పవన్… ‘‘జీ హుజూర్ కేసీఆర్’’!!

September 11, 2018 at 11:12 am

సమకాలీన రాజకీయాల్లో కనీసం యువతరంలో కొంత మేరకు చాలా ఆశలు పెట్టుకున్న నాయకుడు పవన్ కల్యాణ్ అని చెప్పొచ్చు. కానీ పవన్ కల్యాణ్ యువతరం ఆశలు పెట్టుకున్న దానికి తగినంతగా పనిచేస్తున్నారా? అంతే నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారా? అనేది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ఆంద్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు మొన్నమొన్నటిదాకా పవన్- చంద్రబాబును విపరీతంగా స్తుతిస్తూ వచ్చారు. ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి.. తూర్పారపట్టడం ప్రారంభించారు. అక్కడ పోరాటయాత్రలు చేస్తున్నారు.KCR_Pawan_Kalyan_FB_3x2

అయితే తెలంగాణ సంగతేమిటి? ఇక్కడ కూడా.. కేసీఆర్ పాలన పట్ల పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో కీర్తించారే తప్ప, భిన్నాభిప్రాయం ఎన్నడూ వ్యక్తం చేయలేదు. అయితే.. ఇప్పుడు ఎన్నికల బరిలోకి సీపీఎంతో పొత్తు పెట్టుకుని దిగే ఉద్దేశంతో పవన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. సీపీఎం, తెరాసకు వ్యతిరేకంగానే పోరాటం సాగించబోతున్నది. కానీ, వారితో పొత్తు పెట్టుకున్నం మాత్రాన పవన్ కల్యాణ్ చంద్రబాబు మీద ధ్వజమెత్తుతున్న స్థాయిలోనే కేసీఆర్ మీద కూడా విరుచుకుపడతారా? అసలు ఆయనలో అంత ధైర్యం ఉందా? అనే అనుమానాలు పలువురిలో వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సీపీఎంతో జట్టు కట్టినా కూడా.. సీఎం కేసీఆర్ స్కెచ్ మేరకే నడుచుకుంటారనే కొందరు అంటున్నారు.tammineni

సీఎం పట్ల పవన్ వేర్వేరు సందర్భాల్లో తన భక్తి చాటుకున్నారు. ఈ పాలన మహాద్భుతం అంటూ.. మిగతా సీఎం లంతా ఆయనను చూసి నేర్చుకోవాలని అన్నారు. అలాంటి పవన్ సీపీఎంతో పొత్తు ఉన్నంత మాత్రాన.. ఏకపక్షంగా కేసీఆర్ లోపాలను ఎండగట్టలేకపోవచ్చు.

కానీ జనసేన, సీపీఎం జట్టు వల్ల అధికార తెరాసకు ఓ లాభం ఉంటుంది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాకూటమిని కాదని, సీపీఎం-జనసేన కూటమి ఎన్నికల బరిలో ఉంటే త్రిముఖ పోటీ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండుగా చీలిపోతుంది. అది ఖచ్చితంగా అధికార పార్టీకి మేలు చేయడమే అవుతుంది. పవన్ సీపీఎం చెంతకు చేరినా కూడా.. అలాంటి గులాబీవ్యూహంలో భాగంగానే ఆ పనిచేస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు. తాను కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ కాదని నిరూపించుకోవాలంటే.. జనసేన ఎన్నిసీట్లలో స్వయంగా బరిలోకి దిగుతుంది? ఎంత చురుగ్గా జనసేనాని ప్రచార సభలు నిర్వహిస్తారు? అనే దానిని బట్టి తేలుతుంది.In-Talk--KCR-s-Surprise-Phone-Call--1490882858-1986

పవన్… ‘‘జీ హుజూర్ కేసీఆర్’’!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share