ఇంత జ‌రిగాక కూడా ట్వీట్ల‌కే ప‌రిమిత‌మా ప‌వ‌న్‌? నీలో పొలిటీషియ‌న్ లేడా?

April 21, 2018 at 6:01 pm
pawan kalyan, sri reddy issue, RGV, twitter, TV raviprakash, andhra jyothi

అవును! ఇదేదో ఎవ‌రో ఒక‌రు అక్క‌సుతోనే, త‌ప్పు ప‌ట్టాల‌నో అన‌డంలేదు. నిజమైన ఆవేద‌న‌తో, ఆక్రోశంతో అంటున్న మాట‌! ప్ర‌శ్నించేందుకు నేనున్నాను. మీరంతా ధైర్యంగా ఉండండి అంటూ 2014లో యావ‌త్ తెలుగు ప్ర‌జ‌ల‌కు ధైర్యం నూరిపోస్తూ.. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌న‌సేన పార్టీని స్థాపించి, స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు తాను సైతం అంటూ కెవ్వు కేక పెట్టించిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారంపై తీవ్ర ఆవేద‌న చెందుతున్న నెటిజ‌న్లు, ముఖ్యంగా ఆయ‌న‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నఅభిమానులు ఇప్పుడు సంధిస్తున్న ప్ర‌శ్న ఇది!! సాధార‌ణ ప్ర‌జానీకం స‌మస్య‌ల‌పై పోరాటానికి తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించి పార్టీ పెట్టిన జ‌నసేనాని.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జాపంథాలో ఏ ఒక్క ఉద్య‌మాన్నీ ముందుకు న‌డిపించ‌లేక పోయాడు. ఎంత‌సేపూ సామ‌ర‌స్య‌, శాంతి అంటూ శాంతి వ‌చ‌నాలు వ‌ల్లెవేస్తున్నాడు. 

 

ఓకే.. ఏపీకి సంబంధించిన ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కానీ, లేదా హోదా పైన గానీ.. తాను ఇలా వ్యాఖ్యానించాడంటే.. అర్ధం ఉంది. అయితే, ఇప్పుడు స‌మ‌స్య త‌న‌దాకా వ‌చ్చింది. శ్రీరెడ్డి రూపంలో త‌న ఇంటి త‌లుపునే త‌ట్టింది ప్ర‌ధాన స‌మ‌స్య‌. క్యాస్టింగ్ కౌచ్‌తో మొద‌లైన ఈ వివాదం చినుకు చినుకు గాలి వాన‌గా మారిన‌ట్టు.. ఇప్పుడు ప‌వ‌న్ మెడ‌కు చుట్టుకుంది. ఈ వివాదంలోకి మీడియా స‌హా రాజ‌కీయ నాయకులు కూడా ఉన్నారంటూ ప‌వ‌నే ఆరోపించ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. మీడియా ముఖంగా శ్రీరెడ్డి ప‌వ‌న్ త‌ల్లిని దూషించిన విష‌యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప‌వ‌న్ అభిమానులు ఉన్న ప్ర‌తి ప్రాంతంలో నూ తీవ్ర వివాదం రేపింది. ఇక‌, దీనిపై తొలి రెండు రోజులు మౌనంగా ఉన్న ప‌వ‌న్ గురువారం రాత్రి నుంచి ట్వీట్ల ప‌రంప‌ర‌ను కొన‌సాగించాడు. శ్రీరెడ్డి వెనుక ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌, ఈయ‌న మిత్రుడు కిలారు వంటి వారు ఉన్నారని, బాబు అనుకూల మీడియా కూడా త‌న‌ను భ్ర‌ష్టు ప‌ట్టించింద‌ని ప‌వ‌న్ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు గుప్పించారు.

 

 దాదాపు శుక్రవారం(చంద్ర‌బాబు ఒక‌ప‌క్క ధ‌ర్మ పోరాట దీక్ష చేస్తున్న స‌మ యంలో) రోజు రోజంతా ప‌వ‌న్ కేంద్రంగా వార్త‌లు వెల్లువెత్తాయి. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై నేరుగా అల్లు అర‌వింద్‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూడా మీడియా ముందుకు వ‌చ్చి తీవ్ర కామెంట్లు కుమ్మ‌రించారు. ఇక‌, ఈ వివాదం స‌మ‌సి పోయింద‌ని అనుకున్న స‌మ‌యంలో ప‌వ‌న్ ఏకంగా చంద్ర‌బాబును టార్గెట్ చేశారు. తాను 2014 ఎన్నిక‌ల్లో బాబుతో చేయి క‌లిపి ఊరూరా తిరిగి ఆయ‌న గెలుపు కోసం సాయం చేశాన‌ని, అలాంటి న‌న్ను ఆయ‌న కొంద‌రిని అడ్డు పెట్టి బజారుకు ఈడ్చారంటూ తీవ్ర‌స్థాయి విమ‌ర్శించారు. ఈ విమ‌ర్శ‌ల‌న్నీ ట్వీట్ల రూపంలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంపై ప‌వ‌న్ వ్య‌వ‌హారంలో ఆయ‌న అభిమానులే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

 

త‌న వివాదంలో రాజ‌కీయ నేత‌లు ఉన్న‌ప్పుడు ఇంకా ట్వీట్ల‌కే ప‌రిమితం కావ‌డం, నాలుగు గోడ‌ల మ‌ధ్య కూర్చుని కేవ‌లం ఓ కంప్యూట‌ర్ తెర‌ముందు ట్వీట్లు రాసుకుంటూ కూర్చోవ‌డంలో అర్ధం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ధైర్యంగా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి.. త‌న‌ను ఎవ‌రైతే బాధ పెడుతున్నారో వారిని రాజ‌కీయంగానే దునుమాడ వ‌ల‌సిన స‌మ‌యంలో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంటే.. ప‌వ‌న్‌కు రాజ‌కీయం చేయ‌డం రావ‌డం లేదా?  లేక రాజ‌కీయాలంటే భ‌య‌ప‌డుతున్నాడా? అనే ప్ర‌శ్న‌లు సైతం ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మ‌రి వీటికి జానీ ఎలాంటి స‌మాధానం చెబుతాడో చూడాలి.

31073355_569067976825815_3785781744560397273_n 31131655_569028586829754_7230641540751127333_n

 

ఇంత జ‌రిగాక కూడా ట్వీట్ల‌కే ప‌రిమిత‌మా ప‌వ‌న్‌? నీలో పొలిటీషియ‌న్ లేడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share