కుర్చీ కోసం తొందరెందుకు పవన్!

August 11, 2018 at 12:09 pm
Pawan Kalyan, Janasena, Politics, mogalthur, speech, CM chair

సీఎం కుర్చీ!! రాష్ట్రంలో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్‌! మ‌రో ప‌ది మాసాల్లోనే ఉన్న ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి.. ఈ సీటును ద‌క్కించుకునేందుకు అటు అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, విప‌క్ష‌నేత వైసీపీ అధినేత జ‌గ‌న్‌లు ఒక‌రిని మించి ఒక‌రు పోటీ ప‌డుతున్నారు. ఇంత‌లోనే త‌గుదునమ్మా.. అంటూ.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగంలోకి దిగారు. ఈయ‌న కూడా ఆది నుంచి త‌న‌కు అధికారంపై వ్యామోహం లేదంటూనే.. రాను రాను .. త‌న మ‌న‌సులో మాట‌ల ను బ‌య‌ట‌పెట్టారు. త‌న‌కు సీఎం కావాల‌ని ఉంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌కు అనుభ‌వం లేద‌ని.. అనుభ‌వ‌జ్ఞుడు అయితేనే సీఎం సీటుకు స‌రిపోతాడ‌ని.. ప‌రోక్షంగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్.. ఇప్పుడు హ‌ఠాత్తుగా త‌న‌కే సీఎం సీటు క‌ట్ట‌బెట్టాలంటూ ప్ర‌సంగాలు దంచికొడుతున్నాడు.

మ‌రి ఇది సాధ్య‌మ‌య్యేదేనా?! ప‌వ‌న్‌కు నిజంగానే అనుభ‌వం స‌రిపోతుందా? ఇప్పుడు ఆయ‌న చెబుతున్న వ్యాఖ్య‌ల్లో నిజం ఉందా? ఆయ‌న వ్యాఖ్య‌లు న‌మ్మ‌ద‌గిన వేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. జ‌గ‌న్ విష‌యంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప‌రిశీలిస్తే.. “జ‌గ‌న్‌.. ఎప్పుడూ సీఎం సీటు కోస‌మే ప్ర‌య‌త్నిస్తున్నాడు. అధికారంలోకి వ‌స్తేనే త‌ప్ప‌.. తాను ఏమీ చేయ‌లేన‌ని చెబుతున్నాడు. సీఎం సీటే ప‌ర‌మావ‌ధి కాదు. “ అని నీతులు చెప్పాడు. స‌రే! జ‌గ‌న్ సీఎం సీటు కోసం వెంప‌ర్లాడుతున్నాడ‌ని అనుకుందాం! మ‌రి మీరు(ప‌వ‌న్‌) సాధించిందేంటి? ప్ర‌త్యేక హోదా అవ‌స‌రమ‌న్నారు. ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చారు. కిడ్నీ రోగుల కోసం దీక్ష చేశారు. హోదాపై అవిశ్వాసం పెట్టండి వంద మంది ఎంపీల‌ను కూడ‌గ‌డ‌తాన‌ని చెప్పారు.

38820833_653889655010313_8410716597559230464_o

ఇక‌, రాజ‌ధాని రైతుల ప‌క్షాన నిల‌బ‌డ‌తాన‌న్నారు(కానీ, ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం రైతుల‌ను భ‌య‌పెట్టి భూములు లాక్కుంటోం ది) తుందుర్రు ఆక్వాకు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాన‌ని చెప్పారు. మ‌రి ఇవ‌న్నీ చేయ‌డానికి అధికారం కూడా అస‌వ‌రం లేద‌ని చెప్పారు. మ‌రి ఏమ‌య్యాయి ఈ వాగ్దానాలు? ఎప్పుడైనా ఎక్క‌డైనా రోడ్డుపై కూర్చుకుని ఓ ధ‌ర్నా చేశారా? ఓ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొని.. పోలీసుల లాఠీ దెబ్బ‌లు తిని జైలుకు వెళ్లారా?(ఇవ‌న్నీ జ‌గ‌న్ చేస్తున్నాడు) హోదా కోసం ఒక్క‌రా త్రి పోరాడ‌లేం-అని తెలివిగా త‌ప్పించుకున్నారు. రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అవినీతి కూపంలో కూరుకు పోయిం దని వ్యాఖ్యానించ‌డమే కాకుండా.. మంత్రి లోకేష్ కూడా అవినీతికి పాల్ప‌డ్దాడ‌ని చెప్పారు. మ‌రి ఈ అవినీతిని ఎదుర్కొనేందుకు మీరు చేసింది ఏంటి?

క‌నీసం జ‌గ‌న్ చేసిన‌ట్టు..(విప‌క్షంలో ఉండ‌గా ఇప్ప‌టికి 12 స‌మ‌స్య‌ల‌పై దీక్ష‌లు చేశాడు) మీరు ఒక్క దీక్ష అయినా 24 గంటల పాటు చేయ‌గ‌లిగారా? రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. అటు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు అయినా.. కేంద్రంపై ఏ దో ఒక రూపంలో పోరాడుతున్నారు. మ‌రి మీకు రేపు అధికారం ఇస్తే.. ఏం చేయ‌గ‌లుగుతారు? అటు పోరాటం చేయ‌లేరు. ఇటు అనుభ‌వ‌మూ లేదు. చ‌ట్ట‌స‌భ స‌భ్యుడిగా ప్ర‌జ‌ల్లో గెలుస్తావో లేదో కూడా నీకు తెలియ‌దు క‌దా.. ? ప‌వ‌న్‌.. ఎందుకు అప్పుడే నీకు సీఎం కుర్చీ!! రాజ‌కీయాల్లో ఆశ ఉండొచ్చు.. అత్యాశ మాత్రం కూడ‌దు!!(దివంగ‌త క‌రుణానిధి .. త‌న పెద్ద కుమారుడు అళ‌గిరిని ఉద్దేశించి బ‌హిరంగంగా చేసిన వ్యాఖ్య ఇది!) మ‌రి ఇది నీకు కూడా వ‌ర్తిస్తుందేమో చూడ‌రాదే!!

38909540_653898828342729_6568969595229569024_n

కుర్చీ కోసం తొందరెందుకు పవన్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share