కామ్రేడ్ల‌కు ప‌వ‌న్ హ్యాండ్‌.. ఏం జ‌రిగిందంటే

July 16, 2018 at 1:01 pm
Pawan Kalyan, Janasena, CPI, CPM, aligns, politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైనా, ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌పైనా.. చాలా ఆశ‌లు పెట్టుకున్న ఏపీ క‌మ్యూనిస్టు పార్టీల‌ను జ‌న‌సేనాని నిండా ముంచారా? వారి సింద్ధాలే నా సిద్ధాంతాలు అని కొంత సేపు.. వారితో క‌లిసి పోరాటాలు చేయ‌డం బాగుంద‌ని కొంత సేపు ఊరించిన జ‌న‌సేనాని.. ఎన్నిక‌ల స‌మ‌యానికి వారిని దూరంగా పెట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని క‌మ్యూని స్టులు సైతం ఒప్పేసుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా.. త‌మ ఉనికిని కాపాడు కోలేని, ప్ర‌జ‌ల నుంచి ఓట్లు వేయించుకోలేని ప‌రిస్థితి కామ్రేడ్ల‌ది. ఈ నేప‌థ్యంలో ఎవ‌రు కొత్త‌పార్టీ పెట్టినా వెంట‌నే వారితో జ‌ట్టుక‌ట్టి.. ఏదో ఒక‌టో రెండో అయినా సీట్ల‌లో గెల‌వాల‌ని త‌పించి పోతున్నారు.

36682583_617023248696954_101212106921082880_o

ఈ క్ర‌మంలో గ‌తంలోనే వైసీపీతో జ‌ట్టుక‌ట్టాల‌ని భావించినా.. జ‌గ‌న్‌పై ఉన్న అవినీతి మ‌ర‌క‌లు త‌మ‌కు అంటుకుంటాయేమోన‌ని బాధ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే దూరంగా ఉన్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో జ‌న‌సేనాని రావ‌డంతో ఆయ‌న‌తో జ‌ట్టుకు రెడీ అయ్యారు. జ‌న‌సేనాని ఇంటికి వెళ్లి మ‌రీ సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ చ‌ర్చ‌లు జ‌రిపారు. అదేస‌మ‌యంలో జ‌న‌సేనానితో క‌లిసి పోరాటాలు కూడా చేశారు. ఇక‌, వాప‌క్షాలు ప్ర‌త్యేక హోదా కోసం ఇచ్చిన బంద్‌కు జ‌న‌సేనాని కూడా క‌దిలి వ‌చ్చారు. విజ‌య‌వాడ‌లో పాద‌యాత్ర చేశారు. క‌ట్ చేస్తే.. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో క‌మ్యూనిస్టుల‌ను క‌లుపుకొని పోతాడ‌ని అనుకున్న ప‌వ‌న్‌.. తాను ఒంట‌రిగానే బ‌రిలో దిగుతాన‌ని ఇప్ప‌టికి నాలుగు సార్లు ప్ర‌క‌టించాడు.

5760_CPM-State-secretary-P-Madhu

మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తానే ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతాన‌ని అన్నాడు. దీంతో వామ‌ప‌క్షాలు ఒకింత ఇబ్బందిలోనే ప‌డ్డాయి. ఇన్నాళ్లు త‌న‌తో క‌లిసి ప‌య‌నించాల‌ని భావిస్తే ఇలా హ్యాండిస్తున్నాడేంట‌నే వ్యాఖ్య‌లు కామ్రేడ్ల నుంచి వినిపించాయి. ఇదే విష‌యంపై తాజాగా సీపీఎం నేత బీవీ రాఘ‌వులు మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తమ పార్టీ విధివిధానాలను వెల్లడిస్తే.. ఆయన జనసేన పార్టీతో కలిసి పనిచేయడానికి సీపీఎం కు అభ్యంతరం లేదని వెల్లడించారు. అంటే ఇప్పటిదాకా వాళ్లంతా కలిసి భేటీలు నిర్వహించడాలు, కలిసి పోరాడడాలూ జ‌రిగినా.. ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తులపై ఎలాంటి చ‌ర్చ‌లూ జ‌ర‌లేద‌ని తెలుస్తోంది.

36923048_620416335024312_6903858975666601984_n

పవన్ కల్యాణ్ కొన్ని ఉద్యమాల సమయంలో కమ్యూనిస్టుల నేతలను వాడుకున్నప్పటికీ… తర్వాత పూర్తిగా పక్కన పెట్టి తాము 175 స్థానాల్లోనూ బరిలోకి దిగబోతున్నట్లుగా తేల్చి చెప్పేశారు. నాలుగేళ్ల పాటూ కేంద్రంతో కలిసి ఉండడం వల్ల రాష్ట్రానికి జరిగిన ద్రోహంలో వారికి కూడా భాగం ఉందనే అంటున్నారు. మరి అదే తరహాలో నాలుగేళ్ల పాటూ చంద్రబాబు భజన చేసి ఆ తర్వాత ఒక్కసారిగా విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ కు కూడా… ఈ విష‌యంలో భాగం ఉంటుంద‌నే కోణంలో కామ్రేడ్ వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఏదేమైనా.. కామ్రేడ్లు ఎంతో న‌మ్మితే.. ప‌వ‌న్ మాత్రం చ‌క్క‌గా త‌న దారి తాను చూసుకుంటున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇదే జ‌రిగి.. ప‌వ‌న్ ఒంట‌రిగానే ఎన్నిక‌ల‌కు వెళ్తే.. కామ్రేడ్లు సంయుక్తంగా మ‌రో చారిత్ర‌క త‌ప్పిదం చేసిన‌ట్టేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

కామ్రేడ్ల‌కు ప‌వ‌న్ హ్యాండ్‌.. ఏం జ‌రిగిందంటే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share