నేష‌న‌ల్ స‌ర్వే…ఏపీ, తెలంగాణ‌లో అధికార పార్టీల‌కే షాకేనా..!

March 17, 2018 at 5:36 pm
National survey, YSRCP, AP, Telangana, congress party, YS jagan

రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు, సమీక‌ర‌ణాలు ఎలా మారిపోతున్నాయో.. స‌ర్వేల ఫలితాల్లోనూ అంతే వేగంగా అంకెలు తారుమార‌వుతున్నాయి. మొన్న‌టివ‌ర‌కూ మాదే అధికారం అని చెప్పిన అధికార పార్టీలు.. ఇప్పుడు ఆ మాట గ‌ట్టిగా చెప్ప‌లేక‌పోతున్నాయి. పైకి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌దర్శిస్తున్నా.. లోప‌ల మాత్రం మేడిపండు చందంగా ప్ర‌వ‌ర్తిస్తు న్నారు. ఇటు రెండు రాష్ట్రాల్లోనూ ఇద్ద‌రు చంద్రుల‌కు ఎదురుగాలి వీస్తోంది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతాన‌ని ప్ర‌కటించ‌డం, మ‌రోప‌క్క హామీలు అమ‌లు చేయ‌లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. ఇక ఏపీలో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. కొద్ది రోజులుగా జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజా రాజ‌కీయాల‌పై నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాలు చంద్రుల‌కు షాకిచ్చేలా ఉన్నాయ‌ని తేలింది.  

 

కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. మ‌రోప‌క్క బీజేపీ, కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు కేసీఆర్‌!! ఇలా ఇద్ద‌రు చంద్రులు.. బీజేపీతో పోరాడుతుంటే.. రాష్ట్రంలో ప‌రిస్థితులు మాత్రం వీరికి అంత సానుకూలంగా లేవ‌ని సర్వేలో తేలిపోయింది. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీని విలన్ గా చేస్తూ.. తను మంచోడు అయ్యే ప్రయత్నంలో ఉన్నారు చంద్ర‌బాబు. నాలుగేళ్ల వైఫల్యాలకు అంతా బీజేపీదే బాధ్యత అని టీడీపీ నాయ‌కులు ప‌దేప‌దే చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయ పరిణామాల గురించి జాతీయ స్థాయి సర్వే ఒకటి జరిగింది.  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఈ సర్వే సాగింది. 

 

ముందుగా ఏపీ విషయానికి వస్తే.. అధికార పార్టీకి ఝలక్ తప్పదని సర్వే తేల్చింది. తెలుగుదేశం పార్టీ కి తీవ్రమైన పరాభవం తప్పదని ఈ సర్వే చెబుతోంది. ఏపీలోని మొత్తం 175 సీట్లకు టీడీపీకి 54 నుంచి 58 సీట్లు మాత్రమే వ‌స్తాయ‌ని సర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రమారమీ వంద సీట్లలో విజయం సాధించింది. తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి చేర్చుకుంది. ఇంత చేసినా ఈసారి మాత్రం ఎదురుదెబ్బ తప్పదని ఈ సర్వే పేర్కొంది. టీడీపీకి పరిమిత స్థాయిలో మాత్రమే సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక అధికారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అని ఈ సర్వే తేల్చి చెప్పింది. వందకు పైగా స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి , సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది. 

 

ఇక అంతో ఇంతో జనసేన ప్రభావాన్ని అంచనా వేసింది. అది ఐదారు సీట్లకు మాత్రమే పరిమితమైన ప్రభావం. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ అధికార పార్టీ పరిస్థితి కొంచెం బెటర్ గానే ఉంది. 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 49 నుంచి 52 సీట్లు సాధించుకోగలదని తేలింది. ఇక మిగిలిన స్థానాల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ సొంతం చేసుకోగలదని వెల్ల‌డైంది. మజ్లిస్ ఏడెనిమిది సీట్లు ఆ పార్టీ సొంతం చేసుకోగలదట‌. వీటిని బ‌ట్టి  తెలంగాణలో హంగ్ పరిస్థితులు ఏర్పడవచ్చ‌ని తేల్చింది. క్లిష్ట‌ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవడంలో సిద్ధ‌హ‌స్తులైన ఇద్ద‌రు చంద్రులు..  ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే!!

 

నేష‌న‌ల్ స‌ర్వే…ఏపీ, తెలంగాణ‌లో అధికార పార్టీల‌కే షాకేనా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share