కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్‌తో ప్రకాష్ రాజ్ కు భంగపాటు

May 15, 2018 at 4:24 pm
prakash raj, karnataka elections, campaign, against BJP, result

క‌న్న‌డ‌నాట విల‌క్ష‌ణ సినీన‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ డైలాగులు పేల‌లేదు. తెర‌మీద త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల హ‌`ద‌యాల్ని దోచుకున్న‌ ప్ర‌కాశ్‌రాజ్‌కు కర్ణాట‌క ఎన్నిక‌ల్లో క‌న్న‌డిగులు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చారు. ప్ర‌ధాని మోడీ పేరు విన్నా… బీజేపీ మాట విన‌బ‌డినా అంతెత్తున లేచే ఆయ‌న మంత్రం క‌న్న‌డ‌నాట పార‌లేదు. బీజేపీ వ్య‌తిరేక మంత్రం క‌ర్ణాక‌ట‌లో పార‌లేదు. ఏ రాజ‌కీయ పార్టీతో స‌బంధం లేకుండా స్వ‌త‌హాగా క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో అక్క‌డ‌క్క‌డ స‌భ‌లు, స‌మావేశాల్లో పాల్గొన్న ప్ర‌కాశ్‌రాజ్ బీజేపీని ఓడించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఆయ‌న మాట‌ల్ని క‌న్న‌డ‌ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు.

 

దేశంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడుల్ని, ప‌లువురు అభ్య‌ద‌య ర‌చ‌యిత‌ల హ‌త్య‌లు, గోమాంసం విక్ర‌య‌దారుల‌పై దాడుల నేప‌థ్యంలో ప్ర‌కాశ్‌రాజ్ బీజేపీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌  జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించారు. అంతేగాకుండా కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నం చేస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో క‌లిసి ఆయ‌న బెంగ‌ళూరు వెళ్లిన విష‌యం తెలిసిందే. అక్క‌డ స్థిర‌ప‌డిన తెలుగు ప్ర‌జ‌లు జేడీఎస్‌కే జైకొట్టాల‌ని కేసీఆర్ పిలుపునివ్వ‌డం విదిత‌మే. అయితే ప్ర‌కాశ్‌రాజ్‌తో త‌మ కు ఎంతోకొంత న‌ష్టం జ‌రుగుతుంద‌ని బీజేపీ నేత‌లు భావించారు. కానీ, అందుకు భిన్నంగా బీజేపీ పెద్ద పార్టీగా అవ‌రించ‌డంతో ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌భావం ప‌డ‌లేద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

 

సీఎం కేసీఆర్‌తో క‌లిసి బెంగ‌ళూరు వెళ్లిన ప్ర‌కాశ్‌రాజు.. కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్ర‌త్య‌క్షంగా చెప్పకున్నా.. బీజేపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు అంటూ చెప్పారు. జేడీఎస్‌కు ఓటు వేయాల‌ని కేసీఆర్ కోర‌గా.. కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న మాటను ప్ర‌కాశ్‌రాజు పరోక్షంగా చెప్ప‌డం ప్ర‌జ‌ల్లో కొంత గంద‌ర‌గోళం ఏర్ప‌డింద‌నే చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే ఆయన మాటల్ని ఓటర్లు పెద్దగా ప‌ట్టించుకోలేద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి అధిక సీట్లు రావ‌డంతో సొంత రాష్ట్రంలో సొంత ప్రజల్ని ప్రకాశ్ రాజ్ ప్రభావితం చేయలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. జస్ట్ ఆస్కింగ్ మంత్రం ఏమాత్ర‌మూ ప‌నిచేయలేద‌ని, సోష‌ల్ మీడియాకే ప‌రిమితం అయ్యార‌నే వాద‌న మొద‌లైంది. 

 

కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్‌తో ప్రకాష్ రాజ్ కు భంగపాటు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share