ప‌వ‌న్‌తో బ‌న్నీ గ్యాప్ పోలేదుగా… బ‌న్నీ సైలెంట్ వెన‌క‌..!

January 23, 2018 at 4:04 pm
pawan kalyan, janasena, allu arjun, twitter, politics

ప్ర‌ముఖ సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయ యాత్ర ప్రారంభ‌మైంది. ప‌వ‌న్ ఎప్పుడెప్పుడు జ‌నాల్లోకి వ‌స్తాడా ? అని వెయిట్ చేస్తోన్న ప‌వ‌న్ ఎట్ట‌కేల‌కు పొలిటిక‌ల్ క్షేత్రంలోకి దూకేశాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయ యాత్ర తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి క్షేత్రం నుంచి ప్రారంభ‌మైంది. ఇక ప‌వ‌న్ ఈ యాత్ర ప్రారంభించిన నేప‌థ్యంలో ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన అభిమానుల నుంచే కాకుండా మెగా కాంపౌండ్ నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఇక ఇండ‌స్ట్రీ జ‌నాలు కూడా ప‌వ‌న్‌కు పెద్దఎత్తున అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

ప‌వ‌న్ సోద‌రుడు చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌, ప‌వ‌న్ మ‌రో సోద‌రుడు నాగ‌బాబు త‌న‌యుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌, చిరు మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఇలా ప్ర‌తి ఒక్క‌రు ప‌వ‌న్‌కు ఆల్ ద బెస్ట్ చెపుతూనే ఉన్నారు. ఇక మ‌రి కొంద‌రు ఇండ‌స్ట్రీ జ‌నాలు ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు చెపుతూ సోష‌ల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే మెగా హీరోల్లో ఒక‌డైన స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఇంకా ప‌వ‌న్ యాత్ర‌పై స్పందించ‌లేదు. 

ఓ వైపు ప‌వ‌న్‌కు అభినంద‌న‌ల వ‌ర్షం కురుస్తుంటే అల్లు కాంపౌండ్ మాత్రం త‌మ‌కేం ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఇక బ‌న్నీ సోద‌రుడు మ‌రో మెగా హీరో అల్లు శిరీష్‌ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అల్లు హీరోలు ప‌వ‌న్ రాజ‌కీయ యాత్ర విష‌యంలో ఎందుకు అభినంద‌న‌లు చెప్ప‌లేద‌న్న అంశంపై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. 

ఇక ప‌వ‌న్‌కు అల్లు అర‌వింద్‌తో ఎప్ప‌టి నుంచో గ్యాప్ ఉంది. ప్ర‌జారాజ్యం టైంలో అల్లు అర‌వింద్ వ‌ల్లే త‌న సోద‌రుడి పార్టీకి పెద్ద దెబ్బ త‌గిలింద‌ని ప‌వ‌న్ త‌న స‌న్నిహితుల వ‌ద్ద అర‌వింద్‌పై సీరియ‌స్ అయిన‌ట్టు కూడా గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌టి నుంచే అల్లు ఫ్యామిలీకి ప‌వ‌న్‌కు గ్యాప్ ఉంది. ఇక  సరైనోడు సినిమా ఫంక్షన్ లో పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి పీకే ఫ్యాన్స్‌కు దూరమైన బన్నీకి ప‌వ‌న్‌కు మ‌ధ్య కూడా గ్యాప్ ఎక్కువ‌వుతూనే వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ యాత్ర‌పై బ‌న్నీ స్పందించి ఉండ‌క‌పోవ‌చ్చు.

 

ప‌వ‌న్‌తో బ‌న్నీ గ్యాప్ పోలేదుగా… బ‌న్నీ సైలెంట్ వెన‌క‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share