వాటీజ్ దిస్ పవన్ సార్..స్పష్టంగా సంకేతాలిస్తున్నారా!

October 7, 2018 at 10:06 pm

‘నాకు కులం అంటగడతారా? మీరు మనుషులేనా? నాకు కులం లేదు. నాకు మతం లేదు. నేను విశ్వమానవుడిని…’ అంటూ హీరో పవన్ కల్యాణ్ బహిరంగ వేదికల మీద ఘాటుగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక సామాజిక వర్గం అయిన కాపు కులానికి ప్రతినిధిగానే.. పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు పై ఆశలు పెంచుకుంటున్నారని విపరీతంగా ప్రచారం ఉంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం బహిరంగ చర్చల్లో, ప్రసంగాల్లో ఈ కాపుముద్రను కాదంటూ ఉంటారు.

43315868_693633091035969_9013084738621014016_o

పైకి పవన్ కల్యాణ్ ఏం చెప్పినా కూడా.. లోలోపల ఆయన కాపు ఓట్ల మీదనే ఆధారపడి రాజకీయం చేస్తున్నారనేది అందరూ ఎరిగిన సంగతే ! అలాగే ఆయన పార్టీ కార్యాలయం, పార్టీ వ్యూహకర్తలు సమస్తం కాపు మేధావులే అనడం కూడా అబద్ధం కాదు. ఇలాటి నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ తన కులపిచ్చి బహిరంగంగా తెలిసిపోయేలా మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన ధవళేశ్వరం వంతెన మీద నిర్వహించదలచిన కవాతును విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ‘జనసేనకు తూర్పుగోదావరి జిల్లా బలమున్న ప్రాంతం అని, అక్కడ పట్టు సాధించలేకపోతే అది స్థానిక నాయకుల తప్పు అవుతుందని’ పవన్ వక్కాణించారు.

పవన్ కు బలం విషయానికి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా అది ఏకరీతిగా ఉంటుంది. పవన్ కు యూత్ లో క్రేజ్ ఎక్కువ. రాష్ట్రమంతా ఏ జిల్లాలోనైనా ఆ క్రేజ్ సమానంగానే ఉంటుంది. ఆయనది బొడ్డూడని కొత్త పార్టీ. కనీసం రెండు మూడు ఎన్నికలను చవిచూసిన పార్టీ అయితే.. ఒక జిల్లాలో ఆదరణ ఎక్కువ మరో చోట తక్కువ అని చెప్పగలరు. అలాంటిదేమీ లేకుండా, తూగో తమకు బలమున్న ప్రాంతమని అంటున్నారంటే.. అచ్చంగా పవన్ కాపు కులం కార్డును ప్లే చేస్తున్నారని తెలిసిపోతోంది. కాపులకు రిజర్వేషన్ వంటి హామీ విషయానికి వస్తే.. తనను కులనేతగా చూడవద్దంటూ.. పవన్ తప్పించుకుంటారు. కానీ.. ఓట్ల దాకా వస్తే.. కాపుకులం బలంగా ఉండేజిల్లా.. తన జనసేనకు బలమైనది అంటుంటారు.

వాటీజ్ దిస్ పవన్ సార్!

వాటీజ్ దిస్ పవన్ సార్..స్పష్టంగా సంకేతాలిస్తున్నారా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share