సొంత ఛానెల్‌ని రక్షించుకోలేకపోతున్న ప‌వ‌న్‌!!

October 19, 2018 at 8:24 pm

ఏ పార్టీకైనా ప్ర‌చారం ముఖ్యం. ముఖ్యంగా ఎన్నిక‌ల సీజ‌న్ స్టార్ట‌య్యాక ఈ ప్ర‌చారానికి మ‌రింత ప్రాధాన్యం పెరుగుతుం ద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌ధాన‌మైన మూడు పార్టీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీలో ప్ర‌చారం ఊపందుకుంది. అయితే, ఎంత క్షేత్ర‌స్థాయిలో బలం ఉన్న పార్టీల‌కైనా టీవీల ప్ర‌చారం చాలా ముఖ్యం. ఈ విష‌యంలో అదికార టీడీపీకి రెండు నుంచి మూడు చానెళ్లు బాగానే క‌వ‌ర్ చేస్తున్నాయి. ఇక‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ న్‌కు సొంత‌గానే ఛానెల్‌, పేప‌ర్ కూడా ఉన్నాయి. అయితే, ఇక‌, మూడో పార్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన కు కూడా ఛానెల్ ప్రాధాన్యం అవ‌స‌ర‌మైంది. అయితే, ఆదిలో ఆయ‌న‌కు బాగానే క‌వ‌రేజ్ ఇచ్చిన ఛానెళ్లు.. ఆ త‌ర్వాత త‌ర్వాత ఆయ‌న‌కు ప్రాధాన్యం త‌గ్గిస్తూ వ‌చ్చాయి.

Pawan-Kalyans-Self-Goal-with-Tweet-on-Titli-and-Kavathu...

ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ఉన్న‌న్నాళ్లు.. ప‌వ‌న్‌కు కూడా టీడీపీ అనుకూల మీడియా భారీ ఎత్తున ప‌ల్ల‌కీ మోసింది. ఎప్పుడైతే.. ప‌వ‌న్ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడో.. అప్ప‌టి నుంచి యాంటీ వార్త‌ల ప్ర‌చారం ప్రారంభ‌మైంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి ఎపిసోడ్ ప్రారంభ‌మైన త‌ర్వాత ప‌వ‌న్‌కు బాబు అను కూల మీడియా పెద్ద ఎత్తున మైన‌స్ చేసే ప‌నులు ప్రారంభించింది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌.. త‌న‌కు అనుకూలంగా ఉండ‌డం కోసం ఓమీడియా సంస్థ మ‌ద్ద‌తు అవ‌స‌ర‌మ‌ని భావించారు. పార్టీకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ కావాలాన్నా.. సొంత మీడియా అవ‌స‌ర‌మ‌ని గుర్తించారు. ఈ నేప‌థ్యంలో త‌న‌తో క‌లిసి క‌మ్యూనిస్టుల‌కు ఉన్న టీవీ 99% ను సొంత చేసుకోవాల‌ని భావించారు.

ఈ నేప‌థ్యంలోనే జనసేన కీలక నేత తోట చంద్రశేఖర్ దీనిని కొనుగోలు చేశారు. ఆ మరుక్షణం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాన్ని ఓన్ చేసుకున్నారు. 99 టీవీకి టీఆర్పీలు ఎలా పెంచాలో.. సోషల్ మీడియాలో సూచనలు చేశారు. జనసైని కులందరూ.. అన్ని టీవీలను బ్యాన్ చేసి… కేవలం 99 టీవీని మాత్రమే చూడాలని ప్రచారం చేశారు. ఇప్పటికీ… అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు. కానీ..బార్క్ ప్రకటించే ఎలక్ట్రానిక్ చానళ్ల రేటింగ్‌లో ఎప్పుడూ… కింద నుంచి మొదటి ప్లేస్‌లో అంటే… చివరి ప్లేస్‌లోనే ఉంటోంది. ఒక్కటంటే.. ఒక్క సారి కూడా.. తన స్థానాన్ని మెరుగు పరుచుకో లేకపోయింది. 99 టీవీ తోట చంద్రశేఖర్ చేతికి వచ్చిన తర్వాత… పవన్ కల్యాణ్ దానికో బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు.

అయినా కూడా ఇప్ప‌టికీ ఈ 99% టీవీ పుంజుకోలేద‌ని తాజాగా ప‌వ‌న్ నిర్వ‌హించిన క‌వాతు ఎపిసోడ్ స్ప‌ష్టం చేసింది. రాజమండ్రి కవాతును టీడీపీ అనుకూల‌ చానెళ్లు బాగానే ప‌బ్లిసిటీ చేసి, రేటింగ్ సంపాయించుకున్నాయి. కానీ అదే ప‌వ‌న్ నేతృత్వంలోని టీవీ 99% మాత్రం పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. పైగా ప‌వ‌న్‌ను ఎప్పుడూ చూపించే ఛాన‌ల్ కావ‌డంతో బోర్ కొడుతోంద‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి ప‌వ‌న్ ఎలా దీనిని ప్ర‌మోట్ చేస్తారో చూడాలి.

సొంత ఛానెల్‌ని రక్షించుకోలేకపోతున్న ప‌వ‌న్‌!!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share