శృతి మించిన లోకేశ్ అతి.. మితిమీరి గొప్ప‌లు!

March 17, 2018 at 3:05 pm
Nara Lokesh, Speech, Assembly, Chandra babu

మ‌న‌కు సంబంధించిన గొప్ప‌లు ప‌క్క‌వారు చెబితే బాగుంటుంది. కానీ, మ‌న డ‌బ్బా మ‌న‌మే కొట్టుకుంటే..? ప‌రిస్థితి ఏంటి? ఈ విష‌యాన్ని ఇప్పుడు అంద‌రూ ఏపీ మంత్రి, సీఎం కుమారుడు లోకేశ్ బాబునే ఇప్పుడు అంద‌రూ అడుగుతున్నారు! ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇదే నిజం. ప్ర‌భుత్వం గురించిన గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో లోకేశ్ త‌న తండ్రి చంద్ర‌బాబునే మించి పోయాడ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా త‌మ కుటుంబానికి చెందిన ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లోనూ లోకేశ్ బాబు శృతి మించి పోయారు. 

 

ప్ర‌జ‌ల్లో సింప‌తీ సాధించుకునేందుకు కొన్నాళ్ల కింద‌టి వ‌రకు చంద్ర బాబు.. నేను నా కుటుంబాన్ని,  ప్రాణానికి ప్రాణ‌మైన మ‌న‌వ‌డిని సైతం ప‌క్క‌కు పెడుతున్నాన‌ని, చూడాల‌ని ఉన్నా కూడా తాను దూరంగానే ఉంటున్నాన‌ని, ఏపీ కోసం అనేక త్యాగాలు చేస్తున్నాన‌ని బ‌హిరంగంగా చెప్పుకొచ్చారు. దీనికే కొన‌సాగింపుగా చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ కూడా గొప్పులు చెప్పుకోవ‌డంలో తండ్రినే మించిపోయాడు. ప్ర‌జ‌ల్లో సింప‌తీ సాధించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలనూ వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ వ్యాఖ్య‌లు తాజాగా శృతి మించాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. 

 

నిన్న మొన్న‌టి వ‌ర‌కు తాను సైతం త‌న ఫ్యామిలీని హైద‌రాబాద్‌కే ప‌రిమితం చేసి.. అమ‌రావ‌తిలోనే ఉంటున్నాన‌ని, ఏపీ ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పుకొంటున్నారు. అయితే, ఇప్పుడు మాత్రం ఈ డ‌బ్బాను మ‌రింతగా పెంచేశారు చిన‌బాబు. తాను 1983లో పుట్టాన‌ని, అయితే, చంద్ర‌బాబు బిజీ షెడ్యూల్ కార‌ణంగా తాను త‌న తండ్రి ముఖాన్ని 1995 వ‌ర‌కు చూడ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. ఈ ప‌రిణామ‌మే ఇప్పుడు తీవ్ర వ్యంగ్యంగా మారిపోయింది. 

 

నేను 1983లో పుట్టాను. అయితే, 1995 వ‌ర‌కు మా నాన్న ముఖం చూడ‌లేదు. పుట్టిన రోజుల్లోనూ సైతం ఆయ‌న ముఖం చూశానో లేదో తెలీదు. విశాఖ‌ను తుడిచిపెట్టిన హుద్ హుద్ తుఫానుకు ముందు రోజే త‌న భార్య బ్రాహ్మ‌ణి శీమంతం జ‌రిగింద‌ని, దీనికి కూడా చంద్ర‌బాబు కేవ‌లం ఐదు నిమిషాలే స‌మ‌యం కేటాయించార‌ని లోకేశ్ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లిని కూడా పొగ‌డ‌కుండా వ‌దిలి పెట్ట‌లేదు. 

 

త‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రి వ‌ల్లే త‌న తండ్రి చంద్ర బాబు ఈ రేంజ్‌లో ఉన్నార‌ని, త‌న త‌ల్లి కృషితోనే ప‌రిస్థితి మారింద‌ని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఈ సొంత డ‌బ్బా మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా పాకిపోయిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు న‌వ్విపోతున్నారు. అయినా కూడా లోకేశ్ త‌న ప‌రిస్థితిలో ఎక్క‌డా మార్పు రావ‌డం లేదు. ఇప్పుడు మ‌రింత‌గా ఈ ప‌రిస్థితి పెరిగిపోవ‌డంతో సొంత పార్టీలోనే విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

శృతి మించిన లోకేశ్ అతి.. మితిమీరి గొప్ప‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share