అస‌లే ఒంట‌రి.. ఆపై ప‌వ‌న్ క‌న్నెర్ర‌.. టీడీపీ ఫ్యూచ‌ర్ ఏంటి?

May 22, 2018 at 8:58 am
Pawan Kalyan, Janasena, Chandra babu, TDP, AP, Politics, 2019 Elections

ఏపీ అధికార పార్టీ టీడీపీ ఫ్యూచ‌ర్‌పై రాష్ట్రంలో భిన్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్న‌క‌ల్లో విజ‌యం సాధించి.. విభ‌జ‌న త‌ర్వాత ఏపీలోనూ రెండోసారి అధికారంలోకి రావ‌డం ద్వారా రికార్డు సృష్టించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌లలు కంటున్నారు. ఎన్నో ఆశ‌లు సైతం పెట్టుకున్నారు. అయితే, దీనికి సంబంధించి.. ఇప్పుడు ఆశ‌లు ఒక్క‌టొక్క‌టిగా.. పేక మేడ‌ల్లా కూలిపోతున్నాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 2014 నాటి రాజ‌కీయ ప‌రిస్థితులు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అప్ప‌టికి ఇప్ప‌టికి టీడీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అప్ప‌ట్లో ఏనుగులా ఉన్న టీడీపీ.. ఇప్పుడు బ‌క్క‌చిక్కి బావురు మంటోంది. కేవ‌లం ఒక్క చంద్ర‌బాబుపైనే ఆధార‌ప‌డి ఈ పార్టీ నెట్టుకొస్తోంది. 

 

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌, బీజేపీ అధిష్టానం ఇలా.. మూకుమ్మడి ఎవ‌రికి వారు టీడీపీపై పోరుకు సిద్ధ‌మ‌య్యారు. అంద‌రి ల‌క్ష్యం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని గ‌ద్దె దించ‌డ‌మే! ఈ విష‌యంలో ఆది నుంచి టీడీపీపై పోరు సాగిస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. ఇప్పుడు జ‌న‌సేనాని తోడ‌య్యారు. జ‌గ‌న్‌ను మించిపోయిన రీతిలో ప‌వ‌న్ రెచ్చిపోతున్నారు. చంద్ర‌బాబును క‌డిగేస్తున్నారు. స‌వాళ్లు రువ్వుతున్నారు. ధ‌ర్మ పోరాట దీక్ష పేరుతో ప్ర‌జాధ‌నం వృధా చేయ‌డ‌మేనా సీనియార్టీ! అని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికలప్పుడు టీడీపీ 600 హామీలు ఇచ్చిందని, ఇవన్నీ పూర్తి చేశారా అని సీఎంను ప‌వ‌న్‌ ప్రశ్నించారు. 

 

‘‘ప్రత్యేక హోదా సాధిస్తారనే నమ్మకంతో ఆరోజు మీతో (చంద్రబాబు) నడిచాను. మోదీ కచ్చితంగా విభజన హమీలు నెరవేర్చుతారని నమ్మాను. 2014లో ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత కొందరు టీడీపీకి హోదా విషయం గుర్తు చేశాను. మొదటి బడ్జెట్‌లో విభజన హామీల గురించి పెడతారని చెప్పారు. ఈ క్రమంలో నమ్మకం పోయింది. ప్రధాని మోడీ మొండిచేయి చూపిస్తారని అనిపించింది. అందుకే తిరుపతిలో సభ పెట్టినప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పాను. ప్రజల కోసం నిలబడ్డాను. రాజకీయాల్లో గెలుస్తానా లేదా అనేది నాకు ముఖ్యం కాదు. కాకపోతే నేను మిగిలిన పార్టీలు,నేతల్లా ప్రజలను మోసం చేయను’’ అని ప‌వ‌న్ వెల్ల‌డించాన్ని బ‌ట్టి.. టీడీపీపై రాబోయే రోజుల్లో మ‌రింత గా విరుచుకుప‌డే ఛాన్స్ క‌నిపిస్తోంది. 

 

ఇక‌, ఈ క్ర‌మంలోనే టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. ప‌రిస్థితి రాబోయే రోజుల్లో మ‌రింత‌గా దిగ‌జారే ఛాన్స్ ఉంటుంద‌ని నేత‌లు భావిస్తున్నారు. అవినీతి, దందాలు, ఎమ్మెల్యేల ఇస్టారాజ్యం, పార్టీ ఫిరాయింపులు, ఫిరాయింపు ఎమ్మెల్యేల బాగోతం, బీజేపీతో క‌టీఫ్‌.. వంటివి టీడీపీని వెంటాడుతున్న భ‌యాలు. వీట‌న్నింటినీ ఛేధించుకు వ‌చ్చినా చంద్ర‌బాబు చెబుతున్న అభివృద్ధి మూల‌న ప‌డింది. డ‌బ్బుకోసం వెంప‌ర్లాడాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని ఓట‌మి దిశ‌గా న‌డిపించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

 

అస‌లే ఒంట‌రి.. ఆపై ప‌వ‌న్ క‌న్నెర్ర‌.. టీడీపీ ఫ్యూచ‌ర్ ఏంటి?
0 votes, 0.00 avg. rating (0% score)

comments



Related Posts


Share
Share