ప‌వ‌న్ ఓట్ల చీలిక‌.. గండి ఎవ‌రికి.. టీడీపీకా? వైసీపీకా?

May 14, 2018 at 6:30 pm
Pawan kalyan, Janasena, Effect, TDP, YSRCP, Voting

రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌డం క‌ష్టం. ఇక‌, ఎన్నిక‌లు స‌మీపించే స‌రికి ఏ రూపు దాలుస్తాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఏపీలో రాజ‌కీయాలు కూడా ఇలానే మారిపోయాయి. నేత‌లు ఎప్పుడు ఎలా మార‌తారో.. ప్ర‌జ‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. తాజా ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. 2014లో టీడీపీకి బెల్లంగా మారిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు అదే పార్టీకి ఆయ‌న అల్లంగా మారిపోయారు., వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిపోరుకు రెడీ అవుతున్నారు. పైగా 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ బ‌రిలోకి దిగితే.. ఎన్నిక‌ల్లో ఎవ‌రిని ప్రభావితం చేస్తాడు? ఎవ‌రికి ఇబ్బంది క‌రంగా మార‌తాడు? అనే చ‌ర్చ ఊపందుకుంది. 

 

ఈ విష‌యంలో రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల‌ను ప‌వ‌న్ చీలుస్తాడ‌న‌డంలో సందేహం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో కాపు సామాజిక వ‌ర్గం మొత్తం చంద్ర‌బాబు అండ్ టీడీపీ నాయ‌కుల‌కు అండ‌గా నిలిచింది. అయితే, తాజాగా వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో.. మాత్రం ఈ వ‌ర్గంలో మెజార్టీ జ‌నాలు ప‌వ‌న్‌కు అనుకూలంగా అండ‌గా నిలిచే ఛాన్స్ స్ఫ‌ష్టంగా క‌నిపిస్తోంది. అంటే దాదాపు రెండు మూడు జిల్లాల్లో కీల‌క‌మైన కాపు వ‌ర్గం ఓట్లు వచ్చేసారి చంద్రబాబుకు ప‌డే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.  ఈ నేపథ్యంలోనే పవన్ ఎంట్రీ.. ఏపీ పాలిటిక్స్ లో ముఖ్యంగా టీడీపీకి చేటు తెచ్చేదే.. ఇక‌, ఇదే స‌మ‌యంలో..  జగన్ – చంద్రబాబుల‌ మధ్య పోటీలో పవన్ ఓట్లు చీల్చడం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

 2009 ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. కాంగ్రెస్ – టీడీపీ పోటీపడితే మధ్యలో వచ్చిన ప్రజారాజ్యం ఓట్లు చీల్చి టీడీపీని చావు దెబ్బతీసింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా పవన్ వల్ల అదే జరగబోతోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జనసేన నాయ‌కుడు  రాబోయే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీనివల్ల యువతలో ఆయన సామాజికవర్గంలో బలం పెరుగడం ఖాయం. ఇదే 2019 ఎన్నికల్లో ఓట్ల చీలికకు కారణమవుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఈ త్రిముఖ పోరులో చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచిన సామాజికవర్గం పవన్ వెంట వెళుతుంది. ఇదే జ‌రిగితే జ‌గ‌న్‌కు ఇది ప్ల‌స్ అవుతుంది.

 

టీడీపీ వాళ్ల వెర్ష‌న్ చూస్తే 2009లో ముక్కోణ‌పు పోటీలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలి అధికార కాంగ్రెస్ పార్టీ ల‌బ్ధి పొందింద‌ని నాడు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును టీడీపీ, ప్ర‌జారాజ్యం చీల్చుకోవ‌డం వ‌ల్లే తాము న‌ష్ట‌పోయామ‌ని… వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా అదే రిపీట్ అయ్యి తాము మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని చెపుతున్నారు. ఇక కాపుల ఓట్ల‌న్ని జ‌న‌సేన‌కే ప‌డ‌తాయ‌న్న గ్యారెంటీ కూడా లేద‌న్న‌ది మ‌రో వాద‌న‌. నాడు జ‌నాభాలో 25 శాతానికి కాస్త అటూ ఇటూగా కాపులు ఉంటే చిరుకు అన్ని ఓట్లు క‌లిపి 17 శాతం మాత్ర‌మే వ‌చ్చాయి. ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా గ‌త ఎన్నిక‌ల‌తో కంపేరిజ‌న్ చేస్తూ ప‌వ‌న్ ఎఫెక్ట్ టీడీపీకే ఎక్కువుగా ఉండేలా ఉంది.

 

ప‌వ‌న్ ఓట్ల చీలిక‌.. గండి ఎవ‌రికి.. టీడీపీకా? వైసీపీకా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share