కులాల చిక్కుల్లో ప‌వ‌న్‌.. బ‌య‌ట ప‌డేదెలా..?

August 18, 2018 at 11:16 am

ఎవ‌రి వ్యక్తిగ‌త జీవితం వారిది! కానీ, ప‌బ్లిక్‌లోకి వ‌స్తే.. తెలుస్తుంది..! అంటారు ఓ సంద‌ర్భంలో ర‌చ‌యిత చ‌లం! పుస్త‌కాల ఔపోస‌న బాగా ప‌ట్టిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇవ‌న్నీ తెలియ‌ని కావు. కులం కుంప‌ట్ల జోలికి తాను పోనంటూనే.. వేలు పెట్టి చేతులు కాల్చుకున్నారు ప‌వ‌న్. కాపుల రిజ‌ర్వేష‌న్ అనే ప్ర‌క్రియ ఇప్ప‌టికీ.. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న‌దే. అయితే, ఇప్ప‌టికీ.. ఈ విష‌యంలో ఇత‌మిత్థంగా ఎవ‌రూ ముందుకు పోయిన దాఖలాలు లేవు. రాష్ట్ర అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం..అ నే ప్ర‌క్రియ స‌ర్వ‌సాధార‌ణం. అది కూడా విప‌క్షం వైసీపీ స‌భ‌లో లేన‌ప్పుడే చంద్ర‌బాబు తీర్మానం చేశారు. ఇక‌, ఇప్పుడు ఈ అంశం ఇప్ప‌టికీ.. కేంద్రంలోనే పెండింగ్‌లో ఉంది.

ఏదేమైనా.. వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ చెప్పి న‌ట్టు.. తీర్మానం చేసినంత మాత్రాన ఫ‌లితం ఏంటో తెలియ‌డం లేదు. ఇక‌, ఇదేవిష‌యంపై త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను చెప్పిన ప‌వ‌న్‌.. తాను కాపు రిజ‌ర్వేష‌న్‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న విజ‌న్ డాక్యుమెంట్‌లో కూడా పొందుప‌రిచాడు. తాను రిజ‌ర్వేష‌న్‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పారు. అయితే, ఇది ఇప్పుడు ఆయ‌న‌కు ఉరితాడుగా మారుతోంద‌నే వ్యాఖ్య‌లు, ప‌రిస్తితులు క‌నిపిస్తున్నాయి. తాజాగా ఇదే విష‌యంపై రాష్ట్ర బీసీ సంఘం ఘాటుగా స్పందించింది. కాపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి నిజంగా కాపు నాయకుడే అయ్యాడని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు ఎద్దేవా చేశారు.

39068295_657416797990932_2220618312461582336_o

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మావుళ్లమ్మ దేవత సాక్షిగా పవన్‌ కాపు నాయకుడని ప్రకటించుకున్నారని చెప్పారు. సాంఘిక పరమైన వెనుకబాటు లేని కాపులకు బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అగ్రకుల పార్టీల నాయకులంతా ఓట్ల రాజకీయాల కోసం రాజ్యాంగ బద్ధత లేని వాగ్దానాలు చేస్తూ కులాల కుంపటి రగుల్చుతున్నారని మండిపడ్డారు. అగ్ర కులాన్ని బీసీల్లో చేర్చాలనే ప్రయత్నాన్ని ఐక్యంగా తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ ప‌రిణామం.. రాబోయే రోజుల్లో మ‌రింత ముదిరే ఛాన్స్ క‌నిపిస్తోంది.

నిజానికి కాపు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలంటే.. త‌న ప‌రిధిలో లేద‌ని జ‌గ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు. అయితే, దీనిని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశాయి ప్ర‌భుత్వ అనుకూల మీడియాలు, నాయ‌కులు. కానీ, ఇప్పుడు ఇదే నిజం కాబోతోంది. బీసీల జాబితాలో ఇప్ప‌టికే 50 శాతం రిజ‌ర్వేష‌న్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఎవ‌రికీ ఎలాంటి స‌మ‌స్యా లేకుండా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం, అందునా.. బీసీవంటి బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాన్ని దూరం చేసుకుంటే.. తాను కోరుకుంటున్న అధికారం ద‌క్క‌డం క‌లేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌వ‌న్ ఈ చిక్కుల్లోంచి ఎలా బ‌య‌ట ప‌డ‌తారో చూడాలి.

కులాల చిక్కుల్లో ప‌వ‌న్‌.. బ‌య‌ట ప‌డేదెలా..?
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share