కొద్దిరోజులుగా పార్టీ వ్య‌వ‌హారాల్లో అంటీ ముట్ట‌న్న‌ట్టుగా ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. రెండు రోజుల కింద‌ట పార్టీ అధినేత‌ను క‌లిసిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌ర‌ళిలో మార్పు లేద‌ని ద‌గ్గ‌రి వ‌ర్గాలే చెబుతున్నాయి. ఆయ‌న తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఖ‌మ్మం లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఆయ‌న బ‌రిలో నిలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల‌ని ఒత్తిళ్లు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలో గురువారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో స‌మావేశానికి నామా నాగేశ్వ‌ర్ రావు గైర్హాజ‌రు అవ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ఏది ఏమైనా అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ తెలుగుదేశం పార్టీకి దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతూనే ఉన్నాయి. జ‌నాల నుంచి తిర‌స్క‌ర‌ణ ఏమోగానీ, సొంత పార్టీ వాళ్లే పార్టీని తిర‌స్క‌రించి వెళ్లిపోవ‌డం ఎంతైనా ఆలోచించాల్సిన విష‌య‌మే. దీనిని బ‌ట్టే తెలుసుకోవ‌చ్చు రాష్ర్టంలో ఆ పార్టీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందోన‌ని.

బాబుకు మ‌రోషాక్‌.. టీడీపీకి నామా గుడ్‌బై..!?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share