వేడెక్కిన వెంక‌ట‌గిరి.. నేదురుమ‌ల్లి వార‌సుడి అరంగేట్రం?

May 8, 2018 at 6:16 pm
Nedurumalli Janardhana Reddy, son, Ramkumar reddy, political entray

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు వేడెక్కాయి. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాం కుమార్‌ రెడ్డి మ‌రోసారి త‌ళుక్కున మెరిశారు. త్వ‌ర‌లోనే తాను రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించ బోతున్న‌ట్టు చెప్పారు. దీంతో ఒక్క‌సారిగా వెంక‌ట‌గిరి రాజ‌కీయాలు సంచ‌ల‌నంగా మారాయి. ఇక్క‌డ ప్ర‌స్తుతం అధికార టీడీపీ నేత కొరుగొండ్ల రామ‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తు న్నాడు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున కొమ్మి ల‌క్ష్మ‌య్య నాయుడు బ‌రిలోకి దిగారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో రామ‌కృష్ణ గెలుపొందారు. అయితే, పార్టీ ప‌రంగా ఆయ‌న సాధించింది ఏమీ క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతున్న‌దీ లేదు. దీంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న‌ను మార్చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

 

ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న కూడా మౌనంగానే ఉంటున్నారు. త‌న పార్టీని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్ల‌డంలో ల‌క్ష్మ‌య్య పెద్ద‌గా కృషి చేసింది లేదు. ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్వ‌హించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు కూడా పెద్ద ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ చేయాల‌ని భావించినా ఆయ‌న మాట‌ల‌ను స్థానికంగా ఎవ‌రూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలే దు. దీంతో వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించ‌లేక‌పోయాడు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ల‌క్ష్మ‌య్య నాయుడుకు టికెట్ ఇస్తే.. ప‌రిస్థితి ఏంట‌ని? జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు పార్టీలూ ఇలా.. త‌మ త‌మ అభ్య‌ర్థుల‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న త‌రుణంలో రాజ‌కీయంగా మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేదురుమ‌ల్లి ఫ్యామిలీ నుంచి జ‌నార్ద‌న్ రెడ్డి వార‌సుడు తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. 

 

ఇటీవ‌ల మీడియాతో మాట్లాడిన నేదురుమ‌ల్లి రాం కుమార్..  వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్య‌క్తం చేశాడు.  అయితే, ప్ర‌స్తుతం రాం కుమార్ ఏపార్టీలోనూ లేడు. గ‌తంలో కాంగ్రెస్‌లోనే ఉన్నా.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడనే కారణంతో కాంగ్రెస్‌ పార్టీ రామ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేసింది. దీంతో 2014 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో దిక్కు లేకపోవడంతో సీనియర్‌ బీజేపీ నాయకుడు, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినా అప్పటి నుంచి పార్టీలో ఆయ‌న‌కు త‌గిన స్థానం ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న‌బీజేపీపైతీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ఏదో ఒక పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నాడు.  అయితే, రాం కుమార్‌ను పార్టీలో చేర్చుకునేందుకు అటు టీడీపీ, ఇటు వైసీపీలు కూడా తీవ్రంగా పోటీ ప‌డుతున్నాయి. మ‌రి ఆయ‌న ఏ పార్టీలో చేరేదీ ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌గానే ఉండ‌డం గ‌మ‌నార్హం. 

 

వేడెక్కిన వెంక‌ట‌గిరి.. నేదురుమ‌ల్లి వార‌సుడి అరంగేట్రం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share