పవన్, ఒవైసీ… కుమారస్వామే స్ఫూర్తి!

September 8, 2018 at 7:44 pm
Pawan kalyana, Janasena, Asaduddin Owaisi, MIM, Karnataka, Kumaraswami

కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. ఇవాళ వివిధ రాష్ట్రాల్లోని చిన్నా చితకా పార్టీలన్నిటికీ ఓ స్ఫూర్తి దాత! కాస్త వెటకారంగా అనిపించినా ఈ మాట వాస్తవం. శాసనసభ ఎన్నికల్లో ప్రధానంగా తలపడిన అన్ని పార్టీల్లోకీ అతి తక్కువ సీట్లు సాధించినా కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ ఓటు శాతం వచ్చినా కూడా.. ఆయన కన్నడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వైనం.. ఇప్పుడు చాలా మంది నాయకులకు ఈ కుమారస్వామి స్ఫూర్తి ఇస్తున్నారు. అందుకే… తెలంగాణలో ఉన్న మొత్తం 119 స్థానాల్లో 7కు మించి ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునే అలవాటు ఎప్పుడూ లేకపోయినప్పటికీ.. ఆ సీట్ల బలంతోనే ‘మనం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు…?’ అని అక్బరుద్దీన్ ఒవైసీ ఆశపడుతున్నారు.

owaisi_story_647_032916114214_0

అక్బరుద్దీన్ ఒవైసీ లాగా ఇంత స్పష్టంగా బయటకు తన ఆలోచనను చెప్పకపోయినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఆశ కూడా అదే అన్నది స్పష్టం. జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర తో ప్రారంభించి.. ఇప్పటికి నాలుగు జిల్లాల్లో ముమ్మరంగా పర్యటించారు. మరో రకంగా చెప్పాలంటే.. ఆయన యాత్ర పేరిట ఏపీలో పర్యటించిన రోజుల కంటె.. రకరకాల సాకులు చెబుతూ.. హైదరాబాదులో విశ్రాంతి తీసుకున్న రోజులే ఎక్కువ.

jana-sena-party-chief-pawan-kalyan_b_1010171240

అలాంటి పవన్ కల్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి ఏపీలో కనీసం 15 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నాయకులు మాత్రం.. తమకు 35 నుంచి 45 సీట్ల వరకూ వస్తాయని బయటకు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా వారి అంతర్గత భేటీల్లో 15 స్థానాలపై ఆశపడుతున్నారు. ఆ మాత్రం సీట్లు వచ్చినా.. తెదేపా- వైకాపాల్లో ఏ ఒక్కరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. తిమ్మిన బమ్మిని చేసి తాను ముఖ్యమంత్రి పీఠం ఎక్కవచ్చుననేది పవన్ అత్యాశ!

పవన్ అలా అత్యాశకు పోయినా పర్లేదు. అక్కడ తెలుగుదేశం-వైకాపాల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా ఉన్నది గనుక.. పవన్ మద్యలో దూరి లాభపడవచ్చు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉన్నదా? అనేది పలువురి సందేహం. తెరాస తాము ఏకంగా 100 స్థానాలు గెలుస్తాం అని సవాలు చేస్తున్న వేళ.. ఇక్కడ పార్టీలు మ్యాజిక్ ఫిగర్ దాటలేక.. చిన్న పార్టీలు ముఖ్యమంత్రిని నిర్ణయించే పరిస్థితి రాదని పలువురి అంచనా. ఆ రకంగా చూసినప్పుడు.. కుమారస్వామిని స్ఫూర్తిగా తీసుకోవడం ఓకేనే గానీ.. అక్బరుద్దీన్ సీఎం అయ్యే ఛాన్సు మాత్రం లేదని చెప్పొచ్చు.

పవన్, ఒవైసీ… కుమారస్వామే స్ఫూర్తి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share