చిరు విష‌యం మ‌రిచిపోయావా ప‌వ‌న్‌..!

June 10, 2018 at 10:50 am
Pawan Kalyan, Janasena, Chiran jeevi, praja rajyam, politics

అధికారం కోసం రాజ‌కీయాల్లోకి రాలేదు అన్న వ్య‌క్తి ఇప్పుడు అధికారం మ‌న‌దే అంటున్నాడు! అధికార‌మే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కాదు అంటూ చెప్పిన ఆయ‌నే.. ఇప్పుడు అధికారంలోకి వ‌స్తేనే ఫ‌లానా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తా అని చెబుతున్నాడు! ఇప్ప‌టికీ తానెక్క‌డి నుంచి పోటీచేస్తాడో స్ప‌ష్టంగా చెప్ప‌లేని జ‌న‌సేనాని.. 175 స్థానాల్లో పోటీ చేసి సొంతంగా అధికారాన్ని ఏర్పాటుచేస్తామంటున్నాడు!! అధికారం, ముఖ్య‌మంత్రి ప‌దాల గురించి నాలుగేళ్ల‌లో ఎన్న‌డూ మాట్లాడ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్పుడు ఈ రెండింటిపైనే దృష్టిపెట్టాడని విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. మ‌రి అధికారం ద‌క్కించుకోవ‌డం అంత సులువ‌నుకుంటున్నాడో ఏమోగానీ.. ఈమ‌ధ్య త‌న ప్ర‌సంగాల్లో త‌ర‌చూ అధికారం మ‌న‌దే అంటూ చేస్తున్న వ్యాఖ్య‌లపై చాలామంది పెద‌వి విరుస్తున్నారు. మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌, నేను సీఎం అయ్యాక అంటూ గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ అంటే విమ‌ర్శించిన ప‌వ‌న్ ఇప్పుడు అవే మాట‌లు మాట్లాడుతున్నాడు.

కొత్త త‌రం రాజ‌కీయాల‌కు ప్ర‌తినిధిగా ఉంటాడ‌ని అంద‌రూ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడిలా మారిపోయార‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. కొత్త ఒర‌వ‌డి సృష్టిస్తాడ‌ని భావించిన వారంతా ఆయ‌న ప్ర‌సంగాలు చూసి నీరుగారిపోతున్నారు. అధికారం కోసం ఎన్న‌డూ మాట్లాడ‌ని ప‌వ‌న్‌.. ఇప్పుడు ప‌దే ప‌దే అధికారం మ‌న‌దే అధికారం మ‌న‌దే అంటూ మాట్లాడుతుండాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. అంతేగాక రెట్టించిన ఉత్సాహంతో, ఆత్మ‌విశ్వాసంతో చెబుతున్నారు. దీని వెనుక ఉన్న మ‌ర్మ‌మేమిటోన‌నే సందేహాలు అంద‌రి లోనూ మొద ల‌య్యాయి. కొన్ని రోజులుగా ప్ర‌జా పోరాట యాత్ర పేరుతో జనంలో తిరుగుతున్న పవన్.. బ‌హిరంగ స‌భ‌ల్లో అధికా రం, సీఎం ప‌ద‌విపై ధీమాగా చెబుతున్నారు. అయితే పవన్ దీనిపై ప‌వ‌న్‌లో క్లారిటీ లేదంటున్నారు విమ‌ర్శ‌కులు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే? సొంతంగా అధికారంలోకి వస్తామనా? లేక ఏదైనా సంకీర్ణాన్ని ఏర్పాటు చేస్తామనా? అనే విష‌యంలో మాత్రం కొంత సందిగ్ధం నెల‌కొంది. బహుశా పవన్ కల్యాణ్ కర్ణాటకలో కుమారస్వామిలా అన్నట్టుగా ఆశలు పెట్టుకున్నాడేమోననే సందేహాలు లేక‌పోలేదు. ఇదంతా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత‌.. అక్క‌డ జేడీఎస్ అధికారం చేప‌ట్టిన నాటి నుంచి ప‌వ‌న్‌లో స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపించింద‌ని గుర్తుచేస్తున్నారు. అప్పుడే ప‌వ‌న్ ఒక సంచ‌ల‌న కామెంట్ చేశారు. ఏపీలోనూ క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ ప‌రిస్థితులే ఏర్ప‌డ‌తాయన్నారు. జేడీఎస్‌లా జ‌న‌సేన చ‌క్రం తిప్ప‌డం ఖాయ‌మ‌నేలా ఆయ‌న మాట్లాడారనే గుసగుస‌లు వినిపించాయి.

సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే అంత ఆషామాషీ వ్య‌వ‌హారం కాదంటున్నారు రాజ‌కీయ వేత్త‌లు. ఎన్నికల ముందు వచ్చేస్తే అధికారంలోకి వస్తానని అనుకుంటే అంతకు మించిన భ్రమ లేద‌ని, ఇంతకుముందు చిరంజీవి కథ మ‌రిచిపోయావా ప‌వ‌న్ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా రాజకీయాలకు కొత్త వాడేమీ కాదు. గ‌తంలో 2009, 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ఎప్పుడు రాజ‌కీయాల్లో ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయో గ్ర‌హించ‌లేనివాడు కాదు క‌దా! ఇక జనసేనాన్ని అధికారాన్ని కోరుకుంటూ ఉండటం పైనా విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. జగన్.. తను సీఎం అవుతానని అంటే, తమ ప్రభుత్వం వస్తుందని అంటే.. అలా అనుకూడదని పీకే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చేస్తానని అంటున్నాడు. మ‌రి ప‌వ‌న్ ప‌గ‌టి క‌ల‌లు క‌న‌డం మాని.. వాస్త‌వంలోకి ఎంత త్వ‌ర‌గా వ‌స్తే అంత మంచిద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చిరు విష‌యం మ‌రిచిపోయావా ప‌వ‌న్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share