బాబుకు పుట్టా ఎదురు తిరిగిన‌ట్టే..!

April 21, 2018 at 4:28 pm
putta sudhakar yadav, TTD chairmen, chandra babu, challenge, MLA

పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌. అనేక వివాదాలు, విభేదాలు, ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు వంటి అనేక అంచెల‌ను దాటుకుని అతి పెద్ద ఆద్యాత్మిక ఆల‌యం తిరుమ‌ల ప‌రిపాల‌నా బోర్డుకు చైర్మ‌న్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికైన నేత‌. కాదు..కాదు.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏరికోరి.,. ఆయ‌న‌ను ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా తిరుమ‌ల బోర్డుకు చైర్మ‌న్‌గా ఎంపిక చేశారు. ఈ క్ర‌మంలోనే న‌ర‌స‌రావు పేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు నుంచి ఎదురైన ఒత్తిడిని సైతం త‌ట్టుకుని బాబు పుట్టానే ఎంపిక చేశారు. వాస్త‌వానికి ఈ పోస్టు కోసం అతిర‌థ‌మ‌హార‌థుల నుంచి గ‌ట్టి పోటీ  ఎదురైంది. 

 

కేవ‌లం రెండేళ్ల కాలం ఉండే టీటీడీ చైర్మ‌న్ గిరీ కోసం.. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు, న‌టుడు,ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌, న‌ర‌స‌రావు పేట ఎంపీ రాయ‌పాటి నుంచి గ‌ట్టిపోటీ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో రాయ‌పాటి.. త‌న ప‌ద‌వికి సైతం రాజీనామా చేసేందుకురెడీ అంటూ సంచ‌ల‌నం రేపారు. అయినా కూడా చంద్ర‌బాబు రాయ‌పాటిని క‌రుణించ‌లేదు. ఏరికోరి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కే తిరుమ‌ల ప‌గ్గాలు అప్ప‌గిం చారు. ఆయ‌న ఇంకా ఈ ప‌ద‌వికి సంబంధించి అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌లేదు. అయితే, బాబు ఇంత‌గా పుట్టాను ఎంపిక చేయ‌డం వెనుక రాజ‌కీయ కార‌ణాలు అనేకం ఉన్నాయి. 

 

క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పుట్టా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఇక్క‌డ విప‌క్షం వైసీపీని బ‌లంగా దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించుకు న్న చంద్ర‌బాబు.. కాంగ్రెస్‌లో బ‌లంగా ఉండి.. ఇప్పుడు జంప్ చేయాల‌ని చూస్తున్న మాజీ నేత డీఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలో కి  చేర్చుకుని మైదుకూరు నుంచి పోటీ చేయించాల‌ని భావించారు. డీఎల్ కూడా దీనినే ప‌ట్టుబ‌ట్టారు. దీంతో ఈ స్థానంలో పోటీగా ఉన్న పుట్టాకు ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్టి.. ఆయ‌న‌ను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయా ల‌నుంచి త‌ప్పించాల‌ని బాబు వ్యూహం వేశారు. 

 

ఈ క్ర‌మంలోనే ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా.. పుట్టాకు ప‌ట్టుబ‌ట్టి తిరుమ‌ల ప‌ట్టం క‌ట్టారు. ఇది నాణేనికి ఒక‌వైపు.కానీ, ఇప్పుడు ఇదే పుట్టా.. బాబుకు ఎదురు తిరిగారు! ఆశ్చ‌ర్యం అనిపించినా నిజం!! శుక్రవారం కడప జిల్లా మైదుకూరులో ధర్మపోరాట దీక్షలో ఉండగా టీటీడీ ఛైర్మెన్‌గా సుధాకర్‌యాదవ్‌ను ఎంపికకు సంబంధించిన జీవో రావడంతో ఆయన ఈ విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. రెండేళ్లు టీటీడీ బోర్డు డైరక్టర్‌గా ఉన్న తనకు అక్కడి పరిస్థితిపై అంచనా ఉందని,అలాగే బోర్డు సభ్యులతో కలసి టీటీడీ అభివృద్ధికి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అతి తక్కువ సమయంలోనే స్వామివారు దర్శనమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 

ఛైర్మెన్‌ పదవి ఇవ్వడం ఏంతో గర్వించతగ్గ విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గ ప్రజలు త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని కోరారు. ఈ విజ‌యాన్ని బాబుకు కానుకగా ఇస్తానని పేర్కొన్నారు. ఈ పరిణామంతో పుట్టా త‌న ప‌ట్టుద‌ల‌ను వీడ‌డం లేద‌ని, బాబుకు ఎదురు తిరిగేందుకుసైతం రెడీ ఉన్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. 

 

బాబుకు పుట్టా ఎదురు తిరిగిన‌ట్టే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share