ఆ తెలుగు ఛానల్ పై తివారి ఆత్మ ఘోష!

October 19, 2018 at 7:27 pm

నారాయ‌ణ ద‌త్ తివారీ. ఉమ్మ‌డి ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా విధులు నిర్వ‌హించిన కాంగ్రెస్ నాయ‌కుడు. ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం. అయితే, ఆయ‌న గురువారం 92 ఏళ్ల వ‌య‌సులో క‌న్నుమూశారు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ హ‌యాంనుంచి చ‌క్రం తిప్పిన ఆయ‌న సోనియా హ‌యాంలోనూ త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేశారు. అంతేకాదు, 90 ఏళ్ల వ‌య‌సులోనూ ఆయ‌న ఉత్త‌రాఖండ్ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించ‌గ‌లిగిన స్థాయిలో పాలిటిక్స్ చేశారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క మాన‌దు. అయితే, గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న తీవ్ర అనారోగ్యంతో ఉండ‌డం తెలిసిందే. ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగా ఆయ‌న త‌న కుమారు డు రోహిత్ శేఖ‌ర్ విష‌యంలో తీవ్రంగా వార్త‌ల్లోకి ఎక్కారు. రోహిత్ త‌న కుమారుడు కాద‌ని తుదికంటా ఆయ‌న వాదించారు.

hqdefault

అయితే, సుప్రీం కోర్టు బ‌ల‌మైన వ్యాఖ్య‌లు, చ‌ర్య‌ల‌తో ఒప్పుకుని తీరారు. రోహిత్ త‌న కుమారుడేన‌ని ఒప్పుకున్నారు. దీ ని క‌న్నాముందు.. తివారీ మ‌రో కీల‌క విష‌యంలో రోడ్డు కెక్కాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఓ మీడియా(దాదాపు అప్పుడే పుట్టింది ) తివారీ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను కూడా వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా ఆయ‌న ప‌డ‌క‌గ‌ది సంగ‌తుల‌ను కూడా ఈ మీడి యా వ‌దిలిపెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వ‌రుస క‌థ‌నాల‌తో తివారీ సెక్స్ సంగ‌తుల‌ను రోడ్డుకు లాగింది. దీనికి అత్యంత బ‌ల మైన సాక్ష్యాల‌ను కూడా పెట్టుకుని స‌ద‌రు ప‌త్రిక ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. 90 వ‌య‌సు పైబ‌డిన ముస‌లాయ‌న్ని న‌డిరోడ్డుకీడ్చింది. అదంతా టీఆర్‌పీ గేమ్‌లో భాగంగానే, త‌న ప‌ర‌ప‌తిని తెలుగు రాష్ట్రంలో ఘ‌నంగా చాటుకునేందుకు స‌ద‌రు చానెల్ పాకులాట‌గానే ప్ర‌జ‌లు ప‌రిగ‌ణించారు.

నిజానికి ప్ర‌జా స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయి. వీటికితోడు.. తెలంగాణ ఉద్య‌మం సెగ‌లు పొగ‌లు క‌క్కుతోంది. ఆ స‌మ‌యం లోనే ఈ ప‌త్రిక తివారీ వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తీసుకురావ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. దీంతో హుటాహుటిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను గ‌వ‌ర్న‌ర్‌గా తొల‌గించింది. దీంతో విష‌యం వెలుగు చూడ‌కుండా పోయింది. మొత్తానికి ఈ విష‌యం మాత్రం తీవ్ర వివాదానికి దారితీసిన ఈ వ్య‌వ‌హారాన్ని రెండు ప‌క్క‌ల విమ‌ర్శించిన వారు, త‌ప్పు బ‌ట్టిన వారూ ఉన్నారు. ఇక‌, ఇప్పుడు తివారీ మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఆత్మ.. ఖ‌చ్చితంగా ఈ ఛానెల్‌ను ప‌ట్టిపీడిస్తుంద‌నేవారు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి నిజంగానే ఇది జ‌రుగుతుందా? చూడాలి.

ఆ తెలుగు ఛానల్ పై తివారి ఆత్మ ఘోష!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share