మోడీకి దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చిన రాహుల్‌

May 5, 2018 at 4:15 pm

క‌ర్ణాక‌ట ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ నేత రాహుల్‌, ప్ర‌ధాని మోడీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్ర‌ధానంగా విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోఫ‌ణ‌ల‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ వేడెక్కుతోంది. అయితే క‌ర్ణాక‌ట‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్‌గాంధీదే పైచేయిగా క‌నిపిస్తోంది. రాహుల్‌గాంధీ సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌తో మోడీతోపాటు ఆ పార్టీ నేత‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్ప‌టికే రాహుల్‌గాంధీ, సీఎం సిద్ధ‌రామ‌య్య ఎఫెక్ట్‌తో బీజేపీ నేత‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ త‌న ప‌ర్య‌ట‌న‌ను అర్థంత‌రంగా ముగించుకున్నారు.

 

శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉండ‌గా.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్న‌మే ఆయ‌న తిరిగి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెళ్లారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరగున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఇంకో ఏడు రోజులే ఉన్నందున పార్టీలు ఒకదానిపై మరొకటి మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఈనెల 15న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉండ‌గా.. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఆ రాష్ట్రంలోని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలతో ప్రధాని మోదీ ‘నమో యాప్‌’ ద్వారా మాట్లాడిన విషయం తెలిసిందే. 

 

బీజేపీ ప్రభుత్వం మహిళా సంరక్షణకు ఎంతగానో కృషి చేస్తున్నా కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందన్న ఓ కార్యకర్త మాటలకు స్పందించిన మోదీ ‘అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్‌ నైజం’ అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్ల దాడికి దిగారు. మోదీ ఎక్కువగానే మాట్లాడతారు.. కానీ అందులో ఏదీ చేతల్లో చూపరంటూ ఓ వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ఇది ఇప్పుడు రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రాహుల్‌వేసిన ప్ర‌శ్న‌లకు స‌మాధానం చెప్ప‌లేక క‌మ‌లం నేత‌లు ఆగ‌మాగం అవుతున్నారు.

 

‘డియర్‌ మోదీజీ… మీరు చాలా బాగా మాట్లాడతారు. ఇక్కడ సమస్య ఏంటంటే మీ మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. మీ మాటల్లో ఉన్న నిజాయతీ కర్ణాటక భాజపా అభ్యర్థుల ఎంపికలో లేదు. ‘కర్ణాటక మోస్ట్‌ వాంటెడ్‌’ ఎపిసోడ్‌లా మీ మాటలున్నాయి. అవినీతిపరులైన గాలి బ్రదర్స్‌కు అత్యంత సన్నిహితులైన ఎనిమిది మందికి టికెట్లు‌ ఇచ్చారు. ఈ విషయంపై ఓ ఐదు నిమిషాలు మాట్లాడగలరా?. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పపై చీటింగ్‌, అవినీతి, ఫోర్జరీ వంటి 23కేసులున్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్రానికి సీఎం కావాలనుకుంటున్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలేనా?  బీజేపీలోని 11మంది అగ్రనేతల అవినీతిని గురించి ఎప్పుడు మాట్లాడతారు?. శ్రీరాములు అనే బీజేపీ మాజీ మంత్రిపై మూడు కేసులున్నాయి. గాలి జనార్దన్‌ రెడ్డి సోదరుడైన సోమశేఖర రెడ్డిపై ఐదు క్రిమినల్‌ కేసులున్నాయి. 

 

కంప్లీ నుంచి పోటీ చేస్తున్న గాలి అనుచరుడిపై ఆరు క్రిమినల్‌ కేసులున్నాయి. బీజేపీకి చెందిన మాజీ హౌసింగ్‌ మంత్రి కట్టా సుబ్రహ్మణ్య నాయుడుపై నాలుగు క్రిమినల్‌ కేసులున్నాయి. చిక్క‌మంగళూరు అభ్యర్థిపై మూడు క్రిమినల్‌ కేసులన్నాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న శోభా కరందాజ్లేపై మనీ లాండరింగ్‌ కేసు ఉంది. వీటన్నింటిపై మీరు నోరువిప్పుతారని ఆశిస్తున్నాను. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను. కావాలంటే మీరు చేతిలో పేపర్‌ పట్టుకునే సమాధానం చెప్పొచ్చు’ అంటూ రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా మోడీకి సవాల్‌ విసిరారు.

 

మోడీకి దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చిన రాహుల్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share