బాబు, ప‌వ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న‌ట్టుంది..!

March 15, 2019 at 11:56 am

అనాల్సింది కేసీఆర్‌ను కాదు.. అడ‌గాల్సింది ఆయ‌న‌ను అసలే కాదు.. మ‌న మానాన మ‌న‌ల్ని ఎప్పుడో వ‌దిలేశారు తెలంగాణ సీఎం కే చంద్ర‌శేఖ‌ర్‌రావు గారు. వ‌ద‌లాల్సింది మ‌న ద‌గ్గ‌రి కొంద‌రు స్వార్థ ప‌రులే. నిజంగా ఎవ‌రిని ఎవ‌రు నిద్ర లేపారు. ఎవ‌రి జోలికి మొద‌ట ఎవ‌రు వెళ్లారు నిజంగా మీకు తెలియ‌దా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు. మీరు కూడా రాజ‌కీయాలు నేర్చుకుని దాదాపు ఐదేళ్లు అవుతోంది కాదా. మీ మిత్రుడు చంద్ర‌బాబు నాయుడు గారిని వ‌దిలేసి అక్క‌డెక్క‌డో ఉన్న కేసీఆర్‌ను అన‌వ‌స‌రంగా ఆడిపోసుకుంటారెందుకు. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన‌వ‌స‌రంగా ఆయ‌న‌ను కెలికింది మ‌న చంద్ర‌బాబు కాదా. ఆ విష‌యం మీకు తెలియ‌దా.?

ఆ రాష్ర్ట ఎన్నిక‌ల వేళ వారివారి నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎప్పుడూ లేని పొత్తులు పెట్టుకున్న‌ది మ‌న చంద్ర‌బాబు కాదా. అదీ కేవ‌లం తెలంగాణ రాష్ర్టంలో కేసీఆర్ గారిని గ‌ద్దె దింప‌డానికి అనే ఒకే ఒక ల‌క్ష్యంతో అని మీకు తెలియ‌దా..? ఆ రాష్ర్ట ఎన్నిక‌ల వేళ మ‌న చంద్ర‌బాబుగారు రాహుల్‌గాంధీతో పాటు చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగి ఎన్నిక‌ల ప్ర‌చారం చేసి డైరెక్ట్‌గా టీఆర్ ఎస్ పార్టీని ఇంటికి సాగ‌నంపాల‌ని స్వ‌యంగా ప్ర‌చారం చేసిన బాబు గారిని వ‌దిలేసి ఇప్పుడు **కేసీఆర్.. మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండ‌ని..** అర‌వ‌డం ఏం బాగుటుంది చెప్పండి. ప్ర‌జ‌ల మ‌ధ్య వైరాలు పెడుతుంది మ‌న బాబుగారు. హైద‌రాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల‌ను రెచ్చ‌గొట్టే ప‌నులు చేస్తోంది ఎవ‌రో మీకు తెలియ‌దా..?

వైసీపీ నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మీరు కేసీఆర్‌ను అంటున్నార‌నే విష‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టం మొత్తంగా తెలుసులెండి. చంద్ర‌బాబుకు, మీకు లోపాయికారీ ఒప్పందం లేనిదే ఆయ‌న జోలికెందుకెళ్తారు. ఆయ‌న స్వ‌యంగా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌న్నార‌నే క‌దా మీ ఈర్యాద్వేషాలు. ఒక్క విష‌యం ప‌వ‌న్‌గారు మీరు ఆ మ‌ధ్య నేరుగా వెళ్లి కేసీఆర్ గారిని క‌లిసొచ్చారు క‌దా. అప్పుడు చెప్ప‌లేక‌పోయారా మ‌మ్మ‌ల్ని వ‌దిలేయండి సార్ అని. మీరు కూడా జ‌గ‌న్‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి భ‌యంతోనే కేసీఆర్‌ను అంటున్నారు కానీ మీకు మాత్రం ఆయ‌న‌ను అనాలి అనే కోరికా ఏంటి..? దీని వెన‌క కూడా బాబు డైరెక్ష‌న్ ఉంద‌నేది మెడ‌కాయ‌మీద త‌ల‌కాయ ఉన్న ప్ర‌తి ఒక్క‌డికీ అర్థం అవుతుంది. ముందు మీ మిత్రుడు చంద్ర‌బాబును మార‌మ‌ని చెప్పండి. త‌ర్వాత మిగ‌తా వారి గురించి మాట్లాడుదురు గాని. స‌రేనా ప‌వ‌న్ గారు.

బాబు, ప‌వ‌న్‌కు ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న‌ట్టుంది..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share