ఇక్కడ నో కాష్ …అక్కడ బస్సులో 100 కోట్లు

April 17, 2018 at 5:29 pm
No cash, arun jaitly, 100 crores, karnataka elections, private bus, BJP

ల‌క్ష్మీదేవికి చంచ‌ల స్వ‌భావం ఉంటుంద‌ని అంటారు. అయితే, ఇప్పుడు క‌రెన్సీ నోట్ల‌కు కూడా చంచ‌ల స్వ‌భావం ఉన్నట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే… దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో న‌గ‌దు కు తీవ్ర కొరత ఏర్ప‌డింది. ఎంత రేంజ్‌లో ఇది ఉందంటే.. 2016లో పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన‌ప్పుడు ఏర్ప‌డిన కొర‌త లాంటిదే! ఇక‌, ఏపీ తెలంగాణ‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఏటీఎంలు అన్నీ నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. వీటిలో ఒక్క రూపాయి కూడా నిల్వ‌లేదు.వ‌రుస సెల‌వులు ఉన్నాయా? అంటే అదీ లేదు. నిన్న‌టితో సెల‌వులు కూడా అయిపోయాయి. ఈ రోజుల  వ‌ర్కింగ్ డే అయిన‌ప్ప‌టికీ ఏటీంలు అన్నీ బిజీగా ఉన్నాయి. రూపాయి కూడా లేక‌పోవ‌డంతో అకౌంట్ నిర్వాహ‌కులు తీవ్రఇక్క‌ట్టు ప‌డుతున్నారు. 

 

అత్య‌వ‌స‌ర ప‌రిస్తితులు త‌లెత్తిన వారు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారంలో క‌నీసం నాలుగైదు రోజులు ఏటీఎంల‌లో నో క్యాష్ బోర్డులే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో జ‌నాల ఇబ్బందులు మామూలుగా ఉండ‌డం లేదు. ఇలా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో క‌రెన్సీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. క‌ర్ణాట‌క‌లో మాత్రం డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తోంది. మ‌రో రెండు వారాల్లో ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. దీంతో ఇక్క‌డ అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారంలో తీవ్ర బిజీగా క‌నిపిస్తున్నారు. ఇక‌, ష‌రా మామూలే అన్న‌ట్టుగా ఇక్క‌డ కూడా ప్ర‌జ‌ల‌కు వాగ్దానాలు కామ‌న్‌. ఇక‌, ఏటీఎంల‌లో కూడా న‌గ‌దు పుష్క‌లంగా ల‌భిస్తోంది. తాజాగా  కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో బళ్లారికి వెళ్లే జాతీయ రహదారిపై ఒక ప్రైవేటు బస్సులో వంద కోట్ల డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

 

క‌ర్ణాక‌ట‌లో ఎన్నిక‌ల వేళ బీజేపీయే మిగిలిన రాష్ట్రాల్లో డ‌బ్బును కూడా అక్క‌డ‌కు త‌ర‌లిస్తున్నార‌న్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌ర్ణాట‌క ప‌క్క‌నే ఉన్న రాష్ట్రాల నుంచి డ‌బ్బుల‌ను అక్క‌డ‌కు త‌ర‌లిస్తుండ‌డంతో క‌ర్ణాట‌క ప‌క్క రాష్ట్రాల్లో డ‌బ్బు కొర‌త తీవ్రంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌ట్టుబ‌డిన డ‌బ్బులు కూడా మాజీ మంత్రి గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో త‌ర‌లిస్తోన్న డ‌బ్బులుగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఓ వైపు దేశ‌వ్యాప్తంగా ఏటీఎంలలో నగదు కొరతపై  ప్రజల ఆగ్రహం నేపథ్యంలో స్పందించిన  అరుణ్‌ జైట్లీ అన్ని బ్యాంకుల్లోనూ   సరిపడా నగదు అందుబాటులో ఉందంటూ  ట్విటర్‌లో   పేర్కొన్నారు. 

 

సర్క్యులేషన్లో తగినంత కరెన్సీ   ఉందంటూ వివరణ ఇచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో  ఆకస్మిక, అసాధారణ లావాదేవీల కారణంగా ఏర్పడిన తాత్కాలిక కొరతను  త్వరగా పరిష్కరిస్తానని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇక్క డ మాత్రం క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో డ‌బ్బును అక్క‌డ‌కు త‌ర‌లించేస్తుందని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి దీనికి బీజేపీ ఏం చెపుతుందో ?

 

ఇక్కడ నో కాష్ …అక్కడ బస్సులో 100 కోట్లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts