ప‌ర‌కాల రాజీనామా వెన‌క ఏం జ‌రిగింది…

June 19, 2018 at 3:04 pm
Parakala Prabakhar, Resignation, TDP, Reasons

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపిన ఆయ‌న త‌న రాజీనామాను త‌క్ష‌ణ‌మే ఆమోదించాల‌ని కోరారు. ఇక ఈ రాజీనామా వెన‌క ప్ర‌భుత్వంతో పాటు చంద్ర‌బాబుపై కూడా విప‌క్షాలు, ప్ర‌జ‌ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతోన్న నేప‌థ్యంలోనే రాజీనామా (డ్రామా) జ‌రిగిందా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న తర్వాత కూడా పరకాలను సలహాదారు పదవిలో కొనసాగించటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే కూడా అటు సీఎం చంద్రబాబు, ఇటు పరకాల కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ సోమవారం నాడు జగన్ ఓ సమావేశంలో చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఓ వైపు బీజేపీపై పోరాటం అంటూ ఢిల్లీలో వంగి వంగి దండాలు పెట్టే చంద్రబాబు…తన పేషీలో మాత్రం కేంద్ర రక్షణ శాఖ మంత్రి భర్తను సలహాదారుగా పెట్టుకుంటారు అని ఎద్దేవా చేశారు. టీటీడీ బోర్డులోనూ మహారాష్ట్రకు చెందిన బిజెపి మంత్రి భార్యకు సభ్యత్వం ఇవ్వటంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఈ క్ర‌మంలోనే ప‌ర‌కాల రాజీనామా చేశారు అనేకంటే …ఆయ‌న‌తో రాజీనామా చేయించార‌ని ఇన్న‌ర్ టాక్‌. అయితే ప‌ర‌కాల మాత్రం తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు భంగం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో రాజీనామా చేసినట్టు పరకాల తెలిపారు. తన వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు నష్టం జరగరాదన్న ఉద్దేశంతో సలహాదారు పదవిని వదులుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
babu-and-parakala

ప‌ర‌కాల రాజీనామా వెన‌క ఏం జ‌రిగింది…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share