నీతులు చెప్పే ప‌వ‌న్‌.. గోతిలో ప‌డుతున్నాడే..!

August 13, 2018 at 10:03 am
Pawan kalyan, janasena, new manifesto, comments, in social media

శ‌కునం చెప్పే బ‌ల్లి కుడితి తొట్లో ప‌డిన చందంగా.. ఇప్పుడు ప‌క్క పార్టీ నాయ‌కులు, అధినేత‌ల‌కు నీతులు చెప్పే జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆ నీతులు తాను పాటించ‌న‌క్క‌ర్లేద‌ని నియ‌మం పెట్టుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికార పీఠాన్ని ద‌క్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న ఈ పాతికేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం ల‌క్ష్యంగా పెట్టుకున్న ప‌వ‌న్‌.. రోజు రోజుకు రాజ‌కీయాలు చేయ‌డంలో రాటు తేలుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. గ‌త నెల‌లో సీఎం చంద్ర‌బాబును ప‌వ‌న్ ఏకేశాడు. అలివికాని 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చాడు. ఆయ‌న‌ను నిల‌దీయాల్సిన అవ‌స‌రం అంద‌రికీ ఉంద‌ని చెప్పాడు. ముఖ్యంగా కాపుల విష‌యం, ప్ర‌త్యేక హోదా విష‌యాల‌ను ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా తెర‌మీదికి తెచ్చాడు. బాగానే ఉంది. అధికార ప‌క్షంలో ఉన్న‌వారిని విమ‌ర్శించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్టురు.

అదేస‌మ‌యంలో విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కూడా ప‌వ‌న్ తూర్పార‌బ‌ట్టాడు. జ‌గ‌న్ ఇస్తున్న ఎన్నిక‌ల హామీల‌కు కేంద్ర బ‌డ్జెట్ కూడా చాల‌ద‌ని ఎద్దేవా చేశాడు(అయితే.. అప్ప‌టికి పోరు యాత్ర చేప‌ట్ట‌లేదు). ఓకే.. దీనిని కూడా స‌మ‌ర్ధిద్దాం. క‌ట్ చేస్తే.. రేపో మాపో. ఆయ‌న ఎన్నిక‌ల మ్యానిఫెస్టో ప్ర‌వేశ పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా కొన్ని అంశాల‌ను ప‌వ‌న్ ప్ర‌స్థావించాడు. తాను అధికారంలోకి వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు ఏమేం చేస్తామో చెప్ప‌క‌నే చెప్పాడు. అయితే, ఈ హామీలు ఏకంగా చంద్ర‌బాబు… జ‌గ‌న్‌ల‌ను మించిపోయి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇంటింటికీ రూ.3500 ల‌కు త‌క్కువ కాకుండా న‌గ‌దు బ‌దిలీ చేస్తామ‌ని చెప్పాడు. అదేవిధంగా ఇంటింటికీ ఉచితంగా గ్యాస్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెప్పాడు. మ‌హిళ‌లకు ఏకంగా 33% కోటా అమ‌లు చేసేలా చూస్తామ‌ని హామీ ఇచ్చాడు.

38933037_656040091461936_5990879023096397824_o

చట్ట సభల్లో మహిళలకు 33ు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని తమ మ్యానిఫెస్టోలో పెడుతున్నామని తెలిపారు. బీసీలకు 5% పైబడి రిజర్వేషన్లు పెంచే అంశాన్ని కూడా పొందు పరుస్తున్నామని, కాపు రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చే అంశం కూడా ఉంటుందని పవన్‌ తెలిపారు. మహిళలకు ఉచితంగా వంట గ్యాస్‌ అందిస్తామన్నారు. కేజీ బేసిన్‌ గ్యాస్‌ను గుజరాత్‌కు తరలిస్తున్నారని, దీనిని అడ్డుకోగలిగితే ఉచిత గ్యాస్‌ సాధ్యమేనని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.1కే కిలో బియ్యం ఇస్తుంటే వాటిని తీసుకోవడానికి ఇష్టపడనివారు రూ.3, 4లకుడీలర్‌కే అమ్మేస్తుంటే వాటిని రీసైకిల్‌ చేసి కాకినాడ పోర్టు ద్వారా కిలో రూ.23 చొప్పన ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. ఇలాంటివి అరికట్టడానికి సబ్సిడీ ద్వారా వస్తువులు అందించే విధానానికి స్వస్తి పలికి నేరుగా కుటుంబంలోని మహిళ పేరున నెలనెలా రూ.2,500 నుంచి 3,500 వరకు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.

మ‌రి ఇవ‌న్నీ.. గొంతెమ్మ హామీలు కావా? ఇప్పుడు ఆ నీతులు ఏమ‌య్యాయి? అంటున్నారు నెటిజ‌న్లు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న మ్యానిఫెస్టోలో పేర్కొన్న మ‌రిన్ని విష‌యాల‌ను చూస్తే.. నిజంగా ఇవి సాకార‌మ‌య్యేవేనా అని అనిపించ‌క మాన‌దు అంటున్నారు నెటిజ‌న్లు. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ.. తామే ప‌తివ్ర‌త‌మ‌ల‌ని అనిపించ‌క మాన‌దు.. అని లియో టాలిస్టాయ్ అన్న మాట‌ను ప‌వ‌న్ రుజువు చేస్తున్నాడ‌న్న మాట‌!

నీతులు చెప్పే ప‌వ‌న్‌.. గోతిలో ప‌డుతున్నాడే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share