పవన్ పై కత్తి కడతావా ‘బండ్ల’ అని అడిగితే…

September 15, 2018 at 1:12 pm

టాలీవుడ్ లో పవన్ కళ్యాన్ కి వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నా పవన్ కళ్యాన్ ప్రస్థావన తెస్తే పూనకం వచ్చిన వాడిలా మారిపోయే అభిమాని ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది..అవును ప్రముఖ నటులు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్. మెగా ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టపడే బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అంటే ప్రాలు ఇవ్వడానికైనా రెడీగా ఉంటానంటారు. పవన్ ను తన దేవుడిగా అభివర్ణిస్తుంటాడతను. పవన్ గురించి ఎవరేమన్నా కూడా అతను ఊరుకోడు.

Bandla-Ganesh-Selfie-With-God1

టీవీ చర్చల్లో పవన్ కు మద్దతుగా మాట్లాడటమే కాక.. అతడి వ్యతిరేకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్. అలాంటి బండ్ల గణేష్ చేసిన పనికి ఇప్పడు పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సామాన్యులు కూడా ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాన్ ని తన దేవుడిలా పూజింజే బండ్ల గణేష్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశం అయ్యింది. వాస్తవానికి పవన్ ‘జనసేన’ పార్టీ స్థాపించినపుడు బండ్ల తన వంతుగా పార్టీ కోసం పాటు పడతారని భావించారు..కానీ అలా జరగలేదు.

పోనీ తెలంగాణలో ‘జనసేన’ పార్టీ విషయాల్లో ముఖ్యంగా ఏదైనా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించారు..అలా కూడా జరగలేదు. అందరికీ షాక్ ఇస్తూ..కాంగ్రెస్ లో చేరండంలో ఆంతర్యం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ అంటే చిర్రుబుర్రులాడే పవన్ కళ్యాన్ మరి ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

pk fdknn

ఇదిలా ఉంటే..కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో అవసరమైన పవన్ ను విమర్శిస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించాడు. దానికతను ఛాన్సే లేదని బదులిచ్చాడు. పవన్ ఎప్పటికీ నా దేవుడు..ఏట్టి పరిస్థితుల్లోనూ ఆయనను విమర్శించని అని సమాధానం ఇచ్చారు. మరి భవిష్యత్ లో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో..ఎవరిని ఎవరు విమర్శించుకుంటారో వేచి చూడలి.

పవన్ పై కత్తి కడతావా ‘బండ్ల’ అని అడిగితే…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share