పుల్లారావును ఓడిస్తే .. జగన్ కేబినెట్లోకి ఫైర్ బ్రాండ్ ర‌జ‌నీ.. !

September 10, 2018 at 4:57 pm

రాజకీయాలన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎవరైనా ఊహిస్తే అది రాజకీయమే కాదు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో సహా పెకలిస్తారని ఎవరూ అనుకోలేదు. కట్ చేస్తే 2011 లో కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్ మోహన్ రెడ్డి ఏపీలో శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో చరిత్రే లేకుండా చేస్తాడ‌ని ఎవరూ అనుకోలేదు. రాజకీయం అంటే అదే. ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ ఓ యుంగ్ అండ్ డైనమిక్ లేడి ఎంట్రీ కూడా అదే పంథాలో కొనసాగుతోంది. ఏడాది క్రితం ఆమె సాధారణ ఎన్నారై మహిళా మాత్రమే. ఏడాది తరువాత కట్ చేస్తే ఆమె ప్రధాన పార్టీ వైసీపీ నుంచి ఎమ్యెల్యే అభ్యర్థి.

40533980_313799749426253_7127871803967406080_o

పట్టుదల , కృషి, సంకల్పం ఉంటే కాదేది అసాధ్యం అన్న సూక్తిని నిజం చేస్తూ ఎన్నైరై మహిళ విడుదల రజని కుమారి గుంటూరు జిల్లా చిలకలూరిపేట కేంద్రంగా.. రాజకీయ ప్రస్థానం ప్రారంబించి ఏడాది కాలంలోనే ఏపీ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. వాస్తవంగా రజనీ కుమారిని ఏపీ సీఎం చంద్రబాబు కి పరిచయం చేసింది మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అయినా ఆమె ఫ్యామిలీకి స్థానికంగా ఆమె కుటుంబానికి మంచి పేరు ఉంది. సేవా కార్యక్రమాల్లో విడుదల ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది. ఇక వీఆర్ ఫౌండేషన్ ద్వారా గత రెండేళ్లుగా నియోజకవర్గంలో లెక్కకు మిక్కిలిగా పలు సేవా కార్యక్రమాలతో రజనీ కుమారి నియోజకవర్గంలో అన్ని వర్గాలకు దగ్గరయ్యారు.

41079333_316035772535984_2536534949746442240_o

రజని రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే క్రమంలో ఆమెను ఆమె కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా ఆమె పుల్లారావును ఓడించి తీరుతానని శపథం చేశారు. అప్పటికి ఆమె ఏ పార్టీలోనూ లేరు. ఆ తరువాత వెనువెంటనే రాజకీయంగా సమీకరణాలు శరవేగంగా మార్చేశారు. వైసీపీ అధినేత జగన్‌ను కలవడం ఓ ఎన్నారై మహిళా పారిశ్రామికవేత్తగా ఆమె విజయప్రస్థానంతో పాటు సమకాలీన సమగ్ర రాజకీయాలపట్ల ఆమెకు ఉన్న అవగాహన, వాక్చాతుర్యం చుసిన జగన్ ఇలాంటి యుంగ్ అండ్ డైనమిక్ లేడి లీడర్ల అవసరాన్ని గుర్తించి వెంటనే ఆమెను పార్టీలోకి తీసుకుని చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది.

f24dcd58-ea97-4103-95fe-36501fd0f9d0

ర‌జ‌నీ చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా అలా బాధ్యతలు స్వీకరించారో లేదో అప్పుడో ఆమె ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు చెమటలు పట్టడం ప్రారంభం అయ్యింది. రజనీ దూకుడుగా ముందుకు వెళ్లడంతో పాటు స్థానిక సమీకరణాలు ఆమెకు ఎక్కడ ప్లస్ అవుతాయోనని పుల్లారావు టెన్షన్లో ఉన్నట్టు అయన అనుచరులే బాహాటంగా చర్చించుకుంటున్నారు. మంత్రిగా ఉన్న పుల్లారావును ఓడిస్తే రజనీకుమారికి జగన్ క్యాబినెట్లో ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం కూడా జిల్లాలో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జగన్ అధికారంలోకి వస్తే.. తన క్యాబినెట్లో మూడు నుంచి నాలుగు వరకు మహిళలకు క్యాబినెట్ బెర్త్ లు కేటాయించే ఛాన్సులు ఉన్నాయి.

41073937_315967805876114_5298502974694227968_o

మహిళల్లో నగరి ఎమ్యెల్యే ఆర్కే రోజాతో పాటు ఎస్సీ కోటాలో ప్రత్తిపాడు నుంచి విజయం సాధిస్తే మేకతోటి సుచరితతో పాటు ఎస్టీ కోటాలో కురుపాం ఎమ్యెల్యే పాముల పుష్పశ్రీ వాణి, పాలకొండ ఎమ్యెల్యే కళావతి ప్రధానంగా రేసులో ముందంజలో ఉన్నారు. ఇక రజనీ విషయానికి వస్తే .. ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వ్య‌క్తి కాగా.. ఆమె బీసీల్లో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమెకు రెండు రకాలుగా సమీకరణాలు కలిసిరానున్నాయి. దీనికి తోడు వైసీపీలో ఇప్పటికే రెండో రోజాగా గుర్తింపు రావడం కూడా రేపు పార్టీ తరపున ప్రభుత్వం తరపున జగన్ కు ప్లస్ అవుతుందన్న అంచనా కూడా ఉంది. ఇక రజని ముందు ఉన్న టార్గెట్ మంత్రి పుల్లారావు ను ఓడించడమే. ఇందుకోసం ఆమె ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో ? చూడాలి.

40549805_313799812759580_3703524920379047936_o

పుల్లారావును ఓడిస్తే .. జగన్ కేబినెట్లోకి ఫైర్ బ్రాండ్ ర‌జ‌నీ.. !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share