ఆ చాన‌ళ్ల‌ను జ‌నసేనాని ముంచుతాడా.. తేల్చుతాడా!

July 9, 2018 at 9:11 am
Pawan Kalyan, Janasena, Media, channels, Support, Publicity

ప్ర‌స్తుతం ప‌బ్లిసిటీ లేనిదే ఏదీ న‌డ‌వ‌దు. సినిమాకైనా రాజ‌కీయాల‌కైనా ఇదే ప్ర‌ధాన ఫార్ములా. మ‌రి ఇప్ప‌టికే సొంత మీడియా ఉంటే ఆ ప‌బ్లిసిటీ ఒక‌లా ఉంటుంది.. అద్దె మీడియా అయితే మ‌రోలా ఉంటుంది. మ‌రి ఏదీ లేక‌పోతే ప‌రిస్థితి మాత్రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా మారిపోతుందనే సెటైర్లు అక్క‌డ‌క్క‌డా వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్న‌టివ‌ర‌కూ గంట‌లు, గంట‌లు లైవ్ ఇచ్చిన చాన‌ళ్లు త‌మ రూటు మార్చాయి. అస్స‌లు ప‌వ‌న్ గురించి చూపించ డ‌మే మానేశాయి. దాని వెనుక ఉన్న రాజ‌కీయ కార‌ణాలు ఏమైనా.. ఇది ప‌వ‌న్‌కు మైనస్‌లానే మారింది. ఇదే స‌మ యంలో మ‌రికొన్ని చాన‌ళ్లు మాత్రం ప‌వ‌న్ గురించే ప్ర‌సారం చేస్తున్నాయి. ఆయ‌న గురించే డిబేట్‌లు న‌డిపే స్తున్నా యి. 24 గంట‌ల్లో చాలా వ‌ర‌కూ ప‌వ‌న్ గురించే నిరంత‌రం చెబుతున్నాయి. మ‌రి ఇదంతా ఎందుకంటే.. ఆ మూడు చాన‌ళ్ల‌లో ప‌వ‌న్ పెట్టుబ‌డులు పెడ‌తాడ‌నే ఆశ‌తో యాజ‌మాన్యాలు చెల‌రేగిపోతున్నాయ‌ట‌.

ప‌వ‌న్‌కు ప్ర‌చారం కావాలి.. ఆ చాన‌ళ్ల‌కు పెట్టుబ‌డులు కావాలి! ప్రాథ‌మికంగా గ‌మ‌నిస్తే ఇప్పుడు ఇదే ఫార్ములా క‌నిపిస్తుంది. ప్ర‌తి పార్టీకి సొంత మీడియాగా వ్య‌వ‌హ‌రించే చాన‌ళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ జ‌న‌సేన‌కు మాత్రం ఇప్పుడు ఏ మీడియా స‌పోర్ట్ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. దీనికి ఆయా చాన‌ళ్ల‌లో ప‌వ‌న్‌కు కేటాయిస్తున్న స‌మ‌యమే దీనిని చెబుతోంది. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల్సిన స‌మ‌యం. మ‌రి ఇటువంటి సంద‌ర్భంలో ప‌వ‌న్ రాజ‌కీయ ఆలోచ‌న‌లు, సిద్ధాంతాలు ప్ర‌జ‌ల‌కు చేర‌డం లేద‌ని జ‌న‌సైనికులు అసంతృప్తితో ఉన్నారు. టాప్ చాన‌ళ్ల‌న్నీ ఇప్పుడు ప‌వ‌న్‌ను చూపించ‌క‌పోయినా మూడు చాన‌ళ్లకు మాత్రం ప‌వ‌న్ దేవుడిలా క‌నిపిస్తున్నాడు. పెట్టుబ‌డులు లేక ఆర్థికంగా న‌లిగిపోతున్న త‌మ చాన‌ళ్ల‌ను ప‌వ‌న్ ఆదుకుంటాడ‌నే ఆశ‌తో ఆత్రంగా యాజ‌మాన్యాలు ఎదురుచూస్తున్నాయ‌ట‌.

పవన్ కల్యాణ్ కొద్ది రోజుల కిందట తన సహజసిద్ధమైన ఆవేశంతో మీడియాపై యుద్ధం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే! తర్వాత ఆయనకు మీడియాలో అంతకు ముందు స్థాయిలో కవరేజీ దక్క‌డం లేద‌ని తేలిపోయింది. మీడియాతో గొడవ పెట్టుకున్నప్పుడే పవన్ కల్యాణ్.. సొంతంగా చానల్ ప్రారంభించబోతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. దానికి జే టీవీ అని పేరు పెట్టారనే వార్త కూడా హ‌ల్‌చ‌ల్ చేసింది. తర్వాత 99 టీవీని కొనేస్తున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత జాబితాలోకి టెన్ టీవీ, విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఏపీ 24/7 కూడా చేరిపోయింది. పవన్ ఈ చాన‌ళ్ల‌లో పెట్టుబడులు పెట్టేస్తార‌ని అంతా భావించారు. రోజులు గడుస్తున్నాయి కానీ పవన్ కల్యాణ్ ఇంకా టీవీ చానల్‌పై నిర్ణయం తీసుకోలేదట‌.

పెట్టుబడులు పెడతారన్న ఆశో లేక మరి ఇంకో కార‌ణ‌మో గానీ ఈ మూడు చానళ్లకు ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రధాన వార్తా వనరు అయ్యారు. పవన్ కల్యాణ్ అడుగు బయటపెడితే అదే వార్త అవుతోంది. ప్రసంగిస్తే.. అసాంతం లైవ్ ఇచ్చేస్తున్నారు. పవన్ కల్యాణ్ దుమ్ము రేపుతున్నాడని డిబేట్లు పెడుతున్నారు. ఓ చానల్ ఏకంగా జ‌నసేనకు మెజార్టీ సీట్లు కట్టబెడుతూ సర్వే చేసినంత పని చేసింది. పవన్ కల్యాణ్ ఏదో ఓ చానల్‌లో పెట్టుబడి పెడితే..ఆ చానల్ మాత్రమే బాకా ఊదుతుంది. కానీ పెట్టుబడుల పేరుతో ఊరిస్తూ ఉంటే మూడు చానళ్లు కావాల్సినంత స్పేస్ ఇస్తున్నాయి. మ‌రి త‌న‌కు కావాల్సిన ప్ర‌చారం ఫ్రీగా ల‌భిస్తుంటే..ఎంచ‌క్కా ఎంజాయ్‌చేస్తున్నాడు ప‌వ‌న్‌. మ‌రి వాటిని ముంచుతాడో లేక తేలుస్తాడో వేచిచూడాల్సిందే!

ఆ చాన‌ళ్ల‌ను జ‌నసేనాని ముంచుతాడా.. తేల్చుతాడా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share