అవిశ్వాసంపై చ‌ర్చ‌.. వైసీపీ ఎంపీల‌కే క్రెడిట్‌..!

July 20, 2018 at 10:22 am
No Trust Motion, YSRCP, Resigned MPs, Credit

రాష్ట్ర ఏకైక విప‌క్షం వైసీపీ! ఈ పార్టీలో పోయిన వారు పోగా.. మిగిలిన ఎంపీలు(ఇప్పుడు మాజీలు) ఐదుగురు. వీరిలో 60 ఏళ్లు పైబ‌డిన వారు ముగ్గురు! మిగిలిన ఇద్ద‌రు యువ‌కులు! అయినా.. ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల విష‌యంలో ఎక్క‌డా వారు రాజీ ప‌డ‌లేదు. అంతేకాదు, త‌మ వ‌య‌సును సైతం లెక్క‌చేయ‌కుండా ప్రాణార్ఫ‌ణ చేసేందుకు కూడా వెనుకాడ‌లేదు. వీరి కృషి ఫ‌లితంగానే నేడు(శుక్ర‌వారం) పార్ల‌మెంటులో కేంద్రంపై ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌రిగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ఏదైనా ఓ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ప్పుడు ఎంత దీక్ష‌తో చేయాలో.. వైసీపీ ఎంపీల నుంచే నేర్చుకోవాలి! ఈ విష‌యంలో ఎలాంటి అతిశ‌యోక్తీ లేదు.

YSRCP_resign

పైగా.. వైసీపీ ఎంపీలు చేసిన కృషిని చ‌ర్చించాల్సిన అవ‌స‌ర‌మూ ఉంది. టీడీపీ ఎంపీల మాదిరిగా దీక్ష‌ల‌ను వైసీపీ ఎంపీలు చుల‌క‌న‌గా చూడ‌లేదు. దీక్ష‌ల‌ను ఒళ్లు త‌గ్గించుకునేందుకు, కొవ్వు కరిగించుకునేందుకు వారు చేప‌ట్ట‌లేదు. దీక్ష‌లు అంటే.. ఏపీ ప్ర‌జ‌ల ప‌క్షాన, రాష్ట్ర అభివృద్ధికోసం చేప‌ట్టారు. విభ‌జన చ‌ట్టంలోని కీల‌క అంశ‌మైన ప్ర‌త్యేక హోదా కోసం.. పోరు సాగించిన నేప‌థ్యంలో ఆఖ‌రి అస్త్రంగా వారు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు సైతం స‌మ‌ర్పించారు. వైసీపీ ఎంపీలు.. కార్యాచ‌ర‌ణ ను వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకువెళ్లారు. తొలుత కేంద్రంపై అవిశ్వ‌సం ప్ర‌క‌టించారు. పార్టీ అధినేత జ‌గ‌న్ వ్యూహాల మేర‌కు ఎంపీలు అంద‌రూ కేంద్రంపై అవిశ్వాసం ప్ర‌క‌టించారు.

అయితే, ఇది అప్ప‌టి ప‌రిస్థితిలో చ‌ర్చకు రాలేదు. అనంత‌రం, ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. కేంద్రం ఏపీకి అన్యాయంం చేస్తోంద‌న్న ఏకైక డిమాండ్‌తో వారు చేసిన దీక్ష‌లు దేశ స్తాయిలో సంచ‌ల‌నంగా మారాయి.ఈ విష‌యంలో వైసీపీ ఎంపీల‌కు అన్ని ప‌క్షాల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. ముగ్గురు ఎంపీలు, మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, ఎస్వీ సుబ్బారెడ్డిలు.. దాదాపు 60 ఏళ్ల వారే. షుగ‌ర్‌, బీపీ వంటి కీల‌క స‌మ‌స్య‌లు ఉన్నాయి. అయినా కూడా వారు వెరువ కుండా తెలుగు ప్ర‌జ‌ల కోసం, ఏపీ కోసం ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆమ‌ర‌ణ దీక్ష చేశారు. ఇక‌, చివ‌రి అస్త్రంగా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి.. తెలుగు వారి ఆత్మ‌గౌరవం ప్ర‌క‌టించారు. ఢిల్లీ వీధుల్లో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం స‌జీవంగా నిల‌ప‌గ‌లిగారు.

YSRCP_resigning

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పుకొచ్చారు. తెలుగు వారు ఇబ్బందుల్లో ఉంటే.. కేంద్రంకానీ, ప్ర‌ధాని మోడీ కానీ ప‌ట్టించుకోని తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా మొత్తంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో వైసీపీ ఎంపీలు చేసిన కృషి పఫ‌లితంగా నేడు పార్ల‌మెంటులో అవిశ్వ‌సంపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించినా.. కూడా వైసీపీ ఎంపీలు స‌భ జ‌రుగుతున్న స‌మ‌యంలోనూ పార్ల‌మెంటు వెలుప‌ల త‌మ ఆందోళ‌న‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. మొత్తానికి వీరి కృషి వృధా పోలేద‌ని, కేంద్రం దిగి వ‌చ్చి, రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు సిద్ధ‌మైంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

అవిశ్వాసంపై చ‌ర్చ‌.. వైసీపీ ఎంపీల‌కే క్రెడిట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share