రాహుల్, అమిత్ షా…తెలుగోళ్లు మా మీద భరోసా లేదా!

March 19, 2018 at 1:23 pm
Rahul Gandhi, Amit shah, congress party, BJP, Ugadi tweet in telugu, AP people

బీజేపీ సార‌థి.. గుజ‌రాత్ రాష్ట్ర మాజీ హోం మంత్రి అమిత్ షాకి దేశంలో తెలుగు వారంటూ ఒక‌రు ఉన్నార‌ని, తెలుగు రాష్ట్రాలంటూ ఉన్నాయ‌ని ఇప్ప‌టికి కానీ గుర్తుకు రాలేదు! 2014 ఎన్నిక‌ల్లో తెలుగువారు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించిన విష‌యాన్ని ఆయ‌న అప్పుడే మ‌రిచిపోయారు. దీంతో ఆయ‌న‌కు ఈ దేశంలో అస‌లు తెలుగువారు ఉన్నార‌నే విష‌యం కూడా గుర్తు లేకుండా పోయింది. 

 

దీంతో ఆయ‌న ఎప్పుడూ తెలుగు వారిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఏదేమైన ఉత్త‌రాది వాడిగా.. త‌న‌కు అవ‌స‌రమైన‌ప్పుడు మాత్ర‌మే ఇత‌రుల‌ను గుర్తుపెట్టుకోవ‌డంలో అమిత్‌షా ఆరితేరిపోయాడ‌ని అంటుంటారు ఆయ‌న గురించి తెలిసిన వారు. ఇక‌, ఇప్పుడు అదే ప‌ద్ధ‌తిలో ఏపీలో తెలుగు వారంటూ ఒక‌రున్నార‌ని, వారు నిత్యం అనేక స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతున్నార‌ని కూడా అమిత్ ఏనాడూ ప‌ట్టించుకోలేదు. 

 

పైగా ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీని తుంగ‌లో తొక్కినప్పుడు కానీ, ఏపీకి ఇచ్చిన ప్యాకేజీ హామీల‌ను నెర‌వేర్చ‌న‌ప్పుడు కానీ అమిత్ షాకి తెలుగు వారు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా గుర్తుకు రాలేదు. అయితే, తాజాగా మ‌ళ్లీ ఆయ‌న‌కు తెలుగు వారిపై ప్రేమ పొంగిపోయింది. తెలుగు వారే కాదు, వారి పండుగ‌లు కూడా గుర్తుకు వ‌చ్చాయి. వారి సంస్కృతి కూడా ఆయ‌న‌ను నిద్ర పోనివ్వ‌లేద‌ట‌. 

Amit shah

 

దీంతో ఆయ‌న నిన్న జ‌రుపుకొన్న తెలుగు సంవ‌త్స‌రాదికి సంబంధించి తెలుగు వారికి మూకుమ్మ‌డిగా తెలుగులోనే అతి పెద్ద సందేశాన్ని పంపేశారు. తెలుగు వారి సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు, ఆచార వ్య‌వ‌హారాల‌కు, ప్ర‌తీకగా నిలిచే ప‌విత్ర‌మైన ఉగాది సంద‌ర్భంగా కొత్త సంవ‌త్స‌రం అంద‌రి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాల‌ని ఆకాంక్షిస్తూ తెలుగు వారంద‌రికీ శ్రీ విళంబి నామ సంవ‌త్స‌ర నూత‌న ఉగాది శుభాకాంక్ష‌లు అంటూ అమిత్ షా తెలుగువారిపై ప్రేమను కురిపించేశారు. 

 

వాస్త‌వానికి కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఇప్ప‌టికి నాలుగేళ్లు పూర్త‌య్యాయి. ఇన్నాళ్ల‌లో ఏనాడూ కూడా బీజేపీ ప్ర‌భుత్వం ఒక్క‌సారి కూడా తెలుగు వారికి శుభాకాంక్ష‌లు చెప్పిన పాపాన పోలేదు. క‌నీసం తెలుగు పండుగ‌ల గురించిన ప్ర‌స్థావ‌న చేసిన పాపాన కూడా పోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం హ‌ఠాత్తుగా తెలుగు ఉగాది అంటూ ప్ర‌త్యేకంగా ప‌ల‌క‌రిస్తోందంటే.. కార‌ణం.. మ‌రో ప‌ది మాసాల్లో ఎన్నిక‌లు ఉండ‌బ‌ట్టే అంటున్నారు విశ్లేష‌కులు. 

 

అంతేకాదు, ఇప్పుడు అధికార టీడీపీతో పొత్తు కూడా క‌ట్ కావ‌డంతో బీజేపీకి ఇప్పుడు నేరుగా తెలుగు వారిని బుజ్జ‌గించుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది దీంతోనే అమిత్ షా.. గుర్తు పెట్టుకుని మ‌రీ ఉగాది శుభాకాంక్ష‌లు చెప్పార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 

 

రాహుల్‌ది అదే బాటా…

అమిత్ షా అంత కాక‌పోయినా తెలుగు వాళ్ల గురించి ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఏ నాడు ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. కాక‌పోతే అమిత్ షాతో పోలిస్తే కాస్త బెట‌ర్‌. రాహుల్ ఇటీవ‌ల ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ, తెలంగాణ స‌మ‌స్య‌ల విష‌యంలోనూ త‌న వంతుగా స్పందిస్తున్నాడు. అయితే తెలుగు వారిపై రాహుల్‌కు మ‌రీ ప్ర‌త్యేక‌మైన ప్రేమ అయితే లేదు. రాహుల్ కూడా తాజాగా తెలుగు వారికి ఉగాది సంద‌ర్భంగా తెలుగులోనే ట్వీట్ చేసి శుభాకాంక్ష‌లు చెప్పారు. ఏదేమైనా.. రాజ‌కీయాలు ఇలానే ఉంటాయి మ‌రి!! 

rahul

 

రాహుల్, అమిత్ షా…తెలుగోళ్లు మా మీద భరోసా లేదా!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share