ప‌వ‌న్ ను చుట్టుముట్టిన డిమాండ్ పాలిటిక్స్!

October 20, 2018 at 6:45 pm
pawan kalyan, Janasena, YSRCP, chanamalasetty suneel, politics

రాజ‌కీయాల‌న్నాక ఎప్పుడు ఏ నేత ఎలా మార‌తాడో చెప్ప‌డం క‌ష్టం. ఎప్పుడు ఎవ‌రు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ నాయ‌కుల‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇక‌, సామాజిక వ‌ర్గాల వారీగా కూడా నాయ‌కులకు ప్ర‌త్యేక‌మైన డిమాండ్ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇది పార్టీల నాయ‌కుల‌కు ఇబ్బందిక‌రంగా మారిపోయింది. నియోజ‌క‌వ‌ర్గాన్ని శాసించ‌గ‌ల నాయ‌కుడు ఉంటే.. ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మ‌ని భావించే నాయ‌కుడు ఉంటే.. ఆయ‌న చెప్పిందే వేదం.. అనే రేంజ్‌లో రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఇక‌, నేనెవ‌రి మాటా విన‌ను, వినిపించుకో ను అనే నాయ‌కుడికి కూడా ఈ పొలిటిక‌ల్ సెగ మాత్రం త‌ప్ప‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఒకింత ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

pawan

తాజాగా ఇలాంటి ప‌రిణామ‌మే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూడా ఎదురైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించా లని కుదిరితే.. సీఎం సీటును కూడా అందుకోవాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న నిన్న మొన్న‌టి వ‌ర‌కు సీరియ‌స్‌గా తీసుకోని రాజ‌కీయాల‌ను కూడా ఇప్పుడు మాత్రం సీరియ‌స్‌గా భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న ప్ర‌జ‌ల్లో మంచి ప‌లుకుబ‌డి గ‌ల నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారికి టికెట్లు కూడా కన్ఫ‌ర్మ్ చేయాల‌ని చూస్తున్నారు. అయితే, ఈ క్ర‌మంలోనే కొంద‌రు ష‌రతులు విధిస్తున్నారు. తాము పార్టీలోకి వ‌స్తాం.. గెలుస్తాం.. అయితే, మాతోపాటు మ‌రొ క‌రు కూడా పార్టీలోకి వ‌స్తారు.. వారికి కూడా టికెట్ ఇవ్వాలి! దీనికి ఓకే అంటే మేం వెంట‌నే జంప్ చేస్తాం.. అంటున్నారు

ఈ క్ర‌మంలోనే వైసీపీ మాజీ నేత‌, తూర్పుగోదావ‌రి జిల్లాలో ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నేత చెల‌మ‌ల శెట్టి సునీల్ ఇప్పుడు ఇదే వ్య‌వ‌హారం న‌డిపిస్తున్నారు. జ‌గ‌న్‌తో విభేదించి బ‌య‌ట‌కు వ‌చ్చిన సునీల్‌.. త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీలోనూ చేర‌లేదు. ఈయ‌న‌ను ఆహ్వానించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావించారు. అయితే, ఇటీవ‌లే జ‌న‌సేన నుంచి కూడా పిలుపు రావ‌డంతో సునీల్ సందిగ్దంలో ప‌డిపోయారు. తనకు కాకినాడ పార్లమెంటు టిక్కెట్టుతోపాటు.. తన బంధువు ఒకరికి జగ్గంపేట జనసేన టిక్కెట్టు ఇవ్వాలని సునీల్‌ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. సునీల్‌ షరతుపై జనసేన నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో చేరికను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్తున్నారు. ఒక‌వేళ మ‌రో టికెట్ ఇవ్వ‌క‌పోతే.. సునీల్ పార్టీలో చేరే ప‌రిస్థితి లేద‌ని అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారంతో.. ప‌వ‌న్‌కు కూడా డిమాండ్ల రాజ‌కీయం పెరిగింద‌ని అంటున్నారు.

ప‌వ‌న్ ను చుట్టుముట్టిన డిమాండ్ పాలిటిక్స్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share