పార్ల‌మెంటు సాక్షిగా బాబు బాగోతం బ‌య‌ట‌ప‌డుతుందా..?

July 19, 2018 at 11:30 am
Parliament, BJP, Andhra Pradesh, Special Status, Chandra babu

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భ‌ర‌తం ప‌ట్టేందుకు బీజేపీ సిద్ధ‌మైందా..? బాబుగారి బాగోతాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు ప‌క్కా ప్లాన్ వేసిందా..? ఇందుకు అవిశ్వాసంపై జ‌రిగే చ‌ర్చ‌ను వేదిక‌గా మార్చుకుంటుందా..? అంటే ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు, క‌మ‌ల‌ద‌ళం నేత‌లు ఔన‌నే అంటున్నారు. గ‌త బ‌డ్జెట్ స‌మావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై మాట‌కూడా మాట్లాడ‌ని బీజేపీ ఇప్పుడు మొద‌టి రోజే టీడీపీ అందించిన అవిశ్వాసం నోటీసులను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని శుక్ర‌వారం చ‌ర్చ‌కు ఓకే చెప్ప‌డంలో ఇదే ఆంత‌ర్య‌మ‌ని భావిస్తున్నారు. ఎగిరెగిరి ప‌డుతున్న బాబుగారిని గిరిగీసి నిల‌బెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు, లెక్క‌లన్నింటినీ ప్ర‌తిప‌క్షాల ముందుకు ఉంచి, జాతీయస్థాయిలో ఆయ‌నను దోషిగా నిల‌బెట్టాల‌న్న‌దే క‌మ‌ల‌ద‌ళం ప్లాన్‌గా క‌నిపిస్తోంది.

అయితే, బీజేపీకి ఎందుకింత ధైర్య‌మంటే.. అందుకు ఎన్నో కార‌ణాలు ఉన్నాయి.. నిజానికి ఎన‌క‌టి రోజులు కావాయే.. ఇప్పుడున్న సాంకేతిక జీవ‌నంలో ప్ర‌తీ అడుడు, ప్ర‌తీ మాట‌.. అన్నీ రికార్డు అవుతున్నాయి.. క్ష‌ణాల్లో ప్ర‌పంచానికి తెలిసిపోతున్నాయి.. అంత‌ర్గ‌తంగా మాట్లాడుకునే విష‌యాలు కూడా బ‌హిర్గ‌తం అవుతున్నాయి. నేత‌ల అస‌లు రూపం జ‌నానికి తెలిసిపోతోంది. ఇప్పుడు దీనిని స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ద‌మైంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని, అభివ‌`ద్ధికి అన్నిర‌కాలుగా సాయం అందిస్తామ‌ని మోడీ మాట ఇచ్చిన మాట వాస్త‌వ‌మే. అయితే, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌త్యేక హోదా విష‌యంలో అనేక అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయ‌నీ.. ఇందుకు బ‌దులుగా అదే స్థాయిలో ప్ర‌త్యేక ప్యాకేజీ అందిస్తామ‌ని కేంద్రం చెప్పింది. దీనికి చంద్ర‌బాబు జై కొట్టారు.. ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేదు.. ప్యాకేజీ చాలంటూ ప‌దేప‌దే చెప్పారు.

ఇదే స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదానే కావాల‌ని లొల్లి చేసిన వారిపై బాబుగారు లాఠీ విర‌గొట్టారు. ఇక ప్యాకేజీ ప్ర‌క‌టించినందుకు అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు చంద్ర‌బాబు. అంతేగాకుండా… అప్పుడు మంత్రిగా ఉన్న వెంక‌య్య‌నాయుడికి స‌న్మానాలు చేశారు.. ఇలా కేంద్రం చెప్పిన దానిక‌ల్లా త‌లూపిన‌ట్లు ఆధారాలు ఉన్నాయి. వీటినే పార్ల‌మెంటు సాక్షిగా విప‌క్షాల‌కు చూపించేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. అలాగే.. నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వ్య‌యాన్ని అడ్డ‌గోలుగా పెంచ‌డం.. త‌దిత‌ర అంశాల‌పై స‌మ‌గ్రంగా చ‌ర్చించి, అస‌లు విష‌యాన్ని ఆంధ్రుల క‌ళ్ల‌ముందు ఉంచేందుకు అన్నీ రెడీ చేసుకున్న‌ట్లు ప‌లువురు చెబుతున్నారు. బీజేపీ ధీమాను చూస్తుంటే మాత్రం బాబుగారి ప‌రువు పోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. రేపు ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి.

పార్ల‌మెంటు సాక్షిగా బాబు బాగోతం బ‌య‌ట‌ప‌డుతుందా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share