క్విట్ కోడెల‌.? టీడీపీలో తీవ్ర అనిశ్చితి..

March 14, 2019 at 6:18 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి శాస‌న‌స‌భా ప‌తి కోడెల శివ‌ప్ర‌సాద‌రావుకు స్వ‌ప‌క్షం నుంచే వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. కోడెల‌కు టిక్కెట్టు ఇవ్వొద్ద‌ని ఏకంగా కొ్వ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌నే చేశారంటే చెప్పుకోవ‌చ్చు ఆయ‌న ప‌రిస్థితి ఎలా ఉందోన‌ని. శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల‌ను అత్యంత దౌర్భాగ్య‌పు స్థాయికి తీసుకెళ్లాడ‌ని దేశవ్యాప్తంగా అప్ర‌తిష్ట మూట గ‌ట్టుకున్న కోడెల‌కు అధినేత నుంచి స్ప‌ష్ట‌మైన హామీ కూడా లేక‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం. అటు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌నకు బ‌దులు కుక్క‌ను నిల‌బెట్టినా గెలిపిస్తామ‌ని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చాయంటే ఆయ‌న ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉందో తెలుసుకోవ‌చ్చు. స‌త్తెన‌ప‌ల్లిలో ఆయ‌న‌కు కార్య‌క‌ర్త‌లు చుక్క‌లు చూపుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో గెలిపించ‌మంటూ భీష్మించుకున్నారు.

కోడెల వ్య‌వ‌హారం ఓ వైపు గంద‌ర‌గోళంగా నెల‌కొంటుండ‌గానే, మ‌రోవైపు పార్టీలో మిగతాచోట్ల సీట్ల కేటాయింపు చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా త‌యారైంది. కొన్ని ప్రాంతాల్లో పార్టీ వ్య‌తిరేక ప‌వ‌నాలు బ‌లంగా వీస్తుండ‌డంతో అక్క‌డ నిల‌బ‌డ‌డానికి నాయ‌కులే లేక‌పోగ మ‌రికొన్ని చోట్ల మాత్రం ఒక్క‌రికంటే ఎక్కువ మంది పోటీకి సై అంటూ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎన్నిక‌ల వేళ తెలుగుదేశం ప‌రిస్థితి క‌క్క‌లేక మింగ‌లేక అన్న‌ట్లుగా త‌యారైంది.

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా బాబు ఎప్పుడూ ఊద‌ర‌గొట్టుకునే టీడీపీలో ఇప్పుడు ఆయ‌న మాట‌లే ఎవ‌రూ లెక్క చేయ‌డం లేదు. త‌న‌దైన శైలిలో విరుచుప‌డే బాబుగారు ఏం చేయాలో పాలుపోక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. కోడెల వ్య‌వ‌హారం చిలికిచిలికి గాలివాన‌గా మారే పరిస్థితిగా క‌న‌బ‌డుతోంది. మ‌రోవైపు అనంత‌పురంలో కూడా ప‌రిటాల సునీత సైతం పోటీ నుంచి త‌ప్పుకుని కొడుకును నిలబెడ‌తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇంకో వైపు మంత్రి గంటా అజ్ఞాతంలోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఉప‌ముఖ్య‌మంత్రి చిన్న‌రాజ‌ప్ప కూడా తీవ్ర మ‌న‌స్థాపంతో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల వేళ టీడీపీలో తీవ్ర అనిశ్చితి నెల‌కొంది.

క్విట్ కోడెల‌.? టీడీపీలో తీవ్ర అనిశ్చితి..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share