పవన్ ‘అనుభవం’ కొంపముంచిందా…!

May 8, 2018 at 10:14 am
pawan kalyan, janasena, political experience, chandra babu

రాజ‌కీయాల్లో ఎదుటి వారికి నీతులు చెప్ప‌డం చాలా తేలిక‌! కానీ, త‌న దాకా వ‌స్తేనే.. ప‌రిస్థితి ఎలా ఉంటుందో అర్ధ‌మ‌య్యే ది. అచ్చం ఇప్పుడు ప‌వన్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది! రాజ‌కీయాల్లో రంగు ప‌డుతుందంటే.. ఏంటో ప‌వ‌న్‌కు ఇప్పుడు అర్ధ‌మ‌వుతోంది. గ‌త 2 నెలల కిందట వ‌ర‌కు టీడీపీతో చెలిమి చేసిన ప‌వ‌న్‌.. గ‌త న‌వంబ‌రులో ఏపీలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేప‌ట్టాడు. ఆ స‌మ‌యంలో పెద్ద ఎత్తున మూడు రోజులు ప‌ర్య‌టించి వివిధ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యాడు. ఈ సంద‌ర్భంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. జ‌గ‌న్‌కు అనుభ‌వం లేద‌ని, ఆయ‌న సీఎం సీటు కోసం పోరాడుతున్నాడ‌ని ఆయ‌న‌ను ఎన్నుకుంటే ఏ అనుభ‌వంతో రాష్ట్రాన్ని పాలిస్తాడ‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న‌కు అనుభ‌వం లేద‌ని, కానీ, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాయించాడ‌ని చెప్పుకొచ్చారు. 

 

ఇక‌, అదేస‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు భారీ ఎత్తున అనుభ‌వం ఉంద‌ని, ఆయ‌న ముందు ఎవ‌రూ ప‌నికిరార‌ని, ఏపీలో అభివృద్ధి సాగుతోంద‌ని, బాబు వంటి దార్శ‌నికుడు ఉండ‌బ‌ట్టే.. ఏపీ ముందుకు ప‌రుగులు పెడుతోంద‌ని ప‌వ‌న్ పేర్కొన్నాడు. ఇక‌, త‌న‌కు ఏ అనుభ‌వం లేద‌ని, అందుకే తాను అధికారానికి దూరంగా ఉన్నాన‌ని, తాను అధికారం కోరుకోవ‌డం లేద‌ని అన్నారు. ఇప్పుడు క‌ట్ చేస్తే.. రాజ‌కీయాలు వ్యూహాత్మ‌కం మారుతున్నాయి. ఆనాడు ఏ అనుభ‌వం త‌న‌కు లేద‌ని, అనుభ‌వం ఉంటేకానీ, రాజ‌కీయ‌లు చేయ‌లేమ‌ని అన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. టీడీపీతో క‌జ్జాలు పెట్టుకున్న క్ర‌మంలో ఆయ‌న ఆ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో క‌లిసేదీ లేద‌ని కూడా కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. 

 

అయితే, ఈ క్రమంలోనే తాను వేస్తున్న అడుగులు విచిత్రంగా ఉంటున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. నాలుగు నెల ల కింద‌ట ఏ అనుభ‌వం త‌న‌కు లేద‌ని చెప్పాడో.. ఇప్పుడు తాను ప్ర‌క‌ట‌నలు చేస్తున్న దానిని బ‌ట్టి.. అనుభ‌వ‌మే అక్కర లేదు అనే రేంజ్‌లో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తాము ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని చెప్పిన ప‌వ‌న్‌.. త‌న‌కు అనుభ‌వం లేద‌నే వ్యాఖ్య‌ల‌ను తోసిపుచ్చారు. త‌న కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌కు అనుభ‌వం ఉంద‌ని, అది చాల‌ని, పార్టీని ముందుకు న‌డిపించే స‌త్తా ఉంటుంద‌ని, వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించాడు. 

 

ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లే రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ బస్సు యాత్ర‌కు రెడీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనుభ‌వాన్ని ప్ర‌శ్నించేందుకు వైసీపీ నేత‌లు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఏ అనుభ‌వంతో ఓట్లు వేయ‌మ‌ని ప్ర‌జ‌ల‌ను అడుగుతావు ? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ సినిమాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నా ఇక‌పై కంటిన్యూగా రాజ‌కీయాల్లో ఉంటాన‌ని చెపుతున్నా ఇప్పుడు సినిమా ఫంక్ష‌న్ల‌కు ఎక్కువుగా అటెండ్ అవుతుండ‌డం విశేషం. అస‌లు ప‌వ‌న్ రాజ‌కీయంగా ప‌నికి రాడు అని ప‌వ‌న్ వీరాభిమానులే చెపుతున్నారు. మొత్తంగా `అనుభ‌వం` గురించి ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు చివ‌ర‌కు ఆయ‌న‌కు చుట్టుకోవ‌డం గ‌మ‌నార్హం.  

 

పవన్ ‘అనుభవం’ కొంపముంచిందా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share